వ్యవసాయ మంత్రిత్వ శాఖ
నీటి యాజమాన్యం కోసం ఇక్రిశాట్, ఇకార్‌ల మధ్య భాగస్వామ్యం
Posted On:
05 AUG 2022 4:00PM by PIB Hyderabad
ఇకార్ (ICAR) - ఇక్రిశాట్ (ICRISAT) సహకార పని ప్రణాళిక మూడు పరిశోధనా ప్రాజెక్టులను కలిగి ఉంది. ఈ ప్రాజెక్టులలో ఒకటి ప్రధానంగా కాయధాన్యాల గింజలు (కందులు, కందిపప్పు, వేరుశనగ)తో పాటుగా పొడి భూములలో పండే తృణధాన్యాలు ( జొవార్, బాజ్రా, రాగి)ల ఉత్పత్తి సామర్ధ్యాన్ని, అనుసరణ, నాణ్యతల లక్షణాలను పెంపొందించడం కోసం జన్యుపరంగా మెరుగుదల చేయడం. కరువు పీడిత పర్యావరణంలో బాజ్రా వైవిధ్యతను మెరుగుపరిచేందుకు చేపట్టి సహకార ప్రాజెక్టు సెప్టెంబర్ 2021లో పూర్తయింది. శాస్త్ర ఆధారిత వర్షపు నీటి సేకరణ, నిర్వహణ సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా పొడి భూముల ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు సాధ్యత కలిగిన సహకారం కోసం ఇక్రిశాట్ సంస్థ ఇకార్‌కు చెందిన పలు సంస్థలతో కలిసి పని చేస్తుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర వ్యవసాయ, రైతాంగ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
***
(Release ID: 1848950)
Visitor Counter : 126