పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

పుదుచ్చేరిలో స్వచ్ఛ సాగర్, సురక్షిత్ సాగర్ ప్రచారంలో పాల్గొన్న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి


సమాజ భాగస్వామ్యంతో తీర, సముద్ర పరిశుభ్రత మెరుగుదల లక్ష్యంగా 75 రోజుల ప్రజా నాయకత్వ చొరవ

పుదుచ్చేరిలోని ఈడెన్ బీచ్ లో బీచ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ను పరిశీలించిన కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్

Posted On: 27 AUG 2022 10:04AM by PIB Hyderabad

కేంద్ర పర్యావరణ , అటవీ , వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ పుదుచ్చేరి లోని ఈడెన్ బీచ్ లో బీచ్ మౌలిక స దుపాయాలను పరిశీలించారు. పుదుచ్చేరిలోని ప్రొమెనేడ్ బీచ్ లో ఒక రోజు బీచ్ క్లీన్ అప్ క్యాంపెయిన్ ను కూడా

నిర్వహించారు.

బీచ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు, సందర్శకుల భద్రత కోసం తీసుకున్న భద్రత, ప్రమాద నివారణ చర్యలను కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ పరిశీలించారు. పుదుచ్చేరి ప్రభుత్వ అధికారులతోనూ, బీచ్ నిర్వహణ బృందం తొనూ, ఈడెన్ బ్లూ ఫ్లాగ్ బీచ్ వద్ద పర్యాటకులతోనూ కేంద్ర మంత్రి సంభాషించారు.

 

కేంద్ర పర్యావరణ , అటవీ, వాతావరణ మార్పుల శాఖమంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పుదుచ్చేరి ముఖ్య మంత్రి శ్రీ ఎన్.రంగస్వామి తో కలసి  బీచ్ క్లీనింగ్ అవగాహన శిబిరానికి నేతృత్వం వహించారు.

ప్రోమెనేడ్ బీచ్ వద్ద జరిగిన ఈ క్యాంపెయిన్ లో పాఠశాల పిల్లలు , బీచ్ వినియోగదారులు ఇంగ్లిష్ తమిళంలో "ఐ యామ్ సేవింగ్ మై బీచ్" ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పెయింటింగ్ పోటీల విజేతలకు  బహుమతులు  అందజేశారు. 100 మంది పాఠశాల విద్యార్థులు, సైక్లిస్టులు పాల్గొన్న

వాక్ ధాన్ ను,  "కనెక్టింగ్ విత్ ది ఓషన్" పై ఫ్లోట్ ను కేంద్ర మంత్రి, ఇతర ప్రముఖులు జెండా ఊపి ప్రారంభించారు. పుదుచ్చేరిలోని వివిధ పాఠశాలలకు చెందిన 200 మందికి పైగా పిల్లలు, ఎన్ సి సి క్యాడెట్లు, స్కౌట్స్ అండ్ గైడ్స్, పుదుచ్చేరి ప్రభుత్వ అధికారులు, సాధారణ ప్రజలు కలసి ప్రొమెనేడ్ బీచ్ లో పెద్ద ఎత్తున పరిశుభ్రత  ప్రచారం నిర్వహించారు. "పరిశుభ్రమైన తీరం -సురక్షితమైన సముద్రాల" కోసం బీచ్ లు , తీరం వెంబడి నివసించే ప్రజలలో అవగాహన కల్పించడం ఈ ప్రచారం ప్రాథమిక లక్ష్యం.

 

"ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" అనేది భారత ప్రభుత్వం 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి , దాని ప్రజలు, సంస్కృతి ,విజయాల అద్భుతమైన చరిత్రను జరుపుకోవడానికి స్మరించుకోవడానికి చేపట్టిన ఒక చొరవ.

 

"స్వచ్ఛ సాగర్, సురక్షిత్ సాగర్/ క్లీన్ కోస్ట్, సేఫ్ సీ" ప్రచారాన్ని కమ్యూనిటీ భాగస్వామ్య చర్య ద్వారా తీరప్రాంత , సముద్ర ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా 75 రోజుల పాటు నిర్వహించడానికి జూలై 5, 2022 న ప్రారంభించారు. 17 సెప్టెంబర్ 2022 అంతర్జాతీయ తీర శుభ్రత దినోత్సవం.

