కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఆసియా , ఓషియానియా ప్రాంత ఐటియు రీజనల్ స్టాండర్డైజేషన్ ఫోరమ్ (ఆర్ ఎస్ ఎఫ్) ను రేపు ప్రారంభించనున్న శ్రీ దేవుసిన్హ్ చౌహాన్


ఫోరమ్ లో పాల్గొనేందుకు 20 దేశాల నుంచి 250 మందికి పైగా ప్రతినిధులు

ఫోరమ్ తరువాత 09 ఆగస్టు 2022 నుంచి 12 ఆగస్టు 2022 వరకు ఐటియు-టి స్టడీ గ్రూప్ 3 రీజనల్ గ్రూప్ ఆసియా అండ్ ఓషియానియా (ఐ టి యు - టి ఎస్ జి 3 ఆర్ జి -ఏ ఓ ) సమావేశం

Posted On: 07 AUG 2022 2:50PM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ 2022 ఆగస్టు 8న న్యూఢిల్లీలో ఆసియా, ఓషియానియా ప్రాంత ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ రీజనల్ స్టాండర్డైజేషన్ ఫోరమ్ (ఆర్ఎస్ఎఫ్) ను నిర్వహిస్తోంది. "టెలికమ్యూనికేషన్స్/ఐసిటిల రెగ్యులేటరీ, పాలసీ అంశాలు" అనే ఇతివృత్తం తో  ఫోరమ్ జరుగుతుంది. ఫోరమ్ అనంతరం 2022 ఆగస్టు 09 నుంచి 2022 ఆగస్టు 12 వరకు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్-టీ స్టడీ గ్రూప్ 3 రీజనల్ గ్రూప్ ఆసియా అండ్ ఓషియానియా (ఐటియు-టి ఎస్ జి3ఆర్ జి-ఎఒ) నాలుగు రోజుల సమావేశం జరుగుతుంది.

 

రీజనల్ స్టాండర్డైజేషన్ ఫోరమ్ ను కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి శ్రీ దేవుసిన్హ్ చౌహాన్ రేపు ప్రారంభిస్తారు.

 

రీజనల్ స్టాండర్డైజేషన్ ఫోరమ్ ఆలోచనల నిర్మాణాత్మక మార్పిడికి ఒక వేదిక, సుస్థిరమైన డిజిటల్ మార్పు , ఐటియు ప్రమాణాల పాత్ర, వర్ధమాన మార్కెట్లలో డిజిటల్ ,ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం టెక్నాలజీలను

ఉపయోగించుకోవడం, డేటా వాల్యూ ఛైయిన్ , డిజిటల్ హెల్త్ వంటి వివిధ సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో భారతదేశ అనుభవంతో సహా ప్రామాణికీకరణ అంశాలను ఫోరమ్ చర్చిస్తుంది. పాలసీ , రెగ్యులేటరీ కోణం లో వివిధ ఉప-ఇతివృత్తాల కింద ఆసియా ,ఓషియానియా రీజియన్ అనుభవాల అంతర్దృష్టిని అందించడం లక్ష్యం గా ప్యానెల్ చర్చ జరుగుతుంది. రీజనల్ స్టాండర్డైజేషన్ ఫోరమ్ లో అకాడెమియా, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ , ఐ సి టి , రంగం ,భారత ప్రభుత్వం నుంచి  15 మంది ప్రముఖ వక్తలు ప్రసంగిస్తారు, ఐ టి యు సభ్య దేశాలు, సెక్టార్ సభ్యులు, అసోసియేట్‌లు,  విద్యాసంస్థలు,  ఇంకా ఐ టి యు కార్యకలాపాలకు సహకరించాలనుకునే ఐ టి యు సభ్య దేశంలోని ఏ వ్యక్తి అయినా ఫోరమ్ లో పాల్గొనవచ్చు. అంతర్జాతీయ, ప్రాంతీయ జాతీయ సంస్థలలో సభ్యులుగా ఉన్న వ్యక్తులు కూడా ఇందులో ఉండవచ్చు. ప్రాంతీయ స్టాండర్డైజేషన్ ఫోరమ్ లో 20 దేశాల నుంచి 250 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారు.

అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో స్టాండర్డైజేషన్ పై తదుపరి పని కోసం ఐటియు-టి రీజనల్ గ్రూప్ ఆఫ్ ఆసియా ఓషియానియా తదుపరి సమావేశంలో ఆర్ ఎస్ ఎఫ్ లో చర్చల కీలక సూచనలు సమర్పించబడతాయి. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ భారతదేశ వివిధ సృజనాత్మక డిజిటల్ ఉత్పత్తులు/సేవలను ప్రదర్శించడానికి ఈ ఫోరమ్ సందర్భంగా ఒక ఎగ్జిబిషన్ ను కూడా నిర్వహిస్తుంది.

 

ఈ ఫోరం తరువాత ఐటియు-టి స్టడీ గ్రూప్ 3 రీజనల్ గ్రూప్ ఆసియా అండ్ ఓషియానియా (ఐటియు-టి ఎస్ జి3ఆర్ జి-ఎఒ) 09 ఆగస్టు 2022 నుండి 2022 ఆగస్టు 12 వరకు ఉంటుంది. ఐటియు-టి సభ్య దేశాలు సెక్టార్ సభ్యుల కోసం ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో 130 మందికి పైగా పాల్గొంటారు. కోవిడ్-19 కారణంగా మూడు సంవత్సరాల విరామం తరువాత రీజనల్ గ్రూప్ ఆసియా ,ఓషియానియాల సమావేశం భౌతిక మోడ్ లో జరుగుతోంది.ఐటియు-టి స్టడీ గ్రూప్ 3 స్టాండర్డైజేషన్ వర్క్ కు దోహదపడటం , ఆసియా ,ఓషియానియా ప్రాంత ప్రయోజనాలను భద్రపరచడం ఈ సమావేశం లక్ష్యం.

 

రీజనల్ గ్రూప్ మీటింగ్ లో పాల్గొనే ప్రతినిధుల సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం ‘‘ప్రామాణికీకరణలో ప్రభావం” వర్క్‌షాప్‌పై బ్రిడ్జింగ్ ది స్టాండర్డైజేషన్ గ్యాప్ శిక్షణ ద్వారా సమావేశంప్రారంభమవుతుంది. దీనికి ఐటియు జెనీవాలోని అధ్యయన బృందాల అధిపతి డాక్టర్ బిలేల్ జమోస్సీ నాయకత్వం వహిస్తారు.

 

జెనీవా ప్రధాన కార్యాలయానికి చెందిన ఐటియు బృందంతో పాటు, ఆసియా పసిఫిక్ ప్రాంత ఐటియు రీజనల్ ఆఫీస్ డైరెక్టర్ శ్రీమతి అట్సుకా ఒకుడా కూడా ఈ కార్యక్రమాలకు హాజరవుతారు.

 

***(Release ID: 1849544) Visitor Counter : 162


Read this release in: English , Urdu , Hindi