యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఖేలో ఇండియా మహిళల హాకీ లీగ్ (అండర్-16) ఫేజ్-1 లో అగ్రస్థానంలో నిలిచిన ప్రితమ్ శివాచ్ అకాడమీ
Posted On:
23 AUG 2022 6:48PM by PIB Hyderabad
మంగళవారం మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో ముగిసిన ఖేలో ఇండియా మహిళల హాకీ లీగ్ (అండర్-16) ఫేజ్ 1లో సోనెపట్‌లోని ప్రీతమ్ శివాచ్ హాకీ అకాడమీ అగ్రస్థానంలో నిలిచింది. కుల్దీప్ సివాచ్ శిక్షణ పొందిన అకాడమీ అమ్మాయిలు, వారి 7 పూల్ గేమ్‌లను +134 పాయింట్ల అద్భుతమైన గోల్ తేడాతో గెలిచారు.
హరియాణాలోని హెచ్‌ఏఆర్ హాకీ అకాడమీ రెండో స్థానంలో నిలవగా, మధ్యప్రదేశ్ హాకీ అకాడమీ మూడో స్థానంలో నిలిచింది. ఈ రెండు 19 పాయింట్లతో ముగించారు. కానీ హెచ్‌ఏఆర్ అకాడమీ మెరుగైన గోల్ తేడాను నమోదు చేసింది.
ఫేజ్ 1లో మొత్తం ఏడు రోజుల పాటు 56 మ్యాచ్‌లు నిర్వహించగా, 16 జట్లు పాల్గొన్నాయి. సబ్ జూనియర్ మహిళల కోసం ఒక రకమైన హాకీ లీగ్ మూడు దశల్లో జరగాల్సి ఉంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ 3 ఫేజ్‌ల పోటీల కోసం మొత్తం రూ. 53.72 లక్షలను కేటాయించింది. ఇందులో రూ. 15.5 లక్షల ప్రైజ్ మనీ కూడా ఉంది.
3 దశల్లో విజేతగా నిలిచిన జట్టుకు రూ. 5 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు.
ప్రీతమ్ శివాచ్ అకాడమీ అమ్మాయిలు చేసిన ప్రయత్నాల గురించి, కుల్దీప్ శివాచ్ మాట్లాడుతూ, “మా జట్టు చాలా అద్భుతంగా ఆటలో పాల్గొంది. ప్రతి విజయం తర్వాత వారు చాలా ప్రేరణ పొందారు. లోపాలను కనుగొని వాటిని నివృత్తి చేసుకునేందుకు ఇది ఉత్తమ పోటీలలో ఒకటి. ఈ విజయాలు దీర్ఘకాలంలో దేశం కోసం ఆడగలననే ఆత్మవిశ్వాసాన్ని పొందేందుకు మరియు కష్టపడి పనిచేయడానికి అమ్మాయిలకు స్ఫూర్తినిస్తాయి. మాకు ప్లాట్‌ఫారమ్ ఇచ్చినందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు హాకీ ఇండియాకు ధన్యవాదాలు.”
ఈ హాకీ అకాడమీ వెనుక స్ఫూర్తిగా నిలిచిన మాజీ అర్జున మరియు ద్రోణాచార్య అవార్డు గ్రహీత ప్రీతమ్ శివాచ్ ఉన్నారు. అండర్-16 పోటీ బాలికలకు ఖేలో ఇండియా పథకంలో భాగం కావడానికి అన్ని రకాల సంసిద్ధతను ఇస్తుందని తెలిపారు. “అండర్-16 అమ్మాయిలు పాల్గొన్న ఈ ఈవెంట్లలో పోటీ వాతావరణాన్ని చూడటం ఒక అద్భతం. అండర్ 16 బాలికల కోసం ఇటువంటి పోటీ వాతావరణాన్ని అందించినందుకు నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు హాకీ ఇండియాకు ధన్యవాదాలు.
"మా వద్ద అండర్ 21 కోసం కూడా ఒక టోర్నమెంట్ ఉంది. బాలికలు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఈ గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. మాకు ఈ స్థాయిలో పోటీలు చాలా తక్కువ, ఖేలో ఇండియా పథకంలో పాల్గొని భవిష్యత్తులో దేశం కోసం ఆడేందుకు అమ్మాయిలు ఇలాంటి పోటీల నుండి మాత్రమే ప్రయోజనం పొందగలరు” అని ప్రీతమ్ సివాచ్ అన్నారు.
ఖేలో ఇండియా మహిళల హాకీ లీగ్ (అండర్-16) ఫేజ్ 2 అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నిర్వహించనున్నారు.
*******
(Release ID: 1854003)
Visitor Counter : 164