సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

యనెస్కో ఐ.సి.హెచ్. జాబితాలోకి ‘కోల్కతా దుర్గాపూజ’ నమోదు


యునెస్కో సీనియర్ ప్రతినిధులతో కలసి వేడుకలు..
కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల
మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం

ఐ.సి.హెచ్. సామర్థ్యాల నిర్మాణంపై ప్రారంభమైన
రెండు రోజుల చర్చాగోష్టి

Posted On: 27 AUG 2022 9:21PM by PIB Hyderabad

   'కోల్కతాలో దుర్గా పూజ' వైశిష్య్టాన్ని యునెస్కో ఇన్‌ట్యాంజిబుల్  కల్చరల్ హెరిటేజ్ (ఐ.సి.హెచ్.) ప్రాతినిధ్య జాబితా-2021లో విజయవంతంగా నమోదు చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక వేడుకను నిర్వహించింది.  నేషనల్ మ్యూజియం, నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్‌ల సహకారంతో ఐసిహెచ్ కోసం నియమించిన నోడల్ సంస్థ అయిన సంగీత నాటక అకాడమీ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భగా ఐ.సి.హెచ్.కు సంబంధించి సామర్థ్యాల నిర్మాణంపై రెండు రోజుల చర్చా గోష్టిని కూడా నేషనల్ మ్యూజయంలో ప్రారంభించారు.  'కోల్కతాలో దుర్గా పూజ'ను ఐ.సి.హెచ్. పారిస్ నగరంలో జరిపిన సమావేశాల సందర్భంగా ఐ.సి.హెచ్. ప్రాతినిధ్య జాబితాలో ముద్రితం చేశారు.  2021వ సంవత్సరం డిసెంబరు 13నుంచి 18వ తేదీ వరకూ ఈ సమావేశాలు జరిగాయి.

  కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల సంయుక్త కార్యదర్శి లిల్లీ పాండేయ, యునెస్కో 2003 ఐ.సిహెచ్. కన్వెన్షన్ కార్యదర్శి టిమ్ కర్టిస్, యునెస్కో తరఫున భూటాన్, భారత్, మాల్దీవులు, శ్రీలంక దేశాల ప్రతినిధి ఎరిక్ ఫాల్ట్, ఐ.సి.హెచ్. నిపుణురాలు రీతూ సేథి, నేషనల్ మ్యూజియం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శిఖా జైన్, ప్రొఫెసర్ మాన్వి సేథ్, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, యునెస్కో డైరెక్టర్ అరవింద్ కుమార్, సంగీత నాటక అకాడమీకి చెందిన సుమన్ కుమార్, విదేశాగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

https://ci6.googleusercontent.com/proxy/bkoCc2nRekKCRUUS3uqxdId_7PWeO2QkCpIck03AO6tBqWFSxz99PNOVnGyoLSbKYGOp6Vj-GoZq3lvziv0EtZGad8M7mV3SZnJfOapKaGShpv4JwdwQi3Nrhw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001DTMN.jpg

 

https://ci6.googleusercontent.com/proxy/UnjEhyDOSMUADHdn52OXV4mEVYy5TpoHKCLc48AgG927yD4fxkG-KRBKcZX9w7QIlpst3FZUEm-B4cgf1A_2h7ZeFXGfvuiElgGv5kOqV1vGD05FE49Y3vPswA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002TNWW.jpghttps://ci3.googleusercontent.com/proxy/hpm70xWA2hKr7515-QyeCMPxGK2y2ptMqF28HAVELbD1D0UTmJu_aT_EfsesTIeiGkTOAAKrSYg1GnWjI4WKMTtPIW95lHb8C8wg_YukXrST77xyoDA0aRNj0Q=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003BDCM.jpghttps://ci5.googleusercontent.com/proxy/xCk5r9QkQb3z2zKZ2igEznZij5mL47kgX7NC-NMGixjo__VP3DYK7Lww-Sd-mVbdoMXa6waCEHI1AUy1JGzLy4JBaMRwtvYD9wzhaReM8qCqxbl0ClDozC8AoA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0044KXJ.jpghttps://ci6.googleusercontent.com/proxy/07td3sLe-7ATR6DtJDI3WnOfJXcpOC_8HzqGDcfFRYOMsU5njGxy6WcN0UHqizvpDHTEIH63TIi5Yx-DiaWBWcG0BxVzDHuJopTqsTuzjLAW9HfApSX12g50Dg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005I2T4.jpghttps://ci5.googleusercontent.com/proxy/1JqePbna_bVGwObbHuv9FZDZxS_A9O0jcrGSBscbRe6Us6ObFmQqx36_TS-cBSTTDgLJPuyyv22U8uYoVT27Vro0QEx4lG1fSCebjS3VweOxczhawdXCcGGOUQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0061958.jpg

