గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కేంద్ర గిరిజన శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా తో వర్చువల్ విధానంలో మాట్లాడిన ఈఎంఆర్ఎస్ కి చెందిన 378 మంది విద్యార్థులు

కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ఈ ఏడాది జంజాతీయ గౌరవ్‌ సందర్భంగా బిర్సా ముండా మరియు ఇతర గిరిజన నాయకులపై వ్యాసాలు రాయాలి .. కేంద్ర మంత్రి సూచన

Posted On: 09 AUG 2022 3:45PM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న  హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో  1 లక్ష మంది ఈఎంఆర్ఎస్   విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని కోరిన శ్రీ అర్జున్ ముండా 

పర్యావరణ పరిరక్షణకు ఈఎంఆర్ఎస్ విద్యార్థులు తమ పాఠశాలలు, గ్రామాల్లో మొక్కలు న్తి ఇతరులకు స్ఫూర్తి కలిగించాలి.. శ్రీ అర్జున్  ముండా 

హైదరాబాద్, ఆగస్టు 9:   అంతర్జాతీయ ఆదివాసీ  దినోత్సవం సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడువాన్‌తో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల(ఈఎంఆర్ఎస్) విద్యార్థుల మధ్య  వర్చువల్  విధానంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ  'సంవాద్'  కార్యక్రమాన్ని నిర్వహించింది.  కార్యక్రమంలో 378 మంది ఈఎంఆర్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.  

 గిరిజన శాఖ కార్యదర్శి శ్రీ అనిల్ కుమార్ ఝా,  ఈఎంఆర్ఎస్ , ఎన్ఈఎస్ టీ  అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జార్ఖండ్‌లోని కుజ్రాకు చెందిన  ఈఎంఆర్ఎస్   విద్యార్థులు స్వాగత గీతాన్ని ఆలపించడంతో  కార్యక్రమం ప్రారంభమైంది. 

భారత రాష్ట్రపతిగా శ్రీమతి ద్రౌపది ముర్ము ఎంపిక కావడం పట్ల ఈఎంఆర్ఎస్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించిన తర్వాత ఒక గిరిజన మహిళ దేశ అత్యున్నత పదవిని చేపట్టడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు శ్రీ అర్జున్ ముందా సమాధానం ఇచ్చారు. గిరిజనులకు మెరుగైన విద్యావకాశాలు అందించే కార్యక్రమాన్ని సవాల్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం దీని కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని విద్యార్థులకు  మంత్రి వివరించారు. గిరిజన విద్యార్థులను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లేందుకు గిరిజన మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటున్నదని ఆయన చెప్పారు. గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నెలకొల్పిన పాఠశాలలు నాణ్యమైన విద్ అందిస్తూ వారు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే విధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని శ్రీ అర్జున్ ముండా వివరించారు. ఉన్నత విద్య అభ్యసించేందుకు గిరిజన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నామని అన్నారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారికి కూడా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 100% స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నదని  మంత్రి వెల్లడించారు. 

అంతర్జాతీయ ఆదివాసీ  దినోత్సవం జరుపుకుంటున్న సమయంలో గిరిజన మహిళ శ్రీమతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నిక కావడం గిరిజనులకు గర్వకారణమని శ్రీ అర్జున్ ముండా అన్నారు. శ్రీమతి ద్రౌపది ముర్ము దేశ గిరిజనులకు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. శ్రీమతి ద్రౌపది ముర్ము దేశ అత్యున్నత పదవికి ఎన్నిక కావడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ శక్తిని చాటిందని అన్నారు. 

ఈ ఏడాది జంజాతీయ గౌరవ్‌ సందర్భంగా బిర్సా ముండా మరియు ఇతర గిరిజన నాయకులపై వ్యాసాలు రాసి వాటిని గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపాలని ఈఎంఆర్ఎస్ విద్యార్థులకు శ్రీ అర్జున్ ముండా సూచించారు. గిరిజన సంస్కృతిలో  నీరు, అడవులు, ప్రజలు మమేకం అవుతారని మంత్రి అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఈఎంఆర్ఎస్ విద్యార్థులు తమ పాఠశాలలు, గ్రామాల్లో మొక్కలు నాటి  ఇతరులకు స్ఫూర్తి కలిగించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని శ్రీ అర్జున్  ముండా  సలహా ఇచ్చారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న  హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో  1 లక్ష మంది ఈఎంఆర్ఎస్   విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని శ్రీ అర్జున్ ముండా సూచించారు. 

కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడువాన్‌  నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, మానవతావాదులు గా 

తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులు, సిబ్బందికి సూచించారు. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి విద్యార్థులు తమ సొంత సంస్కృతిని మరిచిపోవద్దని ఆయన విద్యార్థులకు హితవు పలికారు. దేశ నిర్మాణానికి విద్యార్థులు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

గిరిజన వ్యవహారాల కార్యదర్శి శ్రీ అనిల్ కుమార్ ఝా మాట్లాడుతూ విద్య ద్వారా ఒక  వ్యక్తి  సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి వీలవుతుందని అన్నారు.  ప్రతి పాఠశాల, విద్యార్థి తమ సొంత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకునేందుకు కృషి చేయాలని  ఆయన అన్నారు.

***



(Release ID: 1850423) Visitor Counter : 240