పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
నదుల రక్షణ కోసం వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలు (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు).
నాడు పోస్టు చేయడమైనది:
08 AUG 2022 4:41PM by PIB Hyderabad
సట్లెజ్, బియాస్, రావి, చీనాబ్, జీలం అనే 13 ప్రధాన నదుల పునరుజ్జీవనం కోసం డెహ్రాడూన్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసీఎఫ్ఆర్ఈ ) రూపొందించిన సవివరమైన ప్రాజెక్ట్ నివేదికలను (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు)కేంద్ర పర్యావరణ, అటవీ & వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. లూని, యమునా, మహానది, బ్రహ్మపుత్ర, నర్మద, గోదావరి, కృష్ణా కావేరి అటవీశాఖ ప్రయత్నాల ద్వారా మార్చి, 2022లో ఈ కార్యక్రమం మొదలయింది. ఇందులో చెట్ల పెంపకం, పరీవాహక ప్రాంతంలో నేల తేమ సంరక్షణ పనులు, గ్రీన్ కవర్ కార్బన్‌ను పెంచడానికి నది ముందు అభివృద్ధి వంటి పనులు ఉన్నాయి. బురద, వరదలను తగ్గించడం ఉపాధిని సృష్టించడంతో పాటు భూగర్భ జల మట్టాలను పెంచడమూ ఈ కార్యక్రమంలో భాగం. ఈ పదమూడు డిపిఆర్‌లలో ఐదేళ్లపాటు ప్రతిపాదించిన పనుల కోసం మొత్తం రూ. 19,342.62 కోట్లు అవసరం. ఇందులో నాలుగు ప్రధాన పనులు ఉన్నాయి. ఇవి (ఎ) అటవీ పనుల అమలు, (బి) నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ నేషనల్ కెపాసిటీ డెవలప్‌మెంట్‌ను బలోపేతం చేయడం, (సి) విజయవంతమైన నమూనాల స్కేలింగ్ రెప్లికేషన్‌తో సహా నిర్వహణ దశ, (డి) జాతీయ సమన్వయం అటవీ సంరక్షణ కోసం నది పరిరక్షణ. బహుళ-శాఖల భాగస్వామ్యంతో అమలు కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకోవడం జరిగింది. రాష్ట్ర అటవీ శాఖలు వ్యవసాయ & ఉద్యానవన శాఖ, పట్టణ మునిసిపల్ సంస్థలు, గ్రామీణాభివృద్ధి శాఖ మొదలైన సంబంధిత శాఖలతో కలిసి వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద నిధులు, వనరులతో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు లను అమలు చేయాలని భావించారు. డిపిఆర్‌ల ప్రకారం నదుల వారీగా పారిశుద్ధ్య ప్రాంతం వివరాలు అనుబంధంలో ఇవ్వబమైనది. కేంద్ర పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(రిలీజ్ ఐడి: 1850088)
సందర్శకుల సూచీ సంఖ్య : : 179