  ఈ సందర్భంగా యునెస్కో ఐ.సి.హెచ్. కన్వెన్షన్ కార్యదర్శి టిమ్ కర్టిస్ మాట్లాడుతూ, యునెస్కో 2003 ఐ.సి.హెచ్. కన్వెన్షన్ పరిణామాలను గురించి వివరించారు. ఐ.సి.హెచ్. వ్యవహార పత్రాలకు సంబంధించి ఇంగ్లీషు, ఫ్రెంచ్ భాషా రూపాలతోపాటుగా, ఇతర భాషలను కూడా యునెస్కో ఇప్పుడు అంగీకరిస్తుందన్నారు. గత నాలుగేళ్లుగా అనియత విద్య గురించి కూడా యునెస్కో కన్వెషన్షన్ కృషిచేస్తూ వస్తోందన్నారు. ప్రస్తుతం  అందుబాటులో ఉన్న వారసత్వ సంపదను రక్షించడం అంటే, ఆ పరిజ్ఞానాన్ని తదుపరి తరానికి  సురక్షితంగా అందిస్తున్నట్టేనని, ఈ ప్రక్రియలో విద్య అనేది కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు.

   భూటాన్, భారతదేశం, మాల్దీవులు, శ్రీలంక దేశాల తరఫున యునెస్కో ప్రతినిధి, డైరెక్టర్ అయిన ఎరిక్ ఫాల్ట్ మాట్లాడుతూ, భాగస్వామ్య వర్గాలవారినీ, విభిన్నమైన గ్రూపుల వారినీ ఒక్కతాటిపైకి తీసుకురావలసిన అవసరం ఉందని, ఈ ప్రక్రియలను ఎలా నిర్వహించాలన్న విషయంలో ఈ చర్చాగోష్టి ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. విభిన్నమైన ఈ సాంస్కృతిక వారసత్వం ప్రాముఖ్యతను గురించి తెలియజెప్పడంలో తమతో కలసి పనిచేసిన వారందరికీ తాను కృతజ్ఞతలు జెబుతున్నానని అన్నారు. ప్రాంతీయ స్థాయిలో ఉదయపూర్‌లో ఒక చర్చాగోష్టిని యునెస్కో నిర్వహించబోతున్నట్టు ఆయన చెప్పారు. దీనితో ఈ ప్రాతంలోని పలుదేశాలకు చెందిన ప్రతినిధులను ఒక చోటికి చేర్చినట్టవుతుందన్నారు.

   కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లిల్లీ పాండేయ మాట్లాడుతూ, యునెస్కోకు చెందిన దాదాపు అన్ని సాంస్కృతిక కన్వెన్షన్లలో, కార్యక్రమాల్లో భారతదేశానికి సభ్యత్వం ఉందన్నారు.  యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ కట్టడాలు 40వరకూ ఉండగా, 14 ఇన్‌ట్యాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంశాలు ప్రాతినిధ్య జాబితాలో నమోదైనట్టు చెప్పారు. కోల్కతా దుర్గాపూజ తాజాగా ఈ జాబితాలో చోటు దక్కించుకుందని అన్నారు. యునెస్కో ఐ.సి.హెచ్. కన్వెన్షన్‌కు చెందిన నాలుగు లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారతదేశానికి గల చిత్తశుద్ధిని ఈ రెండు రోజుల జాతీయ చర్చాగోష్టి ప్రతిబింబిస్తోందని లిల్లీ పాండేయ అన్నారు.