రోజున ఈ ప్రచార కార్యక్రమం ముగుస్తుంది

ప్రవర్తనా మార్పు ద్వారా పర్యావరణాన్ని మార్చడం , సంరక్షించడం అనేది ఈ ప్రచార కార్యక్రమం మూడు వ్యూహాత్మక అంతర్లీన లక్ష్యం. . ప్రచారం యొక్క మూడు విస్తృత లక్ష్యాలు:

1. బాధ్యతాయుతంగా తినండి,

2. ఇంటి వద్ద వ్యర్థాలను వేరు చేయండి,

3. వ్యర్థాలను బాధ్యతాయుతంగా పారవేయండి.

పర్యావరణ అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎం వో ఈ ఎఫ్ సి సి), ఇండియన్ కోస్ట్ గార్డ్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్ డి ఎం ఏ), ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలు/ సంస్థలు, ఇతర సామాజిక సంస్థలు, విద్యా సంస్థల భాగస్వామ్యంతో ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ (ఎంవోఈఎస్) ఈ ప్రచారాన్ని నిర్వహిస్తొంది.

తీర రేఖ వెంబడి ఉన్న 75 బీచ్ ల వద్ద కోస్టల్ క్లీన్ అప్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ప్రతి కిలోమీటరు తీరానికి సగటున 75 మంది వాలంటీర్లు ఉన్నారు. కోస్టల్ ఎకోసిస్టమ్, మెరైన్ ఎన్విరాన్ మెంట్, సేఫ్ బీచ్, వేస్ట్ మేనేజ్ మెంట్ పై నేషనల్ కాన్ఫరెన్స్ ,వర్క్ షాప్ లు జరుగుతున్నాయి.

పాఠశాల విద్యార్థులు, స్కౌట్స్, ఎన్ సి సి క్యాడెట్లు, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, ఎన్ జి ఓ లు, బీచ్ యూజర్ లతో కూడిన సమాజ భాగస్వామ్యం ద్వారా కమ్యూనిటీ పార్టిసిపేషన్ ద్వారా వివిధ బీచ్ లు , తీర ప్రాంతాల్లో కూడా ప్రచార సమయం లో అవగాహన కల్పిస్తున్నారు.

 

'లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్ మెంట్ (LiFE) ఉద్యమంపై గౌరవ ప్రధాన మంత్రి గ్లోబల్ చొరవకు అనుగుణంగా, పర్యావరణ సుస్థిరతను పెంపొందించే జీవనశైలి ,ప్రవర్తనా మార్పులను లక్ష్యంగా చేసుకోవడమే దీని లక్ష్యం; సుస్థిర అభివృద్ధిని బలోపేతం చేయడానికి మానవ కేంద్రిత సమిష్టి కృషికి ఇది పిలుపు ఇస్తోంది.

 

భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ ,వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దేశంలోని భారతీయ బీచ్ లను 'బ్లూ ఫ్లాగ్'గా సర్టిఫై చేయడానికి ఒక పథకాన్ని ప్రారంభించింది. ఈ సర్టిఫికేషన్ ఒక అంతర్జాతీయ సంస్థ " ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్, డెన్మార్క్ " ద్వారా ఇస్తారు. ఇది నాలుగు ప్రధాన కేటగిరీలుగా విభజించబడ్డ 33 కఠినమైన ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది:(i) పర్యావరణ విద్య ,సమాచారం, (ii) స్నానం చేసే నీటి నాణ్యత, (iii) పర్యావరణ నిర్వహణ, సంరక్షణ, (iv) బీచ్ భద్రత ,సేవలు.'బ్లూ ఫ్లాగ్' బీచ్ ఒక ఎకో-టూరిజం మోడల్, ఇది పర్యాటకులు , పరిశుభ్రమైన ,శానిటరీ స్నానపు నీరు, సౌకర్యాలు  సురక్షితమైన, ఆరోగ్యకరమైన పర్యావరణం ఇంకా ఈ ప్రాంత దీర్ఘకాలిక పర్యావరణ-అభివృద్ధిని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎనిమిది బీచ్ ల మొదటి వరసలో , పుదుచ్చేరిలోని ఈడెన్ బీచ్ సెప్టెంబర్ 2020 నుండి ధృవీకరించబడిన బ్లూ ఫ్లాగ్ బీచ్ గా ఉంది. .

 

******



(Release ID: 1855108) Visitor Counter : 177