శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సైన్స్-టెక్నాలజీ, ఆవిష్కరణల్లో అమెరికాతో ద్వైపాక్షిక సహకారం!


ఎన్.ఎస్.ఎఫ్. ప్రతినిధి బృందంతో
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ సమావేశం

ఆరోగ్య రక్షణ, అంతరిక్షం, సముద్రవిజ్ఞానం,
ఇంధన రంగం, కొత్త టెక్నాలజీల్లో పరస్పర సహకారం
మరింత ఉన్నత స్థాయికి చేరే అవకాశం..
జితేంద్ర సింగ్ పిలుపు..

ప్రతిపాదిత ఇంటిగ్రేటెడ్ డాటా సిస్టమ్ ఏర్పాటుకు
ఎన్.ఎన్.ఎఫ్. మద్దతును కోరిన జితేంద్ర సింగ్

Posted On: 09 AUG 2022 4:35PM by PIB Hyderabad

   మనదేశంలో పర్యటిస్తున్న నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్.ఆర్.ఎఫ్) అమెరికా ప్ర తినిధి బృందం ఈ రోజు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) డాక్టర్ జితేంద్ర సింగ్‌తో సమావేశం జరిపారు. ఎర్త్ సైన్సెస్; ప్రధాన మంత్రి కార్యాలయ వ్యవహారాలు, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్షపరిశోధనా శాఖలను కూడా సహాయ మంత్రిగా డాక్టర్ జితేంద్ర సింగ్ పర్యవేక్షిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం పెంపొందించడంపై, ఈ సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు.

https://ci6.googleusercontent.com/proxy/eVBsnd7gPUdLG2NSbWiaEZ1Np9tMgtvIOCPtr3BqjKO_6xRkcBYfJv4O7CZp87yHplltU6_aICGpA5FOzlaL1A-s2q0_OSZdcxR7TFsC5vRWzB-8Id5kvycG4w=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001U08R.jpg

    అమెరికాలోని ఎన్.ఎస్.ఎఫ్.కు చెందిన ఇంటర్నేషనల్ సైన్స్-ఇంజినీరింగ్ (ఒ.ఐ.ఎస్.ఇ.) కార్యాలయం అధిపతి డాక్టర్ కెండ్రా షార్ప్, ఎన్.ఎస్.ఎఫ్. సిబ్బంది అధిపతి బ్రియాన్ స్టోన్, ఒ.ఐ.ఎస్.ఇ. ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ బ్రిడ్జెట్ తురగా, అమెరికా రాయబార కార్యాలయం ఆర్థిక, పర్యావరణ, విజ్ఞాన, టెక్నాలజీ వ్యవహారాల మినిస్టర్ కౌన్సెలర్ డ్య్రూ స్కఫ్లెటోవ్‌స్కీ, అమెరికా ఎంబసీ పర్యావరణ, సైన్స్-టెక్నాలజీ యూనిట్ అధిపతి విలియం హార్ఫర్డ్, అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ సేతురామన్ పంచనాథన్ తదితరులు ప్రతినిధివర్గంలో భాగంగా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

   భారత బృందం తరఫున, కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైజ్ఞానిక సలహాదారు (పి.ఎస్.ఎ.) ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, పి.ఎస్.ఎ. కార్యాలయం వైజ్ఞానిక వ్యవహారాల కార్యదర్శి డాక్టర్ పర్వీందర్ మైనీ, పి.ఎస్.ఎ. కార్యాలయ సలహాదార్లు డాక్టర్ ప్రీతీ బంజాల్, డాక్టర్ మనోరంజన్ మొహంతీ, పి.ఎస్.ఎ. ఫెలో డాక్టర్ సిందూర గణపతి, పి.ఎస్.ఎ. కార్యాలయం సైంటిస్ట్-డి శిరీశ్ పాండా, పి.ఎస్.ఎ. కార్యాలయం సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ చగున్ బాషా ప్రతినిధులుగా పాల్గొన్నారు.

  ప్రతినిధి వర్గం స్థాయిచర్చల్లో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఆరోగ్య సంరక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, అంతరిక్షం, భూమి, సముద్ర వనరుల విజ్ఞానం, ఇంధనం, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, సైన్స్ అండ్ టెక్నాలజీ విద్య తదితర అంశాల్లో సహకారం వంటి విషయాలను ఇరు పక్షాలు ఇప్పటికే గుర్తించాయన్నారు.  వైజ్ఞానిక శాస్త్రీయ ఆవిష్కరణలు,  సాంకేతిక పరిజ్ఞాన ఆవిష్కరణల విషయానికి వస్తే భారతదేశం, అమెరికా దీర్ఘకాలిక అనుబంధాన్ని,  భాగస్వామ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని, విస్తృత ప్రపంచ ప్రయోజనాల దృష్ట్యా ఈ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఇందుకు తగిన వెసులుబాటు కల్పించడానికి తగిన తరుణం ఆసన్నమైందని కేంద్రమంత్రి చెప్పారు.

