సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న వారు చేసిన త్యాగాలను సంస్మరించుకోవాలని పిలుపిచ్చిన శ్రీ నారాయణ్ రాణె
Posted On:
14 AUG 2022 8:22PM by PIB Hyderabad
ఎంఎస్ ఎంఇ మంత్రిత్వ శాఖ ఆదివారం నాడు తిరంగా యాత్రను, హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని న్యూఢిల్లీలో నిర్వహించింది. ఈ ప్రచారానికి కేంద్ర ఎంఎస్ఎంఇ మంత్రి శ్రీ నారాయణ్ రాణె నాయకత్వం వహించారు. ఈ యాత్రలో ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ అధికారులు, ఆఫీస్ ఆఫ్ డెవలప్‌మెంట్ కమిషనర్ (ఎంఎస్ఎంఇ) క్షేత్ర కార్యాలయాల సిబ్బంది, ఎన్ ఎస్ ఐసి, కెవిఐసి అధికారులు పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న త్యాగాలను మనం సంస్మరించుకోవాలని, మన వర్తమానానికి కారణమైన వారికి రుణపడి ఉండాలని శ్రీ రాణె పిలుపిచ్చారు. దేశంలో ఎంఎస్ఎంఇల విజయవంతమైన భవిష్యత్తును ఖరారు చేసేందుకు అందరూ సమన్వయంతో, కలిసికట్టుగా కలిసి పని చేయాలని ఆయన పేర్కొన్నారు.
***
(Release ID: 1851962)
Visitor Counter : 112