ఆర్థిక మంత్రిత్వ శాఖ
మౌలిక సదుపాయాల ఫైనాన్స్ సెక్రటేరియట్ (ఐఎఫ్ఎస్),డిపార్టమెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్, మహారాష్గ్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్టేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఔట్‌రీచ్ వర్క్ షాప్
Posted On:
24 AUG 2022 4:20PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా మౌలికసదుపాయాల ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసేందుకు , ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ సెక్రటేరియట్ (ఐఎఫ్ఎస్), మహారాష్ట్ర ప్రభుత్వఅర్బన్ డవలప్ మెంట్ విభాగం భాగస్వామ్యంతో ఈనెల 22న ముంబాయి నారిమన్ పాయింట్ లోని ట్రిడెంట్ హోటల్ లో ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించింది. గుజరాత్, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలతో మౌలికసదుపాయాలకు సంబంధించి ఈ ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు.
కీలక మౌలిక సదుపాయాల మంత్రిత్వశాఖలతో కలసి రాష్ట్రప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలసి నిర్వహిస్తున్న వరుస వర్క్ షాపులలో ఇది మొదటిది. వివిధ ప్రాజెక్టు అథారిటీలు భారీ మౌలికసదుపాయాల ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే సమస్యలను అవగాహన చేసుకునేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ వర్క్ షాప్ కింద కీలక మౌలిక సదుపాయాలకు సంబంధించిన కేంద్ర మంత్రిత్వశాఖలైన గృహ , పట్టణ వ్యవహారాలు, రోడ్డు, రవాణా, రహదారులు, విద్యుత్ మంత్రిత్వశాఖ, పరిశ్రమల ప్రోత్సాహక అంతర్గత వాణిజ్య మంత్రిత్వశాఖ, దాని అమలు ఏజెన్సీలైన హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవేస్ (ఎన్.హెచ్.ఎ.ఐ), ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ లిమిటెడ్ (ఎన్.హెచ్ .ఐ.డి.సి.ఎల్), సెంట్రల్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటి ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సిటియుఐఎల్)కు చెందిన సీనియర్ అధికారులు ప్రజెంటేషన్ లు ఇచ్చారు.
ఈ వర్క్ షాప్‌లో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వాలకు చెందిన 50 మందికిపైగా సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ వర్క్‌షాప్ లో పాల్గొన్న వారిలో కర్ణాటక ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి, గుజరాత్ ప్రభుత్వ ప్రణాళికా విభాగం కార్యదర్శి, మహారాష్ట్రప్రభుత్వ అర్బన్ డవలప్‌మెంట్ ప్రిన్సిపుల్ సెక్రటరీ, ఆయా రాష్ట్రాలలోని ప్రధాన నగరాలకు చెందిన మున్సిపల్ కమిషనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ వేదిక ద్వారా కీలక మౌలిక సదుపాయాల మంత్రిత్వశాఖలకు చెందిన అధికారులతో , ఈ పథకాల అమలు ఏజెన్సీలు, నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ ఐఐఎఫ్), ఇంటర్నేషనల్ ఫైనాన్స కార్పొరేషన్ (ఐఎఫ్‌సి) వంటి వాటి ప్రతినిధులతో మాట్లాడేందుకు వీరికి అవకాశం లభించింది. ఈ సమావేశం ద్వారా ప్రస్తుత మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో ఎదురౌతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించడం జరిగింది.
వర్క్ షాప్‌లో పానెల్ చర్చలు, అర్బన్ ఫైనాన్సింగ్ అవకాశాల పెంపు, మునిసిపల్ బాండ్లు, ఆర్థిక వనరుల సమీకరణకు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, రాష్ట్రప్రభుత్వాల ప్రత్యేక పిపిపి విధానాలు ఇతర సన్నద్ధతల గురించి ఈ వర్క్‌షాప్‌లో చర్చించారు. కొత్తగా ఎంపానల్ చేసిన ట్రాన్సాక్షన్ అడ్వయిజర్ల యంత్రాంగం గురించి కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం రాష్ట్రప్రభుత్వాలకు వివరించింది.అలాగే పిపిపి ప్రాజెక్టులకు ఆర్థిక మద్దతునిచ్చేందుకు ఆర్థిక వనరులు, పథకాలు ఉపయోగించుకునేందుకు గల యంత్రాంగం గురించి కూడా ఈ వర్క్‌షాప్‌లో వివరించడం జరిగింది.
మునిసిపల్ ఆర్థికవనరులను పెంపొందించేందుకు ప్రత్యేక సెషన్ నిర్వహించారు. అలాగే మునిసిపల్ బాండ్ మార్కెట్‌ను శక్తిమంతం చేసేందుకు తీసుకోవలసిన చర్యల గురించి కూడా చర్చించారు. మౌలిక సదుపాయాల రంగంలో ప్రైవేటు పెట్టుబడులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తరఫున పిపిపి విధానం తీసుకురావలసిన అవసరాన్ని గురించి చర్చించారు. ఈ వర్క్ షాప్ లో భారత ప్రభుత్వ మంత్రిత్వశాఖలైన రోడ్లు, హైవేలు, విద్యుత్, హౌసింగ్ వ్యవహారాలు , డిపిఐఐటి, బిఐఎస్ఎజి -ఎన్ ( పి.ఎం. గతిశక్తి అమలుకు నోడల్ ఏజెన్సీ ,రాష్ట్రాల ప్రాజెక్టులను గతి శక్తి పోర్టల్ లో చేర్చేందుకు తీసుకోవలసిన చర్యలపై ప్రెజెంటేషన్ ఇచ్చాయి. రాష్ట్రాలు ఆయా పథకాల అమలులో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించడం జరిగింది.ఈ అంశాలను సంబంధిత మంత్రిత్వశాఖలు నోట్ చేసుకున్నాయి. మొత్తం మీద ఈ వర్క్‌షాప్ ద్వారా ఆయా రాష్ట్రాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను పరస్పరం తెలుసుకోవడానికి వీలుకల్పించింది.
***
(Release ID: 1854609)
Visitor Counter : 140