    ఈ సందర్భంగా అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్.ఎస్.ఎఫ్.) డైరెక్టర్, ప్రతినిధి బృందం సారథి డాక్టర్ సేతురామన్ పంచనాథన్ మాట్లాడుతూ,  రెండు రోజుల మేధోమథన సదస్సులో గుర్తించిన అంశాలను తగిన ఫలితాలను సాధించే స్థాయికి తీసుకువెళతామని మంత్రి జితేంద్ర సింగ్‌కు హామీ ఇచ్చారు. కృత్రిమ మేథోపరిజ్ఞానం (ఎ.ఐ.), జీవ సాంకేతిక పరిజ్ఞానం (బయోటెక్నాలజీ), జియోసైన్సెస్, ఖగోళ భౌతిక శాస్త్రం  వంటి రంగాల్లో సహకారానికి కొత్త బాటలు వేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

 

https://ci5.googleusercontent.com/proxy/2GKnrfkBFYujx2Y232KP2PDGwHEO_aYza2E9FshV5TkhepaMEZDqOtxpbrBQ-NTP8G5z0ygjV1fWzqoHvyqy_Q-0i0DRbh_kqHqZdmhAAHlq-Y45ACNRQbIMUA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002CJZN.jpg

  జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, వైజ్ఞానిక శాస్త్రపరమైన అంశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడూ అత్యధిక ప్రాధాన్యం ఇస్తారని, ప్రతి విషయంలోనూ ఆయనకు ఆసక్తి ఉందని,  అన్నారు. పరిశుభ్రత, హైడ్రోజన్ మిషన్, డిజిటల్ ఆరోగ్య రక్షణ వ్యవస్థ, స్వచ్ఛ ఇంధనం, శూన్య స్థాయికి కర్బన ఉద్గారాలను తగ్గించడం,  స్టార్టప్ కంపెనీల అభివృద్ధి వంటి కీలక శాస్త్రీయ అంశాలకు,  పథకాలకు 2014 నుండి, ప్రతి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ, ప్రధాని మోదీ ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారని కేంద్రమంత్రి చెప్పారు.

     క్వాంటమ్, మెటావర్స్, స్వచ్ఛ ఇంధన సాంకేతిక పరిజ్ఞానాలు,  సైబర్-భౌతిక వ్యవస్థలు, అత్యంత అధునాతన మెటీరియల్స్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ వంటి సాంకేతిక రంగాల్లో అర్థవంతమైన, లక్ష్యంతో కూడిన పరిశోధన, అభివృద్ధి భాగస్వామ్యాలపై ఉభయ పక్షాలు దృష్టిని సారించాలని జితేంద్ర సింగ్ ఎన్.ఎస్.ఎఫ్. ప్రతినిధి బృందానికి సూచించారు.

   ప్రత్యేకించి, సాంకేతిక పరిజ్ఞాన సంబంధమైన ఆవిష్కరణల రంగంలో ప్రపంచంలోని అతిపెద్ద, ప్రభావవంతమైన ప్రవాసులలో భార తీయ వైజ్ఞానిక ప్రవాసులకు ప్రత్యేక స్థానం ఉందని కేంద్రమంత్రి వివరించారు. పరస్పర ప్రయోజనాలతో కూడిన సాంకేతిక పరిజ్ఞాన స్టార్టప్ కంపెనీలకు అవకాశాలను ఉమ్మడిగా గుర్తించడానికి, పెంపొందించేందుకు, ప్రోత్సహించడానికి గల మార్గాలను ఉభయ దేశాలు అన్వేషించాలని సూచించారు.

    ప్రతిపాదిత సమగ్ర డేటా వ్యవస్థ ఏర్పాటుకోసం ఎన్.ఎస్.ఎఫ్. తగిన మద్దతును అందించాలని కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ కోరారు. ప్రస్తుతం వివిధ సంస్థల ద్వారా డేటా సేకరణ వివిధ మార్గాలలో జరుగుతోందని, అయితే డేటా ఎనలిటిక్స్‌తో,  అనుబంధ ప్రయోజనాలలో సమగ్ర డేటా వ్యవస్థ ఎంతగానో పురోగమించగలదని ఆయన అన్నారు.

    అంతరిక్ష పరిశోధన రంగంలో,  ప్రధానంగా అంతరిక్ష శిథిలాల తొలగింపు నిర్వహణ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో సహకారాన్ని పెంచుకోవాలని డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-భారత అంతరక్ష పరిశోధనా సంస్థ (నాసా-ఇస్రో) సింథటిక్ అపెర్చర్ రాడార్ ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది (2023లో) ప్రయోగించే అవకాశం ఉందని ఆయన గుర్తు చేశారు.

        

     అమెరికా, భారతీయ సంస్థలు, ఉభయదేశాల విద్యార్థుల మధ్య సంబంధాలను ఏర్పాటు కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యా భాగస్వామ్యం అనేది ఈ కార్య క్రమంలో మరో అంశమని అన్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితశాస్త్రంపై దృష్టిని కేంద్రీకరించే విశ్వవిద్యాలయాల (స్టెమ్-ఫోకస్డ్ యూనివర్సిటీల) భాగస్వామ్యంతో గత సంవత్సరం విద్యాపరమైన రౌండ్ టేబుల్ సదస్సును నిర్వహించినట్టు ఆయన చెప్పారు.   

 

<><><><>


(Release ID: 1850425) Visitor Counter : 199


Read this release in: English , Urdu , Hindi , Tamil