మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

రియాసీలో మ‌త్స్య సాగు కేంద్రాన్ని ద‌ర్శించి, జ్యోతిపురం గోశాల‌లో లంపీస్కిన్ డిసీజ్‌కు వాక్సినేష‌న్ డ్రైవ్‌ను ప్రారంభించిన డాక్ట‌ర్ ఎల్‌. ముర‌గ‌న్


ప్ర‌ధాన‌మంత్రి మ‌త్య్స సంప‌ద యోజ‌న (పిఎంఎంఎస్‌వై) కింద ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ప్ర‌చారంలో భాగంగా, విశేషంగా కొండ ప్రాంతాల‌లోని లోత‌ట్టు ప్రాంతాల‌పై ప్ర‌భుత్వం దృష్టి కేంద్రీక‌రిస్తోంద‌న్న మంత్రి

Posted On: 27 AUG 2022 7:42PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి మ‌త్స్య సంప‌ద యోజ‌న (పిఎంఎంఎస్‌వై) కింద ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ప్ర‌చారంలో భాగంగా కొండ ప్రాంతాల‌లోని లోత‌ట్టు ప్ర‌దేశాల‌లో మ‌త్స్య ఉత్ప‌త్తిపై దృష్టి కేంద్రీక‌రిస్తోంద‌ని కేంద్ర మ‌త్స్య‌, ప‌శుసంవ‌ర్ధ‌క‌, పాడి, స‌మాచార‌, ప్ర‌సార శాఖ‌ల స‌హాయ మంత్రి డాక్ట‌ర్ ఎల్‌. ముర‌గ‌న్ ఆదివారం వెల్ల‌డించారు. ఈ విష‌యాన్ని జ‌మ్ము, కాశ్మీర్‌లోని రియాసీ జిల్లాలోని మ‌త్స్య సాగు కేంద్రాన్ని సంద‌ర్శించిన సంద‌ర్భంగా ఆయ‌న ఈ విష‌యాన్ని తెలిపారు. 
త‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా శ్రీ ముర‌గ‌న మ‌త్స్య వ్య‌వ‌సాయ‌దారుల‌తో ముచ్చ‌టించి, ప్ర‌ధాన‌మంత్రి మ‌త్స్య సంప‌ద యోజ‌న (పిఎంఎంఎస్‌వై) కింద మ‌త్స్య‌ ఉత్ప‌త్తిని పెంచేందుకు అవ‌స‌ర‌మైన విత్త‌నాల‌ను అంద‌చేశారు. 
వినియోగ డిమాండ్‌నే కాక ఎగుమ‌తుల డిమాండ్‌ను నెర‌వేర్చేందుకు ముఖ్యంగా మంచినీటి చెరువు చేప‌ల ఉత్ప‌త్తిని పెంచి, ప్ర‌ధాన స్ర‌వంతిలో క‌లిసేందుకు  మ‌త్య్స సాగులో అధునాత‌న సాంకేతిక‌ను ఉప‌యోగించ‌వ‌ల‌సిందిగా మంత్రి మ‌త్య్స‌సాగుదారుల‌కు స‌ల‌హా ఇచ్చారు. 
రీస‌ర్క్యులేటింగ్ ఆక్వాక‌ల్చ‌ర్ సిస్టం ( నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించే ప‌ద్ధ‌తి - ఆర్ఎఎస్‌), మంచినీటి చెరువుల‌లో మ‌త్స్య సాగు వంటి లోత‌ట్టు మ‌త్స్య సాగును ప్రభుత్వం ప్రోత్స‌హిస్తోంద‌ని శ్రీ ముర‌గ‌న్ అన్నారు. దేశంలో కొండ ప్రాంతాల‌కు ప్ర‌త్యేక ప్ర‌ముఖ్య‌త‌ను ఇచ్చి, లోత‌ట్టు ప్రాంతంలో మ‌త్య్స‌సాగును ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ద‌ని ఆయ‌న తెలిపారు.  
మ‌త్య్స‌రంంలో 2014 నుంచి ఈ ఎనిమిదేళ్ళ‌లో, మొద‌టిసారి రూ. 32,000 కోట్ల పెట్టుడిని మ‌త్య్స‌రంగంలో పెట్టుబ‌డి పెట్ట‌డం జ‌రిగింద‌ని, ఫ‌లితాలు అంద‌రిక‌ళ్ళ ఎదుటే క‌నిపిస్తున్నాయ‌న్నారు. ఈ పెట్టుబ‌డి కార‌ణంగా దేశంలో నీలి విప్ల‌వం చోటు చేసుకుంటోంద‌ని పేర్కొన్నారు.  
పిఎంఎంఎస్‌వై అన్న‌ది ప్ర‌ధాన‌మంత్రి క‌ల‌ల ప్రాజెక్టు అని, ఈ క‌ల‌ను సాకారం చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో స‌న్నిహితంగా క‌లిసి ప‌ని చేస్తోంద‌న్నారు. 
జిల్లాలోని జ్యోతిపురం గోశాల‌లో లంపీ స్కిన్ డిసీస్ (ఒక‌ర‌క‌మైన వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్‌)కు వ్య‌తిరేకంగా వాక్సినేష‌న్ డ్రైవ్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. ఈ డ్రైవ్‌ను ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ నిర్వ‌హించింది. 

 

***
 



(Release ID: 1855105) Visitor Counter : 99


Read this release in: English , Urdu , Hindi