సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

రేపు ఇటానగర్‌లో పరిపాలనా సంస్కరణలపై రెండు రోజుల ప్రాంతీయ సదస్సును ప్రారంభించనున్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ


అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌లోని 500 మంది అధికారుల కోసం పరిపాలనలో మిడ్-కెరీర్ బిల్డింగ్ ప్రోగ్రామ్‌లను నిర్వహించడం కోసం అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వంతో డిఏఆర్‌పిజి అవగాహన ఒప్పందం.

Posted On: 17 AUG 2022 11:43AM by PIB Hyderabad

18-19 ఆగస్ట్, 2022 తేదీల్లో ఇటానగర్‌లో "పరిపాలన సంస్కరణల ద్వారా పౌరులను, ప్రభుత్వాన్ని మరింత చేరువ చేయడం" అనే అంశంపై రెండు రోజుల ప్రాంతీయ సమావేశం జరుగనుంది. ఈ ప్రాంతీయ సమావేశాన్ని పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల శాఖ, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో నిర్వహిస్తోంది.

 

కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ టెక్నాలజీసహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ఎర్త్ సైన్సెస్పిఎంఓ సహాయమంత్రిపర్సనల్పబ్లిక్ గ్రీవెన్స్పెన్షన్స్అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్డాక్టర్ జితేంద్ర సింగ్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ, అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ చౌనా మెయిన్ ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (NCGG), డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పబ్లిక్ గ్రీవెన్స్ (DARPG) అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనా సేవలకు చెందిన 500 మంది అధికారుల కోసం గవర్నెన్స్‌లో మిడ్-కెరీర్ బిల్డింగ్ ప్రోగ్రామ్‌లను నిర్వహించడానికి వచ్చే ఐదేళ్ల కోసం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటుంది.

2-రోజుల సమావేశంలోవివిధ సెషన్‌లు ఉండనున్నాయి: (i) పాలనలో సంస్కరణలు; (ii) ఈశాన్య రాష్ట్రాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మరియు ఇ-ఆఫీస్; (iii) ఈశాన్య రాష్ట్రాలలో సుపరిపాలన పద్ధతులు; ~v) డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ మరియు (v) సుపరిపాలన పద్ధతులు.

ఈ కాన్ఫరెన్స్ భారతదేశంలోని ఈశాన్య, తూర్పు రాష్ట్రాలకు అంకితం చేయబడింది. కాన్ఫరెన్స్‌లో దేశవ్యాప్తంగా 300 మందికి పైగా ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. సదస్సు సెమీ వర్చువల్ విధానంలో జరుగనుంది.

కేంద్రరాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో వివిధ పరిపాలనా సంస్కరణల ద్వారా ప్రభుత్వం మరియు పౌరులను మరింత చేరువ చేసే ప్రయత్నమే ఈ సదస్సు ఉద్దేశం. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను మరియు ICT నిర్వహణను ఉపయోగించడంలో "గరిష్ట పాలనకనిష్ట ప్రభుత్వం" అనే విధాన లక్ష్యంతో తర్వాతి తరం సంస్కరణలు, ఆవిష్కరణలను అనుసరించే డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంప్రభుత్వ ప్రక్రియల రీ-ఇంజనీరింగ్ఇ-సేవలకు సార్వత్రిక ప్రాప్యతజిల్లా స్థాయిలో డిజిటల్ కార్యక్రమాలలో శ్రేష్ఠతను కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం.

ఏఆర్‌పీజి జాయింట్ సెక్రటరీ శ్రీ ఎన్‌బీఎస్ రాజ్‌పుత్ స్వాగత ప్రసంగం చేస్తారు. అనంతరం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ ధర్మేంద్రడోనర్(DoNER) సెక్రటరీ శ్రీ లోక్ రంజన్, ఏఆర్‌పీజి కార్యదర్శి శ్రీ వి. శ్రీనివాస్ ప్రారంభ సెషన్‌లో ప్రసంగిస్తారు. ఈశాన్య ప్రాంతంలో 2021లో పీఎం అవార్డ్ ఇనిషియేటివ్‌లపై డీఎఆర్‌పిజి రూపొందించిన చిత్రం ప్రదర్శించబడుతుంది. ప్రారంభ సెషన్‌లో ప్రభుత్వ కార్యదర్శి (AR) శ్రీ అజయ్ చగ్తీ కృతజ్ఞతలు తెలుపుతారు.

 

 <><><><><>



(Release ID: 1852883) Visitor Counter : 82


Read this release in: English , Urdu , Hindi , Manipuri