   దుర్గాపూజ స్ఫూర్తిని తెలియజెప్పేందుకు ఈ సందర్భంగా దేవీ అవతరణ పేరిట ఒక నృత్య నాటికను ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే రీతిలో ప్రదర్శించారు. ప్రముఖ ఒడిస్సీ నర్తకి, సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత అయిన కోల్కతాకు చెందిన  శ్రీమతి షర్మిలా బిశ్వాస్ తన  బృందంతో కలసి ఈ నృత్యనాటికను ప్రదర్శించారు.  ఆకట్టుకునే కొరియోగ్రఫీ, సంగీతం, వస్త్రధారణ, ఇతివృత్తాలతో దుర్గాదేవిని అభివర్ణిస్తూ రూపొందించిన ఈ నృత్యనాటిక ప్రదర్శన ఆహూతులను, అతిథులను ఎంతగానో అలరించింది. షర్మిలా బిశ్వాస్ నృత్యనాటిక తర్వాత, భారతదేశం సాంస్కృతిక భిన్నత్వంపై డాక్యుమెంటరీ రూపకాన్ని కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు.

   ఐ.సి.హెచ్. నిపుణురాలు రీతూసేథి మాట్లాడుతూ, ఐ.సి.హెచ్. ప్రామాణికాంశాల సంరక్షణలో భారతదేశం అందించిన సేవలను, ఈ విషయంలో భారతదేశం నిర్వహించిన ప్రముఖపాత్రను గురించి ప్రస్తావించారు. ఇన్‌ట్యాంజిబుల్ కల్చరల్ గ్రూపు అధ్యయన బృందం (సి.ఐ.డి.ఒ.సి.) ప్రతినిధి ప్రొఫెసర్ మాన్వీ సేథ్ మాట్లాడుతూ, ఐ.సి.హెచ్. ఎదుర్కొన్న అనేక సవాళ్లను, భవిష్యత్తులో అది నిర్వహించబోయే పాత్రను విపులంగా వివరించారు. ఐ.సి.హెచ్.ను సాంస్కృతిక ఆవిష్కరణ కర్తగానేకాక, తదుపరి తరాలకు అందించే జ్ఞాన సంపదకు, సాంకేతిక పరిజ్ఞానికి, నైపుణ్యాలకు ప్రతిరూపంగా భారతదేశం పరిగణిస్తోందని అన్నారు.

 సామర్థ్యాల నిర్మాణంపై రెండు రోజుల చర్చాగోష్టిని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించింది. దేశవ్యాప్తంగా ప్రత్యేక చర్చాగోష్టుల పరంపరను ప్రారంభించే లక్ష్యంతో ఈ చర్చాగోష్టిని చేపట్టారు. నిపుణులు, కమ్యూనిటీ భాగస్వామ్య వర్గాల వారి మధ్య సహకారాన్ని పెంపొందించే పద్ధతులను గుర్తించేందుకు, ఐ.సి.హెచ్.కు సంబంధించినపలు అంశాలపై ఈ గోష్టిలో చర్చించారు.  28వ తేదీన జరిగిన చర్చాగోష్టిలో కొచ్చికి చెందిన అఖిల భారత హెరిటేజ్-మ్యూజియం ఫీల్డ్ స్కూల్ కన్వీనర్ డాక్టర్ బి. వేణుగోపాల్ తన సిద్ధాంత పరిశోధనా వ్యాసాన్ని ప్రదర్శించారు. సంప్రదాయ హస్తకళల ప్రక్రియపై సమావేశం కూడా జరిగింది.

  సమావేశ స్థలంలో ఐ.సి.హెచ్.కు సంబంధించిన ప్రదర్శన శాలలను ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పట్టాచిత్ర, కాంతా, పురులియా చాహు, మాస్కులు, నయాగ్రామ్ కలప ఆటబొమ్మలు తదితర ఉత్పాదనలను ఈ ప్రదర్శన శాలల్లో ప్రదర్శించారు. ధక్, ధనుచి నృత్య ప్రదర్శనారీతులను కూడా ప్రదర్శించారు. కోల్కతా దుర్గాపూజను ఐ.సి.హెచ్. జాబితాలో విజయవంతంగా చోటు సంపాదించుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని టిమ్ కర్టిస్ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. సందర్భంగా ఆయనకు దుర్గాదేవి విగ్రహం బహూకరించి సత్కరించారు.

