రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
భారత దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించేందుకు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై 5 రెట్లు ఎక్కువ పెట్టుబడి పెట్టాలన్న డాక్టర్ వికె సింగ్
प्रविष्टि तिथि:
23 AUG 2022 6:17PM by PIB Hyderabad
భారత్ 6 ట్రిలియన్ యుఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అన్న లక్ష్యాన్ని సాధించేందుకు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై 5 రెట్లు ఎక్కువ పెట్టుబడి దేశం పెట్టాల్సి ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారులు, పౌర విమానయాన శాఖల సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వికె సింగ్ (రిటైర్డ్ అన్నారు. పిహెచ్‌డిసిసిఐ నిర్వహించిన గతి శక్తిః భారత్ 5 ట్రిలియన్ల యుఎస్‌డాలర్ల దిశగా పురోగమించేందుకు భారత్ మౌలిక సదుపాయాల ఆధారిత పరివర్తన అన్న అంశంపై జరిగిన సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ, వేగవంతమైన రవాణా, తక్కువ ఇంధన ఖర్చు, వ్యయ సమర్దతకు హామీ ఇవ్వడానికి ప్రభుత్వం సాధారణ ప్రయోజన కారిడార్లను సృష్టించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని ఆయన చెప్పారు.
మౌలిక సదుపాయాల రంగంలో వేగవంతమైన అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తున్న సవాళ్ళను పరిష్కరించి, ఒకే గొడుగు కిందకు తేవడంలో పిఎం గతిశక్తి పాత్ర ప్రాముఖ్యతను డాక్టర్ సింగ్ ఉద్ఘాటించారు.
ప్రాజెక్టుల అమలు, గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేయడం అన్నవి పిఎం గతిశక్తి బృహత్తర ప్రణాళికలో కీలక అంశాలని మంత్రి తెలిపారు. పరిష్కారాలతో కలిపి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం చట్రాన్ని సృష్టించడం ప్రణాళిక ప్రధాన ఉద్దేశ్యమని ఆయన అన్నారు. ఈ చట్రంలో ఎటువంటి ఆటంకాలూ లేకుండా ఒకేసారి అన్ని సంబంధిత విభాగాల దృష్టిని ఆకర్షించే విధంగా వివిధ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
***
(रिलीज़ आईडी: 1853994)
आगंतुक पटल : 165