ఆయుష్
azadi ka amrit mahotsav

ఫార్మకోపియా కమిషన్ ఫర్ ఇండియన్ మెడిసిన్

Posted On: 05 AUG 2022 5:40PM by PIB Hyderabad

ఫార్మాకోపియా కమిషన్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి (పిసిఐఎం అండ్ హెచ్) , రెండు కేంద్ర ప్రయోగశాలలైన ఘజియాబాద్ ఫార్మకోపియా లేబొరేటరీ ఫర్ ఇండియన్ మెడిసిన్ (పిఎల్ఐఎం), హోమియోపతిక్ ఫార్మకోపియా లేబొరేటరీ (హెచ్ పీ ఎల్) లను విలీనం చేయడం ద్వారా ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద ఒక సబార్డినేట్ కార్యాలయంగా ఫార్మకోపియా కమిషన్ ఫర్ ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి (పిసిఐఎం అండ్ హెచ్) ను భారత ప్రభుత్వం (గెజిట్ ప్రకటన 6, జూలై, 2020).

ఏర్పాటు చేసింది.

 

ఆయుర్వేద, యునాని, సిద్ధ , హోమియోపతి ఔషధాలకు ఫార్మకోపోయల్ ప్రమాణాల అభివృద్ధిలో కమిషన్ నిమగ్నమైంది.  ఇంకా, పిసిఐఎం అండ్ హెచ్ భారతీయ వైద్య, హోమియోపతి వ్యవస్థల కోసం సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ కమ్ అప్పిలేట్ లేబొరేటరీగా కూడా పనిచేస్తోంది.

 

తిరిగి ఏర్పాటైన తరువాత, 2020 జూలై 6 నుంచి ఇప్పటి వరకు 1483 ఎ ఎస్ యు

అండ్ హెచ్ ఔషధాల నమూనాలను పరీక్షించారు.  ఆయుష్ క్వాత్ సంబంధిత ఫార్ములేషన్ కోసం వాటి ఫార్ములరీ స్పెసిఫికేషన్లతో పాటు 03 ఫార్మకోపోయల్ మోనోగ్రాఫ్ లు ప్రచురించబడ్డాయి. ఫార్మాకోపోయల్ మోనోగ్రాఫ్ లతో పాటు నేషనల్ ఫార్ములరీ ఫర్ యునానీ మెడిసిన్స్, 166 ఫార్ములేషన్ ల ఫార్ములారీ స్పెసిఫికేషన్లతో కూడిన పార్ట్-4 (2వ ఎడిషన్) కూడా ప్రచురిత మయింది.

 

ఆయుర్వేద సింగిల్ ఔషధాల 50 మోనోగ్రాఫ్ లతో పాటు ఆయుర్వేద ఔషధాల ఫార్ములేషన్ 51 మోనోగ్రాఫ్ లు, ఒక సిద్ధ ఔషధం ఫార్ములేషన్ మోనోగ్రాఫ్ , 101 యునాని ఔషధాల ఫార్ములేషన్ మోనోగ్రాఫ్ లు గత ఐదు సంవత్సరాల్లో ప్రచురితం అయ్యాయి. 

 

కాగా, పిఎల్ ఐఎమ్ అండ్ హెచ్ పిఎల్ (ఇప్పుడు పిసిఐఎం అండ్ హెచ్ 6, జూలై 2020) ప్రారంభమైనప్పటి నుంచి, ఎఎస్ యు అండ్ హెచ్ ఔషధాల వ్యవస్థలలో ఉపయోగించే ముడి పదార్థాలపై (మొక్క/జంతువు/మినరల్/మెటల్/ రసాయన మూలం యొక్క ఒకే మందులు) మొత్తం 2199 నాణ్యతా ప్రమాణాలను వివిధ ఫార్మాకోపోయియాస్‌లో ప్రచురించారు. ఏ ఎస్ యు సూత్రీకరణల 405 నాణ్యతా ప్రమాణాలు కూడా సంబంధిత ఫార్మాకోపియాస్‌లో ప్రచురించబడ్డాయి.

