మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
సెక్స్ వర్కర్లు గౌరవంగా జీవించడానికి అనుకూలమైన పరిస్థితులపై ఎన్ సి డబ్ల్యూ (NCW) సంప్రదింపులు నిర్వహిస్తోంది.
Posted On:
05 AUG 2022 5:33PM by PIB Hyderabad
జాతీయ మహిళా కమిషన్ (NCW) సెక్స్ వర్కర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అర్థం చేసుకోవడానికి, వారి హక్కులను కాపాడటానికి వారిని ప్రధాన జన జీవన స్రవంతిలోకి తీసుకురావడానికి అవసరమైన సిఫార్సులు తీసుకోవడానికి 'సెక్స్ వర్కర్స్ గౌరవంగా జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు' అనే అంశంపై ఒక సంప్రదింపుల సమావేశం నిర్వహించింది.
ఈ సంప్రదింపుల సమావేశం ద్వారా, కమీషన్ ఇటీవలి సుప్రీంకోర్టు వెలురించిన తీర్పు గురించి అట్టడుగునవున్న అసహాయ సెక్స్ వర్కర్లకు అవగాహన కల్పించడం, అలాగే సెక్స్ వర్కర్లు , అలాగే పిల్లల రక్షణ, సెక్స్ వర్కర్ల యొక్క మానవ, పౌర ప్రాథమిక హక్కులు ఎలా పరిరక్షించుకోవాలి, అలాగే సెక్స్ వర్కర్ల గౌరవాన్ని కాపాడేందుకు ప్రజలను చైతన్యం చేయడం వంటి అంశాలను చర్చించింది.
జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శ్రీమతి రేఖా శర్మ, ఎన్‌సీడబ్ల్యూ మెంబర్ సెక్రటరీ శ్రీమతి మీటా రాజీవ్‌లోచన్ ఇతర సీనియర్ అధికారులు ఈ సంప్రదింపుల సమావేశంలో పాల్గొన్నారు. సెక్స్ వర్కర్ల సమస్యలను అర్థం చేసుకోవడానికి దేశవ్యాప్తంగా ఈ సమస్య పై పనిచేస్తున్న ప్రజాసంఘాల ప్రతినిధులను సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఆల్ ఇండియా నెట్‌వర్క్ ఆఫ్ సెక్స్ వర్కర్స్, సహేలి సంఘ్, సంగ్రామ్, కాట్-కథా ఫౌండేషన్, గురియా ఇండియా, దర్బార్, నేషనల్ నెట్‌వర్క్ ఆఫ్ సెక్స్ వర్కర్స్, వి ఏ ఎం పి (VAMP),!అప్నేఆప్ ఉమెన్స్ కలెక్టివ్, మహిళా జాగృత్ సేవా భావి సంస్థలు , కర్ణాటక సెక్స్ వర్కర్స్ యూనియన్ మరియు ఉమెన్ ఇనిషియేటివ్స్ (నేను మరియు నా ప్రపంచం) ఈ రోజు చర్చలో పాల్గొన్న కొన్ని సంస్థలు.
చైర్‌పర్సన్ శ్రీమతి రేఖా శర్మ తన ప్రారంభోపన్యాసంలో, ప్రతి పౌరుడిలాగే, సెక్స్ వర్కర్లు కూడా అన్ని మానవ పౌర హక్కులు ఉంటాయని, వారు కూడా గౌరవప్రదమైన జీవితానికి అర్హులని, వారికి అవకాశాలు భరోసా, చేయూత ఇవ్వడం ముఖ్యమని అన్నారు. "ఈరోజు సంప్రదింపుల సమావేశం సెక్స్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడం, వారికి మెరుగైన సంస్థాగత మద్దతు, అలాగే వారి హక్కులను, వారిని ప్రధాన జన జీవన స్రవంతిలో కలపడం లో సహాయం అందించడం కోసం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది" అని శ్రీమతి శర్మ చెప్పారు. సెక్స్ వర్కర్లతో వ్యవహరించేటప్పుడు పోలీసు వారి ప్రవర్తనలో తీవ్ర హింస/అధికార దుర్వినియోగం గమనించవచ్చని, పోలీసు అధికారులను ఈ అంశంపై చైతన్యపరచవలసిన అవసరాన్ని పాల్గొన్నవారు నొక్కి చెప్పారు. సెక్స్ వర్కర్లు వారి పిల్లలకు సామాజిక భద్రతా పథకాలు ప్రయోజనాలు సులభంగా అందుబాటులో ఉండాలని, సెక్స్ వర్కర్ల శారీరక, మానసిక ఆరోగ్యం సామాజిక శ్రేయస్సు సెక్స్ వర్కర్ల సమ్మతి లేకుండా వారి వీడియో చిత్రాలను షేర్ చేయడంపై, ప్రదర్శించడంపై మీడియాను సున్నితంగా చైతన్యవంతం చేయడం గురించి కూడా పాల్గొన్నవారు చర్చించారు. నిపుణులు అభయ నివాసాలు (షెల్టర్ హోమ్) లను పర్యవేక్షించడం , ఆ ఆవాసలలో మరింత వేధింపులకు దారితీయవచ్చనే అంశం గురుంచి, బలవంతంగా పునరావాసం జరగకుండా చూసుకోవడం మరియు సెక్స్ వర్కర్లు మరియు వారి పిల్లలకు విద్యా మరియు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందించడం గురించి కూడా చర్చించారు.
***
(Release ID: 1848962)
Visitor Counter : 3914