వ్యవసాయ మంత్రిత్వ శాఖ
స్మార్ట్ ఫార్మింగ్
Posted On:
05 AUG 2022 3:58PM by PIB Hyderabad
దేశ వ్యవసాయ రంగంలో సాంకేతికత, ఆవిష్కరణల వినియోగం ద్వారా ప్రభుత్వం స్మార్ట్ వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ (DAM)ను అమలు చేస్తోంది. ఇందులో ఇండియా డిజిటల్ ఎకోసిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్ (IDEA), ఫార్మర్స్ డేటాబేస్, యూనిఫైడ్ ఫార్మర్స్ సర్వీస్ ఇంటర్‌ఫేస్ (UFSI), కొత్త టెక్నాలజీపై రాష్ట్రాలకు నిధులు(NeGPA), మహలనోబిస్ జాతీయ పంట సూచన కేంద్రాన్ని పునరుద్ధరించడం (MNCFC), మృత్తిక ఆరోగ్యం, ఫెర్టిలిటీ మరియు ప్రొఫైల్ మ్యాపింగ్. NeGPA ప్రోగ్రామ్ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ (AI/ML), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IOT), బ్లాక్ చైన్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఉపయోగించి డిజిటల్ వ్యవసాయ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు ఇవ్వబడతాయి. డ్రోన్ సాంకేతికతలను స్వీకరించడం జరుగుతోంది. స్మార్ట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, ప్రభుత్వం వ్యవసాయ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహిస్తుంది. వ్యవసాయ-పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తుంది. ప్రధాన్ మంత్రి కృషి సిచాయ్ యోజన (PMKSY-PDMC) యొక్క పర్ డ్రాప్ మోర్ క్రాప్ కాంపోనెంట్ మైక్రో ఇరిగేషన్ టెక్నాలజీల ద్వారా వ్యవసాయంలో డ్రిప్ మరియు స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్స్ ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. eNAM (నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్)ను ప్రారంభించింది, ఇది రైతుల కోసం ప్రస్తుత వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ (APMC) మండీల మధ్య నెట్‌వర్క్‌లను సృష్టించే ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) వ్యవసాయంలో ఆవిష్కరణలు, విస్తరణ మరియు విద్యను ప్రోత్సహిస్తుంది. 2014-21లో వివిధ వ్యవసాయ పంటల కోసం మొత్తం 1575 క్షేత్ర పంట రకాలను విడుదల చేశారు. 2014-21లో రైతులకు మొబైల్ ద్వారా 91.43 కోట్ల వ్యవసాయ సలహాలు అందించారు. ఐసీఏఆర్ 2014-21లో వివిధ వ్యవసాయ మరియు రైతు సంబంధిత సేవలపై 187 మొబైల్ యాప్‌లను అభివృద్ధి చేసింది. ఈ ICAR యాప్‌లు ఇప్పుడు KISAAN అనే ఒక ప్లాట్‌ఫారమ్‌లో ఏకీకృతం చేయబడ్డాయి. ఉత్పత్తి మరియు ఉత్పాదకతతో పాటు రైతులు-శాస్త్రవేత్తల ఇంటర్‌ఫేస్‌తో ICAR ఈ కాలంలో FIRST (వ్యవసాయం, ఆవిష్కరణలు, వనరులు, సైన్స్ మరియు టెక్నాలజీ) చొరవను ప్రారంభించింది.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
****
(Release ID: 1848967)
Visitor Counter : 189