యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సిడ‌బ్ల్యుజి 2022 ఉమెన్స్ ఫోర్స్ క్రీడ‌ల‌లో చ‌రిత్రాత్మ‌క స్వ‌ర్ణ‌ప‌త‌కం గెలుచుకున్న భార‌త‌దేశానికి చెందిన లాన్ బౌల్స్ బృందం రూపారాణి టిర్కి, ల‌వ్లీ చౌబే, పింకీ, నాయ‌న్‌మోని సెయికాల బృందం ద‌క్షిణాఫ్రికాను ఫైన‌ల్స్ లో 17-10 తేడా ఓడించారు.

Posted On: 02 AUG 2022 8:24PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు:
ఈ క్రీడ‌ల‌లో అద్భుత ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన క్రీడా బృంద స‌భ్యుల‌కు రాష్ట్ర‌ప‌తి శ్రీమ‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ  అభినంద‌న‌లు తెలిపారు.
ఈ బృందాన్