జల శక్తి మంత్రిత్వ శాఖ
మరుగుదొడ్ల నిర్మాణానికి వెచ్చించిన నిధులు
Posted On:
08 AUG 2022 3:43PM by PIB Hyderabad
స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) [ఎస్ బి ఎం (జి)] కింద అన్ని కంపోనెంట్లకు ఏకీకృత నిధుల కేటాయింపు జరుగుతుంది. 2016-17 నుండి 2019-20 వరకు ఎస్ బి ఎం (జి) కోసం కేటాయించిన సెంటర్ షేర్ నిధుల వివరాలు :
(రూ.కోట్లలో)
ఆర్థిక సంవత్సరం
|
కేటాయించిన నిధులు
|
2016-17
|
10500.00
|
2017-18
|
16948.27
|
2018-19
|
23176.23
|
2019-20
|
11938.22
|
ఎస్ బి ఎం (జి) కింద, సాధారణ కార్యక్రమాల నిధుల కోసం, కాంపోనెంట్ వారీగా ఖర్చులను రాష్ట్రాలు ఆడిట్ చేసిన స్టేట్‌మెంట్ ఆఫ్ అకౌంట్స్ (ఏఎస్ఏలు)లో కేంద్ర, రాష్ట్ర షేర్ల కోసం ఏకీకృత పద్ధతిలో నివేదించాయి. రాష్ట్రాలు/యూటీలు అందించిన ఏఎస్ఏల ప్రకారం, 2016-17 నుండి 2019-20 మధ్య కాలంలో వ్యక్తిగత గృహ మరుగుదొడ్ల నిర్మాణం కోసం మొత్తం రూ.83,863.91 కోట్లు వినియోగించారు. ఇందులో కేంద్రం వాటా మొత్తం రూ.51,800 కోట్లు.
ఈ సమాచారాన్ని జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
****
(Release ID: 1850097)
Visitor Counter : 137