శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

టీఐహెచ్‌ల ద్వారా ఇండో యూఎస్ జాయింట్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌లు అమలు చేయాల్సిన ఉత్తమ ప్రణాళికలపై చర్చించిన నిపుణులు

Posted On: 09 AUG 2022 4:52PM by PIB Hyderabad

డిఎస్‌టీ-ఎన్‌ఎస్‌ఎఫ్‌ జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ కిక్-ఆఫ్ వర్క్‌షాప్‌లో టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్స్ (టిఐహెచ్‌) ద్వారా అమలు చేయనున్న జాయింట్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌లకు అత్యుత్తమ ప్రణాళికలను తీసుకురావడానికి భారత్, అమెరికా  నిపుణులు చర్చించారు.

ఎన్‌ఎస్ఎఫ్ మద్దతు ఉన్న సంస్థలతో సహకార పరిశోధన మరియు అభివృద్ధి కోసం ఎన్‌ఎమ్‌-ఐసీపిఎస్‌ కింద గుర్తించబడిన ఆరు టిఐహెచ్‌లు అమలు చేయాల్సిన ప్రాజెక్ట్‌ల టెస్ట్‌బెడ్‌లు మరియు డేటాసెట్‌ల వంటి ప్రత్యేక వనరులను ఎలా ఉపయోగించుకుంటాయో చర్చించడానికి డిఎస్‌టీ సహకారంతో ఐఐటీ ఢిల్లీ ఈ వర్క్‌షాప్ నిర్వహించింది. భారత్ మరియు యూఎస్‌లో ఏఐ, అధునాతన వైర్‌లెస్ వంటి క్లిష్టమైన సాంకేతికతలపై సహకారాన్ని విస్తరించడం మరియు విద్యార్థి మరియు పరిశోధకుల మార్పిడి కార్యక్రమాలను ఇది ప్రోత్సహిస్తుంది.

యూఎస్‌ఏ నుండి టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్స్ (టిఐహెచ్‌లు) మరియు పరిశోధనా సంస్థలు అమలు చేయనున్న మొత్తం 35 ఉమ్మడి ప్రాజెక్టులను గుర్తించినట్లు డిఎస్‌టీ సీనియర్ అడ్వైజర్ డాక్టర్ అఖిలేష్ గుప్తా తెలిపారు. "ఈ ప్రయత్నం సిపిఎస్ ప్రాంతంలో రెండు దేశాల మధ్య సహకార పరిశోధన మరియు అభివృద్ధిని సాధించడానికి మాకు మరింత సహాయం చేస్తుంది," అన్నారాయన.

 

 



యూఎస్‌ మా సహజ భాగస్వామి. ప్రత్యేకించి సైన్స్‌లో మనం సాంప్రదాయక భాగస్వామ్యం కలిగి ఉన్నాము. అలాగే సహకార ప్రాజెక్టుల ద్వారా సంస్థ స్థాయిలో, ప్రభుత్వ స్థాయిలో మరియు ప్రజల స్థాయిలో కూడా భాగస్వామ్యం మరింత లోతుగా ఉంటుంది ”అని డాక్టర్ గుప్తా తెలిపారు.

ఎన్‌ఎస్‌ఎఫ్‌-మద్దతు ఉన్న సంస్థలతో సహకార పరిశోధన మరియు అభివృద్ధి కోసం ఎన్‌ఎమ్‌-ఐసీపిఎస్‌ కింద ఆరు టీఐహెచ్‌లు గుర్తించబడ్డాయి. ఈ ప్రాజెక్టులు రెండు దేశాలలో ఇప్పటికే ఉన్న పరిశోధన ప్రాజెక్టులకు అంతర్జాతీయ సహకారం  జోడించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. హబ్‌లు నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్ కింద డిఎస్‌టీ ద్వారా దాదాపు $430 మిలియన్ల పెట్టుబడిలో ఐదు సంవత్సరాల భాగం మరియు విద్యా పరిశోధకులు మరియు పరిశ్రమ భాగస్వాములను కలిగి ఉంటాయి.

