సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పాలనను సాంకేతికతతో నడిపించడంతో పాటు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనా సంస్కరణలలో ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


"సంస్కరణ, పనితీరు, పరివర్తన" అనేది మోడీ మంత్రం విజయగాథవెనుక ఉన్న సారాంశం

సంస్కరణల్లో నిరంతర ఆవిష్కరణలను తెలియజేస్తూ సెంట్రల్ సెక్రటేరియట్ మాన్యువల్ ఆఫ్ ఆఫీస్ ప్రొసీజర్ (సిఎస్ఎంఓపి) 2022, 16వ ఎడిషన్‌ను మంత్రి ప్రారంభించారు.

2014 నుండి, కొత్త పని సంస్కృతిలో, అన్ని మంత్రిత్వ శాఖలు ప్రాజెక్ట్‌ల అమలులో సమయపాలనలను ఖచ్చితంగా పాటిస్తున్నాయి: డాక్టర్ జితేంద్ర సింగ్

నిర్ణయాధికారంలో సామర్ద్యాన్ని పెంపొందించడానికి చేపట్టిన చర్యల ప్రభావంపై మూల్యాంకన నివేదిక సెంట్రల్ సెక్రటేరియట్ 2022, స్వచ్ఛత అసెస్‌మెంట్ రిపోర్ట్ 2022, సీపీగ్రామ్స్ నెల నివేదిక -జూలై 2022లో ను కూడా ఈ సందర్బంగా ఆవిష్కరించారు.

Posted On: 05 AUG 2022 5:09PM by PIB Hyderabad

కేంద్ర సైన్స్ & టెక్నాలజీ ; ఎర్త్ సైన్సెస్; పీఎంవో, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు మాట్లాడుతూ పాలనా సాంకేతికతను నడిపించడంతో పాటు, పాలనా సంస్కరణల్లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెట్టారని అన్నారు. సంస్కరణలు, పనితీరు, పరివర్తన అనే మోదీ మంత్రం విజయగాథ  సారాంశం ఇదేనని ఆయన అన్నారు.

 

 

సెంట్రల్ సెక్రటేరియట్ మాన్యువల్ ఆఫ్ ఆఫీస్ ప్రొసీజర్ (సిఎస్ఎంఓపి) 2022కి సంబంధించిన 16వ ఎడిషన్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, పాలనా సంబంధిత అంశాలన్నింటిపై వ్యక్తిగత ఆసక్తిని కనబరుస్తున్న మోడీ హయాంలో సంస్కరణల్లో నిరంతర ఆవిష్కరణలు జరుగుతున్నాయని అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ అమలు చేసిన పాలనా సంస్కరణల్లో కొన్ని విజయగాథలు, ఇంటర్వ్యూల రద్దు, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించడం, కాలం చెల్లిన చట్టాలను తొలగించడం వంటి కొన్ని విజయగాథలు కేంద్రంలో పునరావృతమవుతున్నాయని ఆయన తెలియజేశారు. 2014 మోడీ కేంద్రంలో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, పని సంస్కృతిలో స్పష్టమైన మార్పు కనిపించిందని, అన్ని మంత్రిత్వ శాఖలు ప్రాజెక్టుల అమలులో సమయపాలనను ఖచ్చితంగా పాటిస్తున్నాయని అన్నారు.  సిఎస్ఎంఓపి 2022 గురించి మంత్రి ప్రస్తావిస్తూ, 2019 తర్వాత, మోదీ ప్రభుత్వ హయాంలో ఇంత తక్కువ సమయంలో డిఏఆర్పిజి తయారు చేసిన 2వ మాన్యువల్ అని, ఇది సంస్కరణల్లో కొనసాగింపు, స్థిరత్వం, ఆవిష్కరణలకు స్పష్టమైన ప్రతిబింబమని మంత్రి అన్నారు.

ఫిర్యాదుల పరిష్కారంలో ఉత్పాదక,  ఫలితాల ఆధారిత సంస్కరణలను ప్రస్తావిస్తూ, కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖలోని పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డిఏఆర్పిజి) ఒక రోల్ మోడల్‌గా ఉద్భవించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఆ దిశ గా ప్రయత్నిస్తున్నాయని అన్నారు. అనేక రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల నుండి తమ ఫిర్యాదుల పోర్టల్‌ను సెంట్రల్ సీపీగ్రామ్స్ తో  అనుసంధానించడం కోసం అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయని కూడా ఆయన సూచించారు. జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర ఇలాంటి అనేక అభ్యర్థనలు అందుతున్నాయని ఆయన అన్నారు.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, సెంట్రల్ సెక్రటేరియట్ మాన్యువల్ ఆఫ్ ఆఫీస్ ప్రొసీజర్ 2022 అనేది సిఎస్ఎంఓపి 16వ ఎడిషన్. డిజిటల్ సెంట్రల్ సెక్రటేరియట్‌ దిశగా అడుగులు వేసేందుకు 1955లో మొదటిసారిగాప్రచురించారు. 


మొత్తం 4 నివేదికలు www.darpg.gov.inలో అందుబాటులో ఉంటాయి.
 

 

<><><><><>


(Release ID: 1848965) Visitor Counter : 119