పర్యటక మంత్రిత్వ శాఖ
కరోనా మహమ్మారి పర్యాటకం, ఆతిథ్య రంగాలపై పెను ప్రభావాన్ని చూపించింది. ఈ నేపథ్యంలో ఈ రంగాలను ఆదుకునేందుకు అత్యవసర రుణసదుపాయ హామీ పథకానికి (ఈసీఎల్‌జీఎస్) రూ.50వేల కోట్ల నిధులను అదనంగా కేటాయించి రూ. 4.5 నుండి రూ. 5 లక్షల కోట్లకు పెంచడం జరిగింది. పర్యాటక, ఆతిథ్య రంగాలు ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వారికి చాలా ఉపయుక్తం అవుతుందన్న కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
పర్యాటక రంగాన్ని ఆదుకోవడం ద్వారా దీనికి సంబంధించిన ఉద్యోగాలను కాపాడటంతో పాటు వ్యాపారస్తులకు మేలు జరగాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తక్షణ ఉపశమన చర్యలు తీసుకుంటోంది. పర్యాటక రంగంలో సుస్థిర పురోగతి, ఎకోటూరిజాన్ని ప్రోత్సహించడంతో పాటు భవిష్యత్తులో పర్యాటక రంగం ఉండాల్సిన అంశాలపై ప్రయత్నాలు జరుగుతున్నాయి. – శ్రీ జి. కిషన్ రెడ్డి.
దేశ ఆర్థికాభివృద్ధిలో పర్యాటక, ఆతిథ్య రంగాలు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రంగాలను పునరుద్ధరించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు పరిశ్రమ, ఇందులోని భాగస్వామ్య పక్షాలతో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోంది. 31 మార్చి 2023 వరకు ఈసీఎల్‌జీఎస్ ను పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు– శ్రీ జి.కిషన్ రెడ్డి
Posted On:
18 AUG 2022 6:33PM by PIB Hyderabad
కరోనానంతర పరిస్థితుల్లో పర్యాటకం, ఆతిథ్యం, సంబంధిత రంగాలను ఆదుకునేందుకు ఈసీఎల్జీఎస్ ఇప్పటికే అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా రూ.50వేల కోట్ల అదనపు నిధులతో ఈ రంగాలను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈసీఎల్‌జీఎస్ పథకానికి రూ.50వేల కోట్ల నిధులను అదనంగా కేటాయించి రూ. 4.5 నుండి రూ. 5 లక్షల కోట్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. కరోనానంతర పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న ఆతిథ్య, పర్యాటక రంగాలను మరింతగా ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
కరోనా మహమ్మారి పర్యాటకం, ఆతిథ్య రంగాలపై పెను ప్రభావాన్ని చూపించింది. ఈ నేపథ్యంలో ఈ రంగాలను ఆదుకునేందుకు అత్యవసర రుణసదుపాయ హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్)నికి రూ.50వేల కోట్ల నిధులను అదనంగా కేటాయించి రూ. 4.5 నుండి రూ. 5 లక్షల కోట్లకు పెంచడం జరిగింది. పర్యాటక, ఆతిథ్య రంగాలు ఇప్పుడిప్పుడే కరోనానుంచి కోలుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వారికి చాలా ఉపయుక్తం అవుతుంది.ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక , ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు.
పర్యాటక రంగాన్ని ఆదుకోవడం ద్వారా దీనికి సంబంధించిన ఉద్యోగాలను కాపాడటంతోపాటు వ్యాపారస్తులకు మేలు జరగాలన్న లక్ష్యంతో మోదీ ప్రభుత్వం తక్షణ ఉపశమన చర్యలు తీసుకుంటోంది. పర్యాటక రంగంలో సుస్థిర పురోగతి, ఎకో టూరిజాన్ని ప్రోత్సహించడంతో పాటు భవిష్యత్తులో పర్యాటక రంగం ఉండాల్సిన అంశాలపై ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా సంబంధిత రంగంలో అదనపు రుణాలు అందించేందుకు రుణ సంస్థలు రూ.50 వేల కోట్ల అదనపు క్రెడిట్ ఇచ్చేందుకు అవసరమైన ప్రోత్సాహం అందుతుంది. తద్వారా ఈ వ్యాపార సంస్థలు తమ నిర్వహణ బాధ్యతలను తీర్చుకోవడానికి, వ్యాపారాలను కొనసాగించడానికి వీలు కల్పించేలా.. దాదాపు రూ. 3.67 లక్షల కోట్లు ఈసీఎల్ జీఎస్ పథకం కింద ఆగస్టు 5, 2022 వ తేదీన మంజూరు చేయడం జరిగింది.
దేశ ఆర్థికాభివృద్ధిలో పర్యాటక, ఆతిథ్య రంగాలు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రంగాలను పునరుద్ధరించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు పరిశ్రమ, ఇందులోని భాగస్వామ్య పక్షాలతో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోంది. 31 మార్చి 2023 వరకు ఈసీఎల్‌జీఎస్ ను పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హోటళ్లు, రెస్టారెంట్లు, మ్యారేజ్ హాళ్లు, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, అడ్వెంచర్, చారిత్రక కట్టడాల నిర్వాహకులు, స్పా క్లినిక్స్, బ్యూటీ సెలూన్లు, మోటార్ వెహికల్ అగ్రిగేటర్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్స్, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, యోగా ఇనిస్టిట్యూట్స్, జిమ్నాజియంలు, ఇతర ఫిట్ నెస్ సెంటర్లు, కేటరింగ్ నిర్వాహకులు మొదలైన ఆతిథ్య రంగంలోని వ్యాపారస్తులు/ఎంఎస్ఎంఈ లకు రుణ సదుపాయ అర్హత ఉంటుంది.
కరోనానంతర పరిస్థితుల్లో ఇతర రంగాలు త్వరగానే తిరిగి పుంజుకున్నాయి. కానీ ఆతిథ్య, పర్యాటక రంగాలు అనుకున్నట్లుగా కోలుకోలేకపోయాయి. ఈ రంగాల్లోనే అధిక ఉపాధి అవకాశాలుండటం, దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగాల ప్రత్యక్ష ప్రభావం కారణంగా వీటిని ఆదుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ఈ రంగాల్లో సుస్థిరాభివృద్ధిని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే వీటిని ఆదుకునేందుకు అదనపు రుణ మొత్తాన్ని పెంచేందుకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం హర్షదాయకం.
*****
(Release ID: 1852999)
Visitor Counter : 134