   ఇంట్యాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ పరిరక్షణకు సంబంధించి యునెస్కో-2003 కన్వెన్షన్ అంతర్ ప్రభుత్వ కమిటీలో సభ్యత్వానికి భారతదేశం 2022 జూలై 7వ తేదీన ఎన్నికైంది. 2022నుంచి 2026వరకూ ఈ సభ్యత్వం వర్తిస్తుంది. పారిస్ నగరంలోని యునెస్కో ప్రధాన కేంద్ర కార్యాలయంలో కనెన్షన్-2003 సార్వత్రిక సమావేశం సందర్భంగా 2022 జూలై 5నుంచి 7వ తేదీవరకూ అంతర్ ప్రభుత్వ కమిటీకి ఎన్నికలు జరిగాయి. కమిటీలోని ఆసియా పసిఫిక్ గ్రూపు పరిధిలో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకోసం భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వియత్నాం, కంబోడియా, మలేసియా, థాయిలాండ్, ఇరాన్ వంటి 8 దేశాలు తమ అభ్యర్థిత్వాన్ని సమర్పించాయి. ఈ ఎన్నికలో 155 స్టేట్ పార్టీలు వోటింగ్‌లో పాల్గొనగా, భారతదేశం 110 వోట్ల మెజారిటీతో ఘన విజయం సాధించింది. కమిటీకి భారతదేశం ఎన్నిక కావడంతో, కన్వెన్షన్ పరిధి, ప్రభావం మరింత బలోపేతంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా విభిన్న వారతస్వ సంపదలను పరిరక్షించేందుకు ఇది మరింత దోహదపడుతుంది. తన హయాంలో వారసత్వ సంపద పరిరక్షణకు దార్శనిక ప్రణాళికను భాతదేశం ఇప్పటికే రూపొందించుకుంది. కమ్యూనిటీ భాగస్వామ్యానికి, వారసత్వ సంపద పరిరక్షణలో అంతర్జాతీయ సహకారాన్ని, వివిధ అధ్యయన సంస్థలతో పరిశోధనను పెంపొందింప జేయడానికి భారతదేశం తన దృష్టిని కేంద్రీకరిస్తుంది. అలాగే, ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా కన్వెన్షన్ తరఫన కృషి చేసేందుకు భారత్ ప్రాధాన్యం ఇస్తుంది.

     'కోల్కతాలో దుర్గా పూజ' వైశిష్య్టం  ఐక్యరాజ్యసమితిలోని ఇన్‌ట్యాంజిబుల్  కల్చరల్ హెరిటేజ్ (ఐ.సి.హెచ్.) ప్రాతినిధ్య జాబితా-2021లో పారిస్ నగరంలో జరిగిన  కన్వెషన్ 16వ సమావేశంలో నమోదైంది. పారిస్‌లో 2021 డిసెంబరు 13నుంచి 18వ తేదీవరకూ ఈ సమావేశం జరిగింది. దుర్గాపూజ ప్రత్యేకతను, మహళలతో పాటు అన్ని వర్గాలను కలుపుకునిపోయే దుర్గా ఉత్సవాల వైశిష్ట్యాన్ని కమిటీ ఎంతగానో ప్రశంసించింది. ఇది మహిళాశక్తి దివ్యత్వాన్ని తెలియజెప్పడమేకాక, నృత్యం, సంగీతం, హస్తకళలు తదితర సాంస్కృతిక అంశాలను కూడా చక్కగా వ్యక్తీకరిస్తుందని కమిటీ అభిప్రాయపడింది. కుల, వర్ణ, ఆర్థిక స్థితిగతులకు అతీతంగా దుర్గాపూజ పర్వదినాన్ని జరుపుకోవడం గొప్ప విశేషంగా కమిటీ పరిగణించింది. దీనితో యునెస్కో ఐ.సి.హెచ్. హ్యుమానిటీ ప్రాతినిధ్య జాబితాలో భారతదేశ వారసత్వ సంపదకు సంబంధించి 14 అంశాలు ఇప్పటికే నమోదయ్యాయి.

 

*****



(Release ID: 1855134) Visitor Counter : 129


Read this release in: English , Urdu , Hindi