కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ బాల కార్మిక పథకం ప్రాజెక్ట్


Posted On: 08 AUG 2022 3:09PM by PIB Hyderabad

జిల్లా ప్రాజెక్ట్ సొసైటీల నుండి అందిన సమాచారం ప్రకారం, 2017-18 నుండి జాతీయ బాల కార్మిక పథకం ప్రాజెక్ట్ (NCLP) కింద రక్షణ పొందిన/ పని నుండి ఉపసంహరించిన, పునరావాసం పొందిన మరియు ప్రధాన స్రవంతిలో ఉన్న బాల కార్మికులు/లబ్దిదారుల సంఖ్య, రాష్ట్రాల వారీగా, అనుబంధం-Iలో ఉంది.

జాతీయ బాల కార్మికుల ప్రాజెక్ట్ (NCLP) పథకం యొక్క లక్ష్యం బాల కార్మికులను రక్షించడం, అలాగే వారికి పునరావాసం కల్పించడం. NCLP పథకం కింద, 9-14 సంవత్సరాల వయస్సు గల పని చేసే పిల్లలు పని నుండి రక్షణ పొందారు/ఉపసంహరణ పొందారు. అలాగే వారంతా NCLP ప్రత్యేక శిక్షణా కేంద్రాలలో నమోదు అవుతారు. అక్కడ వారికి వారధి విద్య, వృత్తి శిక్షణ, మధ్యాహ్న భోజనం, స్టైఫండ్, అధికారిక విద్యా వ్యవస్థలో ప్రధాన స్రవంతిలోకి రావడానికి ముందు ఆరోగ్య సంరక్షణ మొదలైనవి శిక్షణ ఇస్తారు.

జాతీయ బాల కార్మికుల ప్రాజెక్ట్ (NCLP) పథకం 31.03.2021 వరకు కొనసాగడానికి ఆమోదం పొందింది. అప్పటి నుండి విద్యా మంత్రిత్వ శాఖ యొక్క సమగ్ర శిక్షా అభియాన్ (SSA) పథకంతో ఇది విలీనం చేయడం జరిగింది. 31.03.2021కి ముందు కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ ఆమోదించిన మరియు NCLP స్కీమ్ మార్గదర్శకాల ప్రకారం మధ్యప్రదేశ్, ఒడిశా, అస్సాం మరియు పశ్చిమ బెంగాల్లో మాత్రమే 31.07.2022 నాటికి ఇంకా రెండేళ్లు పూర్తికాని మొత్తం 254 ప్రత్యేక శిక్షణా కేంద్రాలు (STC) పని చేస్తున్నాయి. NCLP పథకం ప్రస్తుతం మహారాష్ట్ర రాష్ట్రంలోని జిల్లాలోనూ అమలులో లేదు. STC, జిల్లాలు, 2022 -23 మధ్యకాలంలో NCLP అమలులో ఉన్న రాష్ట్రాలలో నమోదు చేసుకున్న పిల్లల సంఖ్య మరియు 2021-22 మరియు 2022-23లో విడుదల చేసిన మొత్తం వివరాలు అనుబంధం IIలో ఉన్నాయి.

NCLP పథకం ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క సంబంధిత సూచనల ప్రకారం 31 మార్చి, 2021 తర్వాత దాని కొనసాగింపు కోసం అంచనా వేశారు. క్రింది విధంగా దశలవారీగా సమగ్ర శిక్షా అభియాన్ (SSA) పథకంతో పథకాన్ని ఉపసంహరించుకోవాలని / విలీనం చేయాలని నిర్ణయించారు:-

 

i. ప్రాజెక్ట్ సొసైటీ, ప్రస్తుతం అమలులో ఉంది. నమోదు చేసుకున్న పిల్లలు అధికారిక విద్యా విధానంలో ప్రధాన స్రవంతిలోకి వచ్చే వరకు ఇక్కడ కొనసాగించడానికి అనుమతిస్తారు.

ii. మంజూరు కోసం పెండింగ్లో ఉన్న సహాయం /స్టైఫండ్విషయంలో దానిని క్లియర్ చేయాల్సిన బాధ్యత కమిటెడ్ కమిటీపై ఆధారపడి ఉంటుంది.

iii. ఎన్సిఎల్పి పథకం కింద కొత్త ప్రత్యేక శిక్షణా కేంద్రం (ఎస్టిసి) ప్రారంభానికి అనుమతించరు.

iv. NCLP కింద STCలో పిల్లలను తాజాగా నమోదు చేయడం లేదు.

v. కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖలో స్వీకరించిన సర్వే నివేదిక, సంబంధిత STCలో పిల్లల నమోదు కోసం పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగానికి పంపడం జరుగుతుంది.

 

రోజు లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో కార్మిక & ఉపాధి శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి సమాచారం అందించారు.

అనుబంధం-I

పిల్లల సంఖ్య /లబ్ది పొందినవారు, రక్షణ పొందినవారు, / పని నుంచి ఉపసంహరణ పొందినవారు, 2017-18 to 2021-22 సమయంలో ఎన్సీఎల్పీ పథకం కింద ప్రధానంగా ఉంటూ పునరావాసం పొందినవారు.

క్రమ. సంఖ్య.

రాష్ట్రం

2017-18

2018-19

2019-2020

2020-2021

2021-22*

1

ఆంధ్రప్రదేశ్

203

778

1049

622

885

2

అస్సాం

915

4562

6175

2800

NA

3

బీహార్

2800

--

--

--

--

4

గుజరాత్

187

101

341

531

--

5

హర్యానా

NA

171

NA

NA

NA

6

ఝార్ఖండ్

2014

1225

2940

3239

NA

7

కర్నాటక

679

763

363

275

263

8

మధ్యప్రదేశ్

11400

4910

4010

29179

2237

9

మహరాష్ట్ర

5250

8122

9337

2031

2110

10

ఒడిశా

NA

NA

6

495

15

11

పంజాబ్

994

915

483

1307

4867

12

రాజస్థాన్

105

NA

1712

NA

86

13

తమిళనాడు

2855

2534

3928

1456

2586

14

తెలంగాణ

2137

935

214

300

222

15

ఉత్తర్ ప్రదేశ్

NA

8020

10371

9383

NA

16

పశ్చిమ బెంగాల్

17899

17137

13879

6671

NA

17

ఉత్తరాఖండ్

NA

NA

62

--

--

18

నాగాలాండ్

197

111

24

--

--

 

మొత్తం

47,635

50,284

54,894

58,289

13,271

 

 

అనుబంధం-II

STC జిల్లాలో నమోదు అయిన బాలల సంఖ్య వివరాలు, 2021-22 and 2022-23 సమయంలో జిల్లాలు, రాష్ట్రాలు మరియు విడుదలైన నిధుల వివరాలు (31.07.2022 నాటికి NCLP విధుల ప్రకారం)

క్రమ. సంఖ్య.

రాష్ట్రం

జిల్లా

బాలల సంఖ్య**

 

  • నిధి మొత్తం (In Rs.)

 

2021-22

2022-23*

1

మధ్యప్రదేశ్

షాజాపూర్

287

6,08,666

72,40,976

2

ఒడిశా

ఝార్సుగూడ

275

72,46,297

-

3

సుందర్గర్

632

1,18,87,955

-

4

అస్సాం

కమ్రూప్ (మెట్రో)

1265

81,10,000

76,18,286

5

నాగాన్

2768

-

-

6

పశ్చిమ బెంగాల్

దక్షిణ్ దినజపూర్***

993

-

1,51,16,169

7

అలిపుర్దువర్

357

30,43,450

55,18,473

8

కూచ్ బెహర్

845

94,94,714

--

 


(Release ID: 1850812) Visitor Counter : 161


Read this release in: English , Urdu