సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఖాదీ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
Posted On:
04 AUG 2022 1:00PM by PIB Hyderabad
భారతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అత్యున్నత నాణ్యత కలిగి బేధం చూపగల ఖాదీ ఉత్పత్తులను ప్రభావవంతంగా రూపకల్పన, ఉత్పత్తి, మార్కెట్ చేయడానికి తోడ్పడేందుకు భారత ప్రభుత్వం ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) ద్వారా నేషనల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), న్యూఢిల్లీ సాంకేతిక మద్దతుతో నిఫ్ట్ ఢిల్లీ (హబ్ సెంటర్) దాని నాలుగు ఉపకేంద్రాలైన గాంధీనగర్, కోల్‌కతా, షిల్లాంగ్, బెంగుళూరులలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఖాదీ (సిఒఇకె)ని ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కింద, ఖాదీ సంస్థలు ప్రతికృతి చేయడానికి వీలుగా సిఒఇకె ఒక నాలెడ్జ్ పోర్టల్ ఫర్ ఖాదీని ఏర్పాటు చేసి నమూనాలు,లక్షణాలతో స్కెచ్‌లను వారు చూసేందుకు వీలుగా అప్‌లోడ్ చేస్తోంది.
ప్రాజెక్టు లక్ష్యాలు ః
ఫ్యాషన్ సరళులకు/ రుతువులవారీగా రంగుల సూచనలతో నూతన వస్త్రాలను/ ఉత్పత్తులను సృష్టించడం.
జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్నత స్థాయి వర్గాలకు ఖాదీ వస్త్రాల, దుస్తుల నాణ్యత ప్రమాణాల ప్రచారం
నూతన ఖాదీ వస్త్రాలు, ఉత్పత్తుల చుట్టూ ఆసక్తికరమైన ఇతివృత్తాలను సృష్టించి బ్రాండింగ్, పబ్లిసిటీ చేయడం.
నూతన ఖాదీ ఉత్పత్తులకు విజువల్ వాణిజ్యం, ప్యాకేజింగ్.
ఖాదీ ఫ్యాషన్ షోలు, ప్రదర్శనలలో ఏర్పాటు చేయడం లేదా పాలు పంచుకోవడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులోకి తేవడాన్ని పెంచడం.
దేశవ్యాప్తంగా పని చేస్తున్న ఖాదీ సంస్థలను బలోపేతం చేసేందుకు సిఒఎకె కింద తీసుకున్న చర్యల వివరాలు అనుబంధంలో చూడవచ్చు.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఖాదీని ఏర్పాటు చేసేందుకు మంత్రిత్వ శాఖ రూ. 20.00 కోట్లను కేటాయించగా, అందులో 15.00 కోట్లు విడుదలయ్యాయి.
***
(Release ID: 1848420)
Visitor Counter : 137