“అందరికీ శ్రేయస్సు మరియు అవకాశాల కోసం భారతదేశంతో భాగస్వామిగా ఉండటానికి యుఎస్ కట్టుబడి మరియు గర్వంగా ఉంది. ఈ ప్రాజెక్టులు ఆశావహమైనవి మరియు సామాజిక సమస్యలను పరిష్కరించగలవు, ”అని ఎన్‌ఎస్‌ఎఫ్ డైరెక్టర్ డాక్టర్ సేతురామన్ పంచనాథన్ తెలిపారు

ఈ వర్క్‌షాప్ సమాజంలోని సమస్యలను పరిష్కరించడానికి మరియు టిఐహెచ్‌ని నిర్మించడానికి వీలు కల్పిస్తుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ (ఐఐటీ ఢిల్లీ) డైరెక్టర్ ప్రొఫెసర్ రంగన్ బెనర్జీ అన్నారు.



డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్‌టీ), భారత ప్రభుత్వం మరియు నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్‌ఎస్‌ఎఫ్‌) సెప్టెంబరు 2021లో వ్యవసాయం, స్వయంప్రతిపత్త వ్యవస్థల సాంకేతికతలు మరియు అప్లికేషన్‌లు, ఆరోగ్యం మరియు పర్యావరణం, పునరావాసం మరియు సహాయక రోబోటిక్‌ల నేపథ్య రంగాలలో సహకార పరిశోధన మరియు వివిధ సైబర్ వ్యవస్థలను కవర్ చేసే స్మార్ట్ సిటీల అభివృద్ధి కోసం చేతులు కలిపాయి.

కొత్త తరం సాంకేతికతలలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి డిఎస్టీ ఐదు సంవత్సరాల కాలానికి  రూ. 3,660.00 కోట్లతో నేషనల్ మిషన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్ (ఎన్‌ఎంఐసిపిఎస్‌)ని అమలు చేస్తోంది. ఈ మిషన్ అమలులో భాగంగా సైబర్-ఫిజికల్ సిస్టమ్స్‌కు బలమైన పునాది మరియు అవాంతరాలు లేని పర్యావరణ వ్యవస్థను సృష్టించేందుకు, విధాన రూపకర్తలు, పరిశోధకులు/ఆవిష్కర్తలకు వేదికగా నిలిచేందుకు ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్‌లు, స్టార్టప్‌లు, వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, పరిశ్రమలు మరియు గ్లోబల్ కనెక్ట్ అందించేందుకు 25 టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్‌లు (టిఐహెచ్‌లు) దేశంలోని ప్రసిద్ధ సంస్థల్లో అధునాతన సాంకేతికతలతో స్థాపించబడ్డాయి. ,

ఈ వర్క్‌షాప్‌లో ఇంటర్నేషనల్ కార్పొరేషన్, డిఎస్‌టీ హెడ్ శ్రీ సంజీవ్ కె వర్ష్నే; డాక్టర్ ఏక్తా కపూర్, ఎఫ్‌ఎఫ్‌టి డివిజన్ హెడ్; డాక్టర్ జేబివి రెడ్డి, సైంటిస్ట్ ఎఫ్‌, డిఎస్‌టీ; డా. కేంద్ర షార్ప్,  ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ హెడ్,; డా. బ్రిడ్జేట్ తురగా, ప్రోగ్రామ్ డైరెక్టర్, ఓ/ఓ ఇంటర్నేషనల్ సైన్స్ & ఇంజనీరింగ్;టిఐహెచ్‌లు మరియు అమెరికా ఇన్‌స్టిట్యూట్‌ల ప్రతినిధులతో పాటుగా కంప్యూటర్ మరియు నెట్‌వర్క్ సిస్టమ్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్. గుర్దీప్ సింగ్ పాల్గొన్నారు.



 

<><><><>



(Release ID: 1850422) Visitor Counter : 143


Read this release in: English , Urdu , Hindi , Tamil