 

 డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 , వాటి రూల్స్ 1945లో నిర్దేశించిన ప్రకారం, నాణ్యత నియంత్రణకు సంబంధించిన చట్టపరమైన నిబంధనల అమలు  , ఆయుర్వేద, సిద్ధ, యునాని డ్రగ్ లైసెన్స్ జారీ అధికారం సంబంధిత రాష్ట్ర , కేంద్రపాలిత ప్రాంతం డ్రగ్ కంట్రోలర్‌లు/స్టేట్ లైసెన్సింగ్ అథారిటీలకు అప్పగించబడింది. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ రూల్స్, 1945లోని రూల్ 158-బి ఆయుర్వేద, సిద్ధ, యునానీ ఔషధాల తయారీకి లైసెన్స్ జారీ చేయడానికి రెగ్యులేటరీ మార్గదర్శకాలను అందిస్తుంది. ఔషధాలు ,కాస్మోటిక్స్ రూల్స్, 1945 షెడ్యూల్ టి ప్రకారం భద్రత ,సమర్థత రుజువు, మంచి తయారీ విధానాలు (జి ఎం పి)కు కట్టుబడి ఉండటం ఇంకా సంబంధిత ఫార్మకోపియాలో ఇవ్వబడ్డ ఔషధాల నాణ్యతా ప్రమాణాలతో సహా తయారీ యూనిట్ లు ఔషధాల లైసెన్సింగ్ కోసం సిఫారసు చేయబడ్డ ఆవశ్యకతలకు తయారీదారులు కట్టుబడి ఉండటం తప్పనిసరి.

 

ఔషధాలు మరియు కాస్మోటిక్స్ రూల్స్, 1945 యొక్క షెడ్యూల్ టి ప్రకారంగా భద్రత మరియు సమర్థత రుజువు, మంచి తయారీ విధానాలు (GMP)కు కట్టుబడి ఉండటం మరియు సంబంధిత ఫార్మకోపియాలో ఇవ్వబడ్డ ఔషధాల యొక్క నాణ్యతా ప్రమాణాలతో సహా తయారీ యూనిట్ లు మరియు ఔషధాల యొక్క లైసెన్సింగ్ కొరకు సిఫారసు చేయబడ్డ ఆవశ్యకతలకు తయారీదారులు కట్టుబడి ఉండటం తప్పనిసరి.

 

డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ 1940 , దాని రూల్స్ 1945లో సూచించిన విధంగా, ఆయుర్వేదం, సిద్ధ, యునాని లా క్వాలిటీ కంట్రోల్ , డ్రగ్ లైసెన్స్ జారీకి సంబంధించిన చట్టపరమైన నిబంధనలను అమలు చేయడం అనేది సంబంధిత రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం ప్రభుత్వం ద్వారా నియమించబడ్డ స్టేట్ డ్రగ్ కంట్రోలర్ లు/స్టేట్ లైసెన్సింగ్ అథారిటీల వద్ద ఉంటుంది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అందిన సమాచారం ప్రకారం, నాసిరకం ఆయుర్వేద ఔషధాలు/ఫార్ములేషన్ ల ఉత్పత్తి/అమ్మకానికి సంబంధించి స్టేట్ డ్రగ్ కంట్రోలర్ లు/స్టేట్ లైసెన్సింగ్ అథారిటీల ద్వారా తీసుకోబడ్డ చర్యలు దిగువ పేర్కొన్న విధంగా ఉన్నాయి.

 

 

వరస నెం.

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంత పేరు

తీసుకున్న చర్యలు

1

తమిళనాడు

 

2017 నుంచి 2021 వరకు 92 లైసెన్సులు రద్దు

2

ఒడిషా

2017-18 నుంచి 2022-23 వరకు 13 లైసెన్స్ లు రద్దు

3

మహారాష్ట్ర

2016-17 నుంచి 2022 వరకు 84 ప్రాసిక్యూషన్ ఆర్డర్లు జారీ చేయగా, 38 ప్రాసిక్యూషన్లు దాఖలు చేయగా, 46 పెండింగ్ లో  ఉన్నాయి.

 

1. ఈ మంత్రిత్వ శాఖ 01.10.2021 నాడు ఎఎస్ యు ఔషధాల లైసెన్సింగ్ ప్రక్రియకు సంబంధించి 1945లో డ్రగ్స్ రూల్స్, 1945లో సవరణ కోసం గెజిట్ నోటిఫికేషన్ నెంబరు జి.ఎస్.ఆర్.716 ఇ జారీ చేసింది. కాంప్లయన్స్ భారాన్ని తగ్గించడానికి , వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ఈ సవరణలు చేశారు. ఆయుర్వేదం, సిద్ధ ,యునాని (ఎఎస్ యు) ఔషధాల తయారీకి లైసెన్స్ మంజూరు చేసే ప్రక్రియ ఆన్ లైన్ e-aushadhi.gov.in పోర్టల్ ద్వారా లైసెన్స్ అప్లికేషన్ సిస్టమ్ ను వేగంగా, కాగితరహితంగా మరింత పారదర్శకంగా మార్చారు. ఏ ఎస్ యు ఔషధాల లైసెన్స్ శాశ్వతంగా చేయబడింది, అంటే ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఫీజుతో ప్రొడక్ట్ లైసెన్స్ జీవితకాలం చెల్లుబాటు అవుతుంది, ఆ తరువాత ఎలాంటి నిలుపుదల లేదా రెన్యువల్ ఫీజులు ఉండవు. ఎఎస్ యు ఔషధాల తయారీకి లైసెన్స్ మంజూరు చేసే గరిష్ట సమయాన్ని మూడు నెలల నుంచి రెండు నెలలకు తగ్గించారు.

