శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

జమ్మూ విశ్వవిద్యాలయంలో డోగ్రి భాషలో ప్రచురించిన జాతీయ సైన్స్ మాసపత్రిక "విజ్ఞాన్ జత్తారా" ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 07 AUG 2022 3:29PM by PIB Hyderabad

కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ  డోగ్రి భాష లో ప్రచురించిన జాతీయ సైన్స్ మాసపత్రిక "విజ్ఞాన్ జత్తారా" ను జమ్మూ విశ్వవిద్యాలయం బ్రిగేడియర్ రాజిందర్ సింగ్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ (స్వతంత్ర బాధ్యత), భూ శాస్త్ర సహాయ  (స్వతంత్ర బాధ్యత), సిబ్బంది వ్యవహారాలు,ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు. అణుశక్తి, అంతరిక్ష శాఖ ,మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆవిష్కరించారు. కాశ్మీరీ భాషలో కూడా   పత్రిక త్వరలో అందుబాటులోకి వస్తుందని డాక్టర్ సింగ్ ప్రకటించారు.
ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడిన డాక్టర్ జితేంద్ర సింగ్ స్థానిక ప్రాంతీయ భాషలో శాస్త్రీయ సమాచారం  వ్యాప్తి జరిగేలా చూడాలని  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదేశించారని తెలిపారు. స్థానిక ప్రాంతీయ భాషలో శాస్త్రీయ సమాచారం అందుబాటులోకి వచ్చినప్పుడు ఇంగ్లీష్ లేదా హిందీ భాషల్లో అంతగా ప్రావీణ్యం లేని యువత ఎటువంటి సమస్యలు లేకుండా శాస్త్ర రంగంలో సులువుగా పోటీ పడి రాణించేందుకు అవకాశం కలుగుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. మాతృ భాషలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనేక మంది యువతీ యువకులు ఇటీవల కాలంలో జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో వివిధ రంగాల్లో ప్రతిభ చూపి రాణించడం దీనికి నిదర్శనమని మంత్రి అన్నారు.. బీఏ వరకు తన విద్యాభ్యాసమంతా తెలుగు మీడియంలో పూర్తి చేసిన ఒక యువకుడు ఐఏఎస్/సివిల్ సర్వీసెస్ పరీక్షలో .మొదటి అయిదు స్థానాలు సాధించిన వారిలో ఒకరిగా నిలవడం దీనికి ఉదాహరణగా డాక్టర్ జితేంద్ర సింగ్ ఉటంకించారు.
కార్యక్రమంలో జమ్మూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్  ప్రొఫెసర్ ఉమేష్ రాయ్, జమ్మూ  సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్  ప్రొఫెసర్ సంజీవ్ జైన్ మరియు జమ్మూ విశ్వవిద్యాలయం ఫిజిక్స్ మాజీ విభాగాధిపతి ప్రముఖ డోగ్రీ రచయిత కూడా అయిన  ప్రొఫెసర్ లలిత్ మంగోత్రా  ప్రసంగించారు. ఉత్తర భారతదేశ విద్యా కేంద్రంగా జమ్మూని అభివృద్ధి చేసేందుకు   డాక్టర్ జితేంద్ర సింగ్ చేస్తున్న కృషిని అభినందించారు. ఇతర భాషలతో పాటు డోగ్రీ భాషలో కూడా  సైన్స్ విద్యను ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న చర్యలను వారు ప్రశంసించారు.
సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన జ్ఞానం మరియు పురోగతి ఆధారంగా  ప్రపంచం అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో దేశ  యువతకు తగిన పాఠ్యాంశాలు, సాహిత్యం మరియు వారికి నచ్చిన భాషలో సైన్స్ అధ్యయనం చేయడానికి అవకాశాలు కల్పించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు ఇంగ్లీష్ లేదా హిందీ మీడియం. విద్యార్థులతో పోటీ పడటానికి విద్యార్థులకు  తగిన పాఠ్యాంశాలను అందుబాటులోకి తేవాలని అన్నారు.
స్థానిక ప్రాంతీయ భాషలకు ఇతర భాషలతో సమానంగా ప్రాధాన్యత ఇవ్వలన్న గట్టి పట్టుదలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉన్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. దీనికి నిదర్శనం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రమని మంత్రి అన్నారు.ఆగస్టు 5, 2019 తీసుకున్న  చారిత్రాత్మక నిర్ణయం ప్రకారం   ఐదు భాషలు.. ఇంగ్లీష్, హిందీ,ఉర్దూ,డోగ్రి, కాశ్మీరీ అధికార భాషలుగా గుర్తింపు పొందాయని మంత్రి అన్నారు. అయిదు అధికార భాషలు కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ ఘనత సాధించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.
