మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇథియోపియా మ‌హిళా, సామాజిక వ్య‌వ‌హారాల శాఖ మంత్రిని క‌లిసిన మ‌హిళా& శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ‌మ‌తి స్మృతి ఇరానీ; మ‌హిళా సాధికార‌త‌కు సంబంధించి ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి సంబంధాల గురించి చ‌ర్చించిన మంత్రులు

Posted On: 10 AUG 2022 8:58PM by PIB Hyderabad

మ‌హిళా& శిశు సంక్షేమ‌శాఖ మంత్రి శ్రీ‌మ‌తి స్మృతి జుబిన్ ఇరానీ బుధ‌వారంనాడు ఇథియోపియా మ‌హిళా, సామాజిక వ్య‌వ‌హారాల శాఖ మంత్రి డాక్ట‌ర్ ఎర్గోజీ టెస్ఫే వోల్డెమెస్కిల్‌తో సమావేశ‌మ‌య్యారు. భార‌త్‌, ఇథియోపియా మ‌ధ్య అవ‌గాహ‌న‌, స‌ద్భావ‌న‌, స్నేహాన్ని పెంపొందించ‌డంలో ఆమె చేసిన విశిష్ట సేవ‌లు, స‌హ‌కారానికి గుర్తింపుగా భార‌త సాంస్కృతిక సంబంధాల కౌన్సిల్ (ఇండియ‌న్ కౌన్సిల్ ఫ‌ర్ క‌ల్చ‌ర‌ల్ రిలేష‌న్స్సి -ఐసిసిఆర్‌) విశిష్ట పూర్వ విద్యార్ధుల అవార్డును అందుకున్నందుకు గౌర‌వ‌నీయ మంత్రి ఆమెను అభినందించారు. 
మ‌హిళా సాధికార‌త‌, జెండ‌ర్ స‌మాన‌త్వం స‌హా ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం కోసం మ‌హిళా సాధికార‌త‌కు సంబంధించిన ప‌ర‌స్ప‌ర ఆస‌క్తికి సంబంధించిన అంశాల‌ను మంత్రులు చ‌ర్చించారు. చ‌ర్చ‌ల సంద‌ర్భంగా,  మ‌హిళ‌ల సామాజిక‌, రాజ‌కీయ‌, ఆర్థిక సాధికార‌త కోసం కార్య‌క్ర‌మాలు, విధానాలు, ఉత్త‌మ చొర‌వ‌ల‌ను ప‌ట్టి చూప‌డం ద్వారా గౌర‌వ‌నీయ మంత్రులు మ‌హిళ జీవితాల ప‌రివ‌ర్త‌న‌కు దోహ‌ద‌ప‌డే కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. 
మ‌హిళా సాధికార‌త‌కు సంబంధించి భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన వివిధ చొర‌వ‌ల‌ను ఇథియోపియ‌న్ మంత్రి కొనియాడారు. 
మ‌హిళ‌లు, పిల్ల‌ల హ‌క్కుల‌ను ప్రోత్స‌హించ‌డం కోసం ద్వైపాక్షిక‌, బ‌హుపాక్షిక వేదిక‌ల‌పై చ‌ర్చ‌లు కొన‌సాగించాల‌ని మంత్రులిద్ద‌రూ అంగీక‌రించారు. 

 

***


(Release ID: 1850699) Visitor Counter : 132


Read this release in: English , Hindi , Urdu