 

పైన పేర్కొన్నవాటికి అదనంగా, ఎగుమతులను సులభతరం చేయడం కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ దిగువ వివరాల ప్రకారం ఆయుష్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ లను ప్రోత్సహిస్తుంది:

 

• మూలికా ఉత్పత్తుల కోసం డబ్లూ హెచ్ ఓ మార్గదర్శకాలకు అనుగుణంగా ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్ ల సర్టిఫికేషన్ (సిఓ పి పి )

 

•  ఆయుర్వేద, సిద్ధ ,యునానీ ఉత్పత్తులకు ఆయుష్ ప్రీమియం మార్క్ మంజూరు చేయడానికి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యత పై తృతీయ పక్ష మదింపు ఆధారంగా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యు సి ఐ) ద్వారా అమలు చేసే క్వాలిటీ సర్టిఫికేషన్స్ స్కీం,.

 

(3.) ఆయుష్ మంత్రిత్వ శాఖ కేంద్రీయ రంగ పథకం ఆయుష్ ఔషధి గున్వత్తా ఏవం ఉత్పాదన్ సంవర్ధన్ యోజన (ఎఒజియుఎస్ వై) ను అమలు చేసింది. ఈ పథకం లక్ష్యాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

 

i. ఆత్మనిర్భర్ భారత్ చొరవతో భారతదేశ తయారీ సామర్థ్యాలను ,సాంప్రదాయ ఔషధాలు ,ఆరోగ్య ప్రోత్సాహక ఉత్పత్తుల ఎగుమతులను పెంపొందించడానికి.

 

ii. ఆయుష్ ఔషధాలు ,మెటీరియల్స్ ప్రామాణీకరణ, నాణ్యమైన తయారీ ,విశ్లేషణాత్మక టెస్టింగ్ కోసం ప్రభుత్వ ,ప్రయివేట్ సెక్టార్ లో తగినంత మౌలిక సదుపాయాలు ,సాంకేతిక అప్ గ్రేడేషన్, సంస్థాగత కార్యకలాపాలను సులభతరం చేయడానికి.

 

iii. సమర్థవంతమైన నాణ్యత నియంత్రణ, భద్రతా పర్యవేక్షణ తో పాటు ఆయుష్ ఔషధాల తప్పుదారి పట్టించే ప్రకటనలపై నిఘా కోసం కేంద్ర ,రాష్ట్ర స్థాయిలో నియంత్రణ ఫ్రేమ్ వర్క్ లను బలోపేతం చేయడం.

 

iv. ఆయుష్ ఔషధాలు ,మెటీరియల్స్ ప్రమాణాలు ,నాణ్యతను పెంపొందించడం కోసం సినర్జీలు, సహకారం ,కన్వర్జెంట్ అప్రోచ్ లను నిర్మించడాన్ని ప్రోత్సహించడం.

 

ఆయుష్ ఔషధి గున్వత్త ఏవం ఉత్పాదన్ సంవర్ధన్ యోజన (ఏ ఒ జి యు ఎస్ వై) పథకం లోని అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

 

. ఉన్నత ప్రమాణాలను సాధించడం కోసం ఆయుష్ ఫార్మసీలు , డ్రగ్ టెస్టింగ్ లేబొరేటరీలను బలోపేతం,  అప్ గ్రేడేషన్ చేయడం.

 

బి. తప్పుదారి పట్టించే ప్రకటనలపై నిఘాతో సహా ఎఎస్ యు అండ్ హెచ్ ఔషధాల ఫార్మకో విజిలెన్స్.

 

సి. ఆయుష్ ఔషధాల కోసం టెక్నికల్ హ్యూమన్ రిసోర్స్ , కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ లతో సహా కేంద్ర ,రాష్ట్ర రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ లను బలోపేతం చేయడం.

 

డి.బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బి ఐ ఎస్), క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా (క్యు సి ఐ) ,ఇతర సంబంధిత శాస్త్రీయ సంస్థలు,  పారిశ్రామిక ఆర్ అండ్ డి కేంద్రాల సహకారంతో ఆయుష్ ఉత్పత్తులు , మెటీరియల్స్ ప్రమాణాలు ఇంకా అక్రిడిటేషన్/సర్టిఫికేషన్ అభివృద్ధికి మద్దతు.

 

ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ రోజు లోక్ సభ లో ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు.

***(Release ID: 1848958) Visitor Counter : 66


Read this release in: English , Urdu , Tamil