శాస్త్ర రంగంలో రాణించేందుకు భాష ఆటంకం కాదని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. భాషకు, శాస్త్ర రంగానికి ఏ మాత్రం సంబంధం లేదని ఆయన అన్నారు. ఇంగ్లీష్ భాషపై అవగాహన లేకుండానే రష్యా, జపాన్, చైనా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచస్థాయి శాస్త్రవేత్తలుగా ఎదగడం దీనికి నిదర్శనమని అన్నారు. భారతదేశంలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. దీనికి కారణం విద్యపై లార్డ్ మెకాలే రూపొందించిన విధానాన్ని దాదాపు రెండు దశాబ్దాల పాటు అమలు చేయడమే దీనికి కారణమని అన్నారు. లార్డ్ మెకాలే విధానం వల్ల ముఖ్యమైన పాఠ్యపుస్తకాలు మరియు సాహిత్యం ఎక్కువగా ఇంగ్లీషులో మాత్రమే అందుబాటులో ఉన్నాయని అన్నారు.విద్యార్థులు కూడా వాటినే చదవాల్సి వచ్చిందని అన్నారు.  విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లీషులో ఉన్న సైన్స్ పాఠ్య పుస్తకాలను భావం, అంశాలు చెడకుండా డోగ్రి భాషలో అనువదించడానికి సహకారం అందించాలని ఆయన శాస్త్రీయ అంశాలపై పట్టు కలిగిన డోగ్రీ స్కాలర్లు ముందుకు రావాలని మంత్రి కోరారు.  
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ,ప్రపంచంలో  భారతదేశం అగ్ర స్థానానికి చేరుకోవడానికి  రాబోయే 25 సంవత్సరాల కాలం అబ్దుత అవకాశం అందిస్తుందని పేర్కొన్న డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ 25 సంవత్సరాల కాలాన్ని అమృత కాలంగా వర్ణించారు.  శాస్త్రీయపరమైన నైపుణ్యాలు, సాంకేతిక ఆధారిత  స్టార్టప్‌ల సామర్థ్యంపై ఆధారపడి భారతదేశం అగ్ర స్థానానికి చేరుతుందని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని  2047 సంవత్సరం వరకు పూర్తి సామర్థ్యం కలిగి  మరో 25  సంవత్సరాల పాటు సేవలు అందించగల  30 ఏళ్ల వయస్సులో ఉన్న  యువత,  ఉన్న స్టార్టప్‌లు శాస్త్రీయ సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారించి పనిచేయాలని మంత్రి అన్నారు.  మాట్లాడే లేదా చదివే భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇవ్వాలని ఐన్ అన్నారు.
శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రైవేట్ రంగానికి అంతరిక్ష రంగాన్ని అందుబాటులోకి తేవడం, అణుశక్తి రంగంలో జాయింట్ వెంచర్లు అమలు అనుమతించమని మంత్రి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. దేశంలో  అతి తక్కువ సమయంలో  100 యునికార్న్‌లతో 75,000 స్టార్టప్‌లు  ఏర్పాటు కావడం దేశం సాధిస్తున్న ప్రగతికి నిర్దర్శనమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.  భారతీయ భాషల్లో సైన్స్ కమ్యూనికేషన్ మరియు విద్యను ప్రోత్సహించడం ప్రస్తుత ప్రభుత్వం యొక్క ముఖ్యాంశాలలో ఒకటి అని మంత్రి చెప్పారు, విద్యార్థులకు స్థానిక భాషలలో సైన్స్ పాఠ్య పుస్తకాలను అందుబాటులో తెచ్చేందుకు  ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. నిపుణుల బృందానికి  భారతీయ భాషల్లో సైన్స్ కమ్యూనికేషన్ మరియు విద్య అంశాలను అందుబాటులోకి తెచ్చే  బాధ్యత అప్పగించినట్లు ఆయన చెప్పారు.
 కాశ్మీర్ సెంట్రల్ యూనివర్శిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డోగ్రీ లాంగ్వేజ్‌కి కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ జితేంద్ర సింగ్ సైన్స్ మ్యాగజైన్‌ను డోగ్రీ భాషలో ప్రభావవంతంగా అనువదించడానికి సహకారం అందించాలని  కోరారు.
రష్యా, జపాన్, జర్మనీ, చైనా వంటి అత్యంత అభివృద్ధి చెందిన దేశాలు తమ మాతృభాషల్లో అత్యుత్తమ సైన్స్ సాహిత్యం మరియు ప్రాజెక్టులను కలిగి ఉన్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.  భారతదేశం కూడా అన్ని భారతీయ భాషలలో ఆధునిక శాస్త్ర సాంకేతిక అంశాలకు ప్రాచుర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని   మంత్రి అన్నారు. మాతృభాషలో విద్య బోధన జరిగినప్పుడు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేసేందుకు వీలవుతుందని  అన్నారు.
 2021 డిసెంబర్ లో డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్ లో సైన్స్ మాసపత్రికను హిందీ, ఉర్దూ మరియు ఇంగ్లీషు భాషల్లో   విడుదల చేశారు. 

***

 



(Release ID: 1849547) Visitor Counter : 158


Read this release in: English , Urdu , Hindi , Punjabi