జల శక్తి మంత్రిత్వ శాఖ
జల్ జీవన్ మిషన్ అమలు జరుగుతున్న తీరు
Posted On:
08 AUG 2022 3:50PM by PIB Hyderabad
దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా నీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నుంచి జల్ జీవన్ మిషన్- హర్ ఘర్ జల్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. జల్ జీవన్ మిషన్ ప్రారంభం అయ్యే సమయానికి దేశంలో 3.23 కోట్ల గ్రామీణ గృహాలు కుళాయి ద్వారా నీరు పొందుతున్నాయి. జల్ జీవన్ మిషన్ ప్రారంభమైన తర్వాత ఇంతవరకు గత 35 నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 6.70 కోట్లకు పైగా గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. దీనితో కొళాయి కనెక్షన్లు కలిగిన గృహాల సంఖ్య 9.94 కోట్లకు చేరింది. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 19.11 కోట్ల గృహాలలో 9.94 కోట్ల గృహాలు ( 51.99%) 2022 ఆగస్టు 3 నాటికి కుళాయి కనెక్షన్ కలిగి ఉన్నాయి.
దేశంలో జల్ జీవన్ మిషన్ వేగంగా లక్ష్యాల మేరకు అమలు జరిగేలా చూసేందుకు అనేక చర్యలను తీసుకోవడం జరిగింది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదింపులు జరిపి వార్షిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం, పథకాలు అమలు జరుగుతున్న తీరును తరచు సమీక్షించడం, వర్క్ షాపులు/సదస్సులు/వెబినార్ల ద్వారా సామర్థ్యాన్ని పెంపొందించడం, అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు వివిధ విభాగాలకు చెందిన నిపుణులు సభ్యులుగా ఉండే బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటించడం లాంటి అనేక చర్యలు అమలు జరుగుతున్నాయి. జల్ జీవన్ మిషన్ అమలుకు సంబంధించి అన్ని వివరాలతో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంత గృహాలకు పైపుల ద్వారా రక్షిత మంచి నీరు సరఫరా చేసేందుకు అమలు చేయాల్సిన చర్యలపై గ్రామ పంచాయతీలు, గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య కమిటీలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు, ఆశ్రమాలు, పాఠశాలలకు మంచినీరు సరఫరా చేసే అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం జరిగింది. జల్ జీవన్ మిషన్ ప్రణాళిక మరియు అమలును సులభతరం చేయడానికి. ఆన్‌లైన్ పర్యవేక్షణ కోసం JJM-ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (IMIS) మరియు JJM-డ్యాష్‌బోర్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్థిక అంశాలు పారదర్శకంగా జరిగేందుకు పబ్లిక్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టమ్( PFMS) అమలులో ఉంది.
ఇప్పటివరకు, గోవా, తెలంగాణ, హర్యానా రాష్ట్రాలు మరియు A & N దీవులు, దాద్రా & నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ మరియు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాలు అన్ని గృహాలకు పంపు నీటి కనెక్షన్‌ను అందించినట్టు నివేదికలు అందించాయి. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి గ్రామీణ గృహాలకు కల్పించిన కుళాయి నీటి కనెక్షన్ వివరాలు రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం, జిల్లా గ్రామాల వారీ స్థితి మొదలైనవి పబ్లిక్ డొమైన్‌లో మరియు JJM డాష్‌బోర్డ్‌లో
https://ejalshakti.gov.in/ jjmreport/JJMIndia.aspx లో అందుబాటులో ఉన్నాయి:
ఈ సమాచారాన్ని జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపారు.
***
(Release ID: 1850095)
Visitor Counter : 209