ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఫ్రీ డయాగ్నోస్టిక్స్ సర్వీస్ ఇనిషియేటివ్' (ఎఫ్‌డిఎస్‌ఐ)పై అప్‌డేట్
అందరికీ అందుబాటులో మరియు సరసమైన రోగనిర్ధారణ మరియు రేడియోలాజికల్ డయాగ్నస్టిక్స్ సేవలను అందించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రజల ఖర్చును తగ్గిస్తుంది
ప్రయోగశాల సేవలను అమలు చేయడానికి మార్గదర్శక పత్రం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో పంచుకోవడం జరిగింది
Posted On:
05 AUG 2022 5:37PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ ఆరోగ్య మిషన్ కింద ‘ఫ్రీ డయాగ్నోస్టిక్స్ సర్వీస్ ఇనిషియేటివ్’ (ఎఫ్‌డిఎస్‌ఐ) కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం జూలై 2015లో ప్రారంభించబడింది. ఇది ప్రజలకు చేరువగా అందుబాటులో ఉండే విధంగా మరియు సరసమైన పాథలాజికల్ మరియు రేడియోలాజికల్ డయాగ్నస్టిక్స్ సేవలను అందించే లక్ష్యంతో ప్రారంభించబడింది. అవుట్ ఆఫ్ పాకేట్ ఎక్స్‌పెండిచర్ (ఓఓపీఈ) తగ్గుతుంది. ప్రజారోగ్య సదుపాయం సంబంధించి ప్రతి స్థాయిలో అవసరమైన రోగనిర్ధారణ జాబితా ప్రకారం కనీస అవసరమైన రోగనిర్ధారణ పరీక్షలు సిఫార్సు చేయబడ్డాయి.
ప్రయోగశాల సేవలను అమలు చేయడానికి మార్గదర్శక పత్రం అన్ని రాష్ట్రాలు మరియు యూటీలతో పంచుకోవడం జరిగింది. మార్గదర్శకాలు అన్ని స్థాయిల ప్రజారోగ్య సౌకర్యాలలో (ఉప కేంద్రాలలో (ఎస్‌సి) 14 పరీక్షలు), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (పిహెచ్‌సిలలో 63 పరీక్షలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లలో (సిహెచ్‌సిలలో) 97 పరీక్షలు), ఉప స్థాయిలో 111 పరీక్షలను జిల్లా ఆసుపత్రులు (ఎస్‌డీహెచ్‌లు) మరియు జిల్లా ఆసుపత్రులలో (డిహెచ్‌లు) 134 పరీక్షలు రోగనిర్ధారణ శ్రేణిని కూడా సిఫార్సు చేసింది.
ఎన్‌హెచ్‌ఎం కింద దేశంలోని రాష్ట్రాలు/యూటీలు అంతర్గత, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) మరియు హైబ్రిడ్ మోడ్ ద్వారా ‘ఉచిత డయాగ్నస్టిక్ సర్వీస్ ఇనిషియేటివ్’ అందించబడుతుంది. ఉచిత ప్రయోగశాల సేవ 33 రాష్ట్రాల్లో పనిచేస్తోంది. వీటిలో 11 రాష్ట్రాలు/యూటీలు (అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, ఒడిశా, త్రిపుర మరియు ఉత్తరాఖండ్) పిపిపి/హైబ్రిడ్ మోడ్ ద్వారా సేవలను అందిస్తున్నాయి. మరియు 22 రాష్ట్రాలు/యూటీలు (ఆంధ్రప్రదేశ్, ఏ&ఎన్ ఐలాండ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్,డి&ఎన్ హవేలీ-డామన్ & డయ్యూ, గోవా, గుజరాత్, హర్యానా, జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, పుదుచ్చేరి, పంజాబ్ , సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్) ఇన్ హౌస్ మోడ్ ద్వారా సేవలను అందిస్తాయి.
ఇంకా ఉచిత టెలి-రేడియాలజీ (ఎక్స్-రేల టెలి-రిపోర్టింగ్) సేవ 13 రాష్ట్రాలు/యూటీలలో (ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, మహారాష్ట్ర, మేఘాలయ, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్, త్రిపుర ) పనిచేస్తోంది. ) అలాగే 27 రాష్ట్రాలు/యూటీలకు గాను 17 రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, అస్సాం, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మేఘాలయ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, త్రిపుర,ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో ఉచిత సీటీ స్కాన్ సేవ అందుబాటులో ఉంది. దీనిని పిపిపి విధానంలో అందిస్తోంది మరియు 10 రాష్ట్రాలు (ఏ&ఎన్ ద్వీపం, బీహార్, డి&ఎన్ హవేలీ, డామన్ & డయ్యూ, గోవా, జమ్మూ & కాశ్మీర్, లక్షద్వీప్, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ) ఇన్‌హౌస్ మోడ్‌లో అందజేస్తున్నాయి.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు.
****
(Release ID: 1848949)
Visitor Counter : 128