ఉక్కు మంత్రిత్వ శాఖ

విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో WIPS ఫోరం (ఫోరమ్ ఫర్ ఉమెన్ ఇన్ పబ్లిక్ సెక్టార్) ఆవిర్భావ దినోత్సవ రజతోత్సవం


CMD, RINL RINL ఉద్యోగుల గణనీయమైన సహకారానికి ప్రశంసలు

Posted On: 09 AUG 2022 7:56PM by PIB Hyderabad

WIPS (ఫోరమ్ ఫర్ ఉమెన్ ఇన్ పబ్లిక్ సెక్టార్) ఆవిర్భావ దినోత్సవం రజతోత్సవ వేడుకలను ఈరోజు విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ మహిళా ఉద్యోగులను ఉద్దేశించి, చైర్మన్ , మేనేజింగ్ దిరేక్తర్ ఐన శ్రీ అతుల్ భట్ తన ప్రసంగంలో, నష్టాలను చవిచూసిన ఆరేళ్ల తర్వాత సంస్థను లాభాల బాటలో ఉంచడం వెనక ఉన్న మహిళా సోదరీమణుల అసాధారణ సహకారాన్ని ప్రశంసించారు. 1997లో ఏర్పాటైన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ పబ్లిక్ సెక్టార్‌లో మహిళల (WIPS) సుదీర్ఘ, విజయవంతమైన25 సంవత్సరాలను పూర్తి చేసుకుని, ఈ సంవత్సరం రజతోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానుఅని శ్రీ అతుల్ భట్ తెలిపారు. ఈ ప్రత్యేక సందర్భంగా మహిళా ఉద్యోగులందరినీ ఆయన అభినందించారు. సమాజంలో మహిళల పాత్రపై అవగాహన పెంపొందించడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నందుకు వారిని అభినందించారు.

బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ పోటీలో కామన్వెల్త్ గేమ్స్‌లో ప్రతిష్టాత్మకమైన స్వర్ణం సాధించినందుకు శ్రీ అతుల్ భట్ శ్రీమతి పివి సింధును అభినందించారు. పివి సింధు రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం మొత్తం RINL కుటుంబానికి గర్వకారణమని అన్నారు.

ఉక్కు కర్మాగారపు అత్యంత సంక్లిష్ట సరఫరా గొలుసు నిర్వహణను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నందుకు రాష్ట్రీయ ఇస్పాత్ నిగం -మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ చీఫ్ జనరల్ మేనేజర్, డిపార్ట్మెంట్ హెడ్ శ్రీమతి షీలా ప్రియదర్శినిని శ్రీ అతుల్ భట్ అభినందించారు.అధిక సంఖ్యలో మహిళలు RINLలో చేరడం హర్షణీయం, ఒకప్పుడు సాయుధ దళాల వంటి పురుషులకు మాత్రమే కేటాయించబడిన రంగాలలోకి మహిళలు ఎక్కువగానూ, క్రమంగా విధులు నిర్వహించడం గర్వించదగ్గ విషయం. సమాజంలో మహిళల పాత్ర గురించి అవగాహనను మెరుగుపరచడంలో వారి చురుకైన పాత్ర కోసం RINL, WIPS సంస్థల భాగస్వామ్యాన్ని, వారు చేపట్టే వివిధ కార్యక్రమాల నిమిత్తం నేను అభినందించాలను కుంటున్నాను., అని శ్రీ అతుల్ భట్ జోడించారు.

శ్రీ అతుల్ భట్ గౌరవ అతిథిగా పాల్గొన్న డా.గీతాంజలి బత్మనాబానే గారికి కార్యక్రమంలో కృతజ్ఞతలు తెలిపారు. ఆమె పాల్గొనడం, వారిచ్చిన సందేశం మహిళలు వృత్తిపరమైన జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఖచ్చితంగా ప్రేరేపిస్తుందని అన్నారు.

గౌరవ అతిథి, గీతం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (GIMSR) ప్రో-వైస్ ఛాన్సలర్ డాక్టర్ గీతాంజలి బత్మనాబానే మాట్లాడుతూ మహిళలు తమ జీవితంలో విజయం కోసం సమాజంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఎదుర్కొనే ధైర్యం సాహసాలను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ఎత్తిచూపారు. భారతదేశ యువత జనాభా అధికంగా ఉండటం వల్ల తరువాతి తరం మహిళలు వివిధ రంగాలలో ఆధిపత్య పాత్ర పోషిస్తారని ఆమె అన్నారు. డాక్టర్ గీతాంజలి బత్మనాబానే, శ్రీ అతుల్ భట్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ డైరెక్టర్లు అదే సంస్థకు చెందిన కొంతమంది మహిళా ఉద్యోగులను సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు.

 

*****

 



(Release ID: 1850815) Visitor Counter : 93


Read this release in: English , Urdu , Hindi