నౌకారవాణా మంత్రిత్వ శాఖ
త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి కార్పొరేట్& వినోద సౌకర్యాలతో వారసత్వ విలువ కలిగిన పునరుద్ధరిత యుకె నిర్మిత ప్రత్యేక పాడల్ స్టీమర్
Posted On:
24 AUG 2022 11:38AM by PIB Hyderabad
యుకెలోని డంబర్టన్ ఓడరేవులో 1914లో నిర్మించిన పాడల్ స్టీమర్ (ఆవిరితో, తెడ్ల వంటి చక్రాలతో నడిచే చిన్న ఓడ) పిఎస్ భోపాల్ను శిక్షణా వాహనంగా కోలకతాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టులో (గతంలో కోల్‌కతా పోర్ట్ ట్రస్టుగా తెలిసిన) నెం.22 కెపిడిలో ఉపయోగిస్తున్నారు. ఈ చిన్న ఓడ 63 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల వెడల్పుతో ఉంది. శిక్షణా సంస్థతో లీజు ఒప్పందం 2019లో పూర్తి కావడంతో, ఎస్ఎంపి కోల్‌కతా వారసత్వ సంపద విలువ కలిగిన ఈ చిన్న ఓడను పునరుద్ధరించి, ప్రజల సందర్శించేందుకు ఉంచాలని భావిస్తోందని ఎస్ఎంపి కోల్‌కతా చైర్మన్ శ్రీ వినీత్ కుమార్ తెలిపారు. ఇందుకు అనుగుణంగా, ఆ సమయంలో శిథిలావస్థలో ఉండి, స్వీయ చోదన వ్యవస్థలేని చిన్న ఓడను ఎస్ఎంపి కోల్‌కతా దీర్ఘకాలిక లీజుకు తీసుకుంది.
లీజు వ్యవధిలో చిన్న ఓడ ఎస్ఎంపి కోల్‌కతా ఆస్తిగా ఉంటుందనే షరతుతో బహిరంగ టెండరింగ్ ద్వారా దీర్ఘకాలిక లీజుకు ఎంపిక జరిగింది.
లీజు షరతుల ప్రకారం, పిఎస్ భోపాల్ ఓడుకు పక్కన గల లంగరు వేసే స్థలంలో లేదా రేవు కట్ట వద్ద ఉండటమే కాక తన స్వంత శక్తితో స్వీయచోదనాన్ని కలిగి ఉంటుంది. ఆ చిన్న ఓడ ప్రదర్శనకు స్థలం, రెస్టారెంటు, చిన్న అసెంబ్లీ తదిరాలను కలిగి ఉంటుంది.
పైన పేర్కొన్న చిన్న ఓడ పూర్తి అయ్యే క్రమంలో ఉంది. ఆ ఓడను ఎక్కే ప్రయాణీకుల భద్రతను నిర్ధారించేందుకు నదిలో కొన్ని ట్రయల్స్ జరిగాయి.
పైన పేర్కొన్న పునరుద్ధరించిన చిన్న ఓడను ప్రారంభించేందుకు ఎస్ఎంపి కోల్‌కొతా యోచిస్తోంది. ఎస్ంపి కోల్‌కతా చైర్మన్ శ్రీ వినీత్ కుమార్ ప్రకారంభారత ఉపఖండంలో తొట్టతొలి వాహనాన్ని వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం తెడ్డు పని చేయనప్పటికీ, పడవ ప్రాతమకి వ్యవస్థను మార్చకుండా, చోదన శక్తి కలిగిన కొత్త ప్రధాన ఇంజన్‌ను అందులో అమర్చారు. తద్వారా 1944లో దానిని నిర్మించిన సమయంలోని అనుభూతిని పడవ ఎక్కిన ప్రయాణీకులు నదిలో విహరించినప్పుడు కలిగేలా ఈ మార్పులు చేశారు.
****
(Release ID: 1854117)