పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

అమృత మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగాలో పుణేలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొననున్న కేంద్ర సహాయమంత్రి (పంచాయతీ రాజ్) శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్


ఆగస్ట్ 12 న పుణేలోని ఆగాఖాన్ పాలెస్, మెహతాస్ నేచర్ క్యూర్ క్లినిక్‌లలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

Posted On: 10 AUG 2022 6:55PM by PIB Hyderabad

75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల్లో భాగంగా జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా హర్ ఘర్ తిరంగ అభియాన్” ప్రచారంలో భాగాంకేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ పూణేలోని చారిత్రక స్మారక చిహ్నం ఆగా ఖాన్‌ ప్యాలెస్‌ను, డాక్టర్ మెహతాస్ నేచర్ క్యూర్ క్లినిక్ (ప్రస్తుత పేరు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి)ఆగస్ట్ 12న సందర్శించి జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఈ సందర్భంగా ఈ రెండు చారిత్రక ప్రదేశాల్లో స్వాతంత్య్ర సమరయోధులనువారి కుటుంబాలనుఅమరవీరుల కుటుంబాలను ఆయన సత్కరించిస్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వీరులకు నివాళులర్పిస్తారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (AKAM) వేడుకలో భాగంగాహర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమం కోసం 11-15 ఆగస్టు  2022 వరకు వివిధ ప్రముఖులు స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన 400 ప్రదేశాలను సందర్శించాలని నిర్ణయించారు. పూణేలోని ఆగాఖాన్ ప్యాలెస్డాక్టర్ మెహతాస్ నేచర్ క్యూర్ క్లినిక్ కూడా ఈ 400 చారిత్రక ప్రదేశాలలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖచే నిర్ణయించబడ్డాయి. ఈ కార్యక్రమానికి 500 మందికి పైగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులుశాసన సభ సభ్యులుఇతర స్థానిక నాయకులుప్రముఖులు హాజరుకానున్నారు.

పూణేలోని ఆగాఖాన్ ప్యాలెస్ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ఒక ప్రధాన భూమిక పోషించింది. మహాత్మా గాంధీజీఆయన సతీమణి శ్రీమతి కస్తూర్బా గాంధీజీసెక్రటరీ మహదేవ్‌భాయ్ దేశాయ్అలాగే మీరాబెన్ప్యారేలాల్ నాయర్సరోజినీ నాయుడు మరియు డా. సుశీలా నాయర్‌లు ఇందులో 9 ఆగస్ట్ 1942 నుండి మే 61944 ఖైదు చేయబడ్డారు. ఈ ప్రదేశంలోనే కస్తూర్బా గాంధీ మరియు మహదేవ్‌భాయ్ దేశాయ్ మరణించారు. ఈ ప్రదేశం గాంధీజీకి చాలా ప్రత్యేకమైనది. కస్తూర్బా గాంధీ మరియు మహదేవ్‌భాయ్‌ల సమధు'లు ప్రధాన ప్యాలెస్ వెనుక ఒక తోటలో ఉన్నాయి. ఇది ఇప్పుడు గాంధీ నేషనల్ మెమోరియల్ సొసైటీ యొక్క ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుందిప్రస్తుతం ఇక్కడ 'ఖాదీ' వస్త్రాల తయారీ ప్రధాన కార్యకలాపంగా కొనసాగుతోంది.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి (NIN) మహారాష్ట్రలోని పూణేలో దివంగత డాక్టర్ దిన్షా కె. మెహతాచే "నేచర్ క్యూర్ క్లినిక్ మరియు సానిటోరియం"గా నిర్వహించబడే "బాపు భవన్" అనే చారిత్రక ప్రదేశంలో ఉంది. 1945 మరియు 1947 మధ్యగాంధీజీ ఈ ప్రాంతాన్ని ఏడుసార్లు సందర్శించారు. 156 రోజులు ఇక్కడే ఉన్నారు. ఆల్ ఇండియా నేచర్ క్యూర్ ఫౌండేషన్ ట్రస్ట్ 1945లో స్థాపించబడింది. దీనికి గాంధీజీ అధ్యక్షుడు అయ్యారు. 22-12-1986న ఎన్ఐఎస్ ఉనికిలోకి వచ్చినప్పటికీమహాత్మాగాంధీ వారసత్వం ఇన్‌స్టిట్యూట్‌తో ప్రకృతివైద్య రంగంలో దీనికి గొప్ప పేరు గడించింది. ప్రధాన ఇన్‌స్టిట్యూషన్‌గాఎన్ఐఎన్ నేచర్ క్యూర్ విశ్వవిద్యాలయాన్ని సృష్టించే లక్ష్యంతో పురోగమిస్తోంది - ఇది ఆల్ ఇండియా నేచర్ క్యూర్ ఫౌండేషన్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయడంలో మహాత్మా గాంధీ యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి.

***(Release ID: 1850734) Visitor Counter : 194


Read this release in: English , Urdu , Hindi , Marathi