పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

లక్నో మరియు ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్‌కతా మరియు గోవాల మధ్య 8 కనెక్టింగ్ విమానాలను ప్రారంభించిన పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా


ఉడాన్ కింద ఉత్తరప్రదేశ్‌కు 63 మార్గాలను కేటాయించిన పౌర విమానయాన శాఖ
భవిష్యత్తులో మార్గాల సంఖ్యను 108కి పెంచుతాం: శ్రీ సింధియా

ఉత్తరప్రదేశ్‌లో 5 అంతర్జాతీయ విమానాశ్రయాలు: శ్రీ సింధియా

Posted On: 05 AUG 2022 4:31PM by PIB Hyderabad
లక్నో మరియు ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్‌కతా మరియు గోవాల  మధ్య ఎయిర్ ఆసియా నిర్వహించనున్న 8 కనెక్టింగ్ విమానాలను   పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా,  పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ ఈ రోజు ప్రారంభించారు. 
 లక్నో విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమానికి  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్  గౌరవ అతిథిగా హాజరయ్యారు. ప్రారంభోత్సవంలో పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ బన్సాల్, సంయుక్త కార్యదర్శి శ్రీమతి ఉషా పాధీ  ,ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మిశ్రా,   సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్పీ  గోయల్, ఎయిర్ ఆసియా సీఈవో, ఎండీ  శ్రీ సునీల్ భాస్కరన్,  పౌర విమానయాన శాఖ .ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరియు ఎయిర్ ఆసియా ప్రతినిధులు పాల్గొన్నారు. 
 నూతన  విమాన సర్వీసులను  ప్రారంభించిన అనంతరం మాట్లాడిన  శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా  “ఒక విమానయాన సంస్థ భారతదేశంలో 5 నగరాలకు 8 కనెక్టింగ్ విమానాలతో ఒక నగరానికి విమాన సర్వీసులను ప్రారంభించడం ఒక చారిత్రాత్మక సంఘటన. ఈ విజయానికి కారణమైన ఎయిర్ ఏషియా మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు   అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లక్నో ఇప్పుడు ఢిల్లీకి 3 విమానాలతో, బెంగళూరుకు 2 విమానాలతో, ముంబైకి 1 ఫ్లైట్‌తో, కోల్‌కతాకు 1 ఫ్లైట్‌తో మరియు గోవాకు ఒక రోజులో 1 ఫ్లైట్‌తో అనుసంధానించబడి ఉంది" అని అన్నారు. 
లక్నో మరియు ఢిల్లీ, బెంగళూరు, గోవా మధ్య సర్వీసులు  ఈ రోజు ప్రారంభమయ్యాయి.  లక్నో మరియు ముంబై , కోల్‌కతా మధ్య 01  సెప్టెంబర్ 2022 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పౌర విమానయానాన్ని ప్రోత్సహించడానికి  మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలను శ్రీ సింధియా వివరించారు.   ఉడాన్ పథకం కింద ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 63 కొత్త మార్గాలను కేటాయించామని అన్నారు. . భవిష్యత్తులో ఈ సంఖ్యని  108కి పెంచుతామని మంత్రి ప్రకటించారు. దీనివల్ల   ఉత్తరప్రదేశ్‌లో ప్రతి ప్రాంతానికి విమాన సేవలు అందుతాయని శ్రీ శ్రీ సింధియా తెలిపారు. .ఉడాన్  పథకం కింద ఉత్తర ప్రదేశ్‌లోని 18 విమానాశ్రయాలనుగుర్తించామని తెలిపిన శ్రీ సింధియా వీటిలో మౌలిక సదుపాయాలను  అభివృద్ధి చేసేందుకు  1,121 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం ఉంటుందని అన్నారు.  దేశంలోనే మైలురాయిగా నిలిచే విధంగా ఉత్తరప్రదేశ్‌లో 5 అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. . ఉత్తరప్రదేశ్‌ను ఆత్మనిర్భర్ భారత్‌కు ఉజ్వలమైన ఉదాహరణగామార్చాలన్న పట్టుదలతో  ప్రధానమంత్రి ఉన్నారని శ్రీ సింధియా తెలిపారు. ప్రధానమంత్రి కలను సాకారం చేసేందుకు జెవార్ మరియు అయోధ్యతో పాటు చిత్రకూట్, మురాదాబాద్, అలీఘర్, అజంగఢ్ మరియు శ్రావస్తిలో విమానాశ్రయాలను నిర్మిస్తామని శ్రీ సింధియా ప్రకటించారు. 
లక్నోకు నూతన విమాన సర్వీసులు ప్రారంభించిన ఎయిర్ ఆసియా సంస్థను పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ అభినందించారు ఏటీఎఫ్ పాల వాట్ తగ్గించిన  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను అభినందించిన మంత్రి ఈ చర్య వల్ల రాష్ట్రంలో విమాన సర్వీసులు పెరుగుతాయని అన్నారు. 
టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థగా పనిచేస్తున్న ఎయిర్ ఏషియా (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ 12 జూన్ 2014న భారతదేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించింది.  భారతదేశం  అంతటా 18 గమ్యస్థానాలకు 50 ప్రత్యక్ష మరియు 100 కనెక్టింగ్ మార్గాలలో సంస్థ విమాన సర్వీసులు నిర్వహిస్తోంది. 

ఈ కొత్త కనెక్షన్లు లక్నో మరియు దేశంలోని ముఖ్య నగరాల మధ్య కనెక్టివిటీని మరింత ఎక్కువ  చేస్తాయి.  ఈ ప్రాంతంలో టూరిజంవాణిజ్యం మరియు వాణిజ్యాన్ని పెంపొందించడం తో పాటు మెరుగైన అనుసంధానం అందిస్తుంది.  లక్నోలో నివసించే ప్రజలకు సరసమైనసమయానికిసురక్షితమైన మరియు అవాంతరాలు లేని ప్రయాణ అనుభవాన్ని కూడా అందిస్తుంది.

లక్నో మరియు ముఖ్య నగరాల మధ్య వాణిజ్య విమానాలు ఈరోజు, 5 ఆగస్టు 2022న ప్రారంభమయ్యాయి. 

***



(Release ID: 1848963) Visitor Counter : 112


Read this release in: English , Urdu , Hindi