ఆర్థిక మంత్రిత్వ శాఖ
తమిళనాడు లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు
Posted On:
06 AUG 2022 3:55PM by PIB Hyderabad
చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన కొంతమంది నిర్మాతలు, పంపిణీదారులు మరియు ఫైనాన్షియర్ల కేసుల్లో ఆదాయం పన్ను శాఖ శోధన మరియు జప్తు కార్యకలాపాలు నిర్వహించింది. చెన్నై, మధురై, కోయంబత్తూరు, వెల్లూరులో దాదాపు 40 ప్రాంగణాల్లో 02.08.2022న సోదాలు జరిగాయి.
దాడులు నిర్వహించి, సోదాలు చేసిన ఆదాయం పన్ను శాఖ అధికారులు లెక్కలు చూపని నగదు లావాదేవీలు మరియు పెట్టుబడులకు సంబంధించిన అనేక నేరారోపణ దస్త్రాలు మరియు డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. రహస్య ప్రాంతాలు మరియు రహస్య గదులు కూడా సోదాల్లో బయటపడ్డాయి.
ఫిలిం ఫైనాన్షియర్ల కేసుల్లో జరిపిన సోదాల్లో లెక్కలు చూపని నగదు, ప్రామిసరీ నోట్లు, రుణాలకు సంబంధించి పత్రాలు బయటపడ్డాయి, వీటిని వివిధ చిత్ర నిర్మాణ సంస్థలు, మరియు ఇతరులకు అడ్వాన్స్ రూపంలో ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. చిత్ర నిర్మాణ సంస్థల కేసులలో నిర్వహించిన సోదాల్లో పన్ను ఎగవేతకు పాల్పడినట్టు రుజువు చేసే సాక్ష్యాలు బయటపడ్డాయి. సినిమాల విడుదల ద్వారా పొందిన వాస్తవ మొత్తాలు సాధారణ ఖాతా పుస్తకాలలో చూపిన మొత్తాల కంటే చాలా ఎక్కువగా వున్నాయి. ఇలా లెక్కల్లో చూపకుండా సంపాదించిన ఆదాయాన్ని బహిర్గతం చేయని పెట్టుబడులు, వివిధ బహిర్గతం చేయని చెల్లింపుల కోసం ఉపయోగిస్తున్నారని అధికారులు గుర్తించారు.
సినిమా పంపిణీదారుల కేసులలో నిర్వహించిన సోదాల్లో అధికారులు చట్టవిరుద్ధ కార్యక్రమాలు జరిగినట్టు రుజువు చేసే దస్త్రాలు, ఆధారాలు సంపాదించారు. థియేటర్ల నుంచి వస్తున్న వసూళ్లను సంస్థలు నగదు లెక్కలు చూపడం లేదు. సాక్ష్యాధారాల ప్రకారం, డిస్ట్రిబ్యూటర్లు సిండికేట్‌లుగా ఏర్పడి థియేటర్ కలెక్షన్‌లను క్రమపద్ధతిలో అణిచివేసారని అధికారులు గుర్తించారు. దీనితో వాస్తవంగా వచ్చిన ఆదాయాన్ని తక్కువ చేసి చూపించారు.
ఇంతవరకు జరిపిన సోదాలు, దాడుల్లో ఆదాయం పన్ను శాఖ అధికారులు . 200 కోట్ల రూపాయలకు పైగా లెక్కలు చూపని ఆదాయం, లెక్కలు చూపని .26 కోట్ల రూపాయల నగదు, మూడు కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే బంగారు ఆభరణాలు.స్వాధీనం చేసుకున్నారు.
తదుపరి విచారణ సాగుతోంది.
***
(Release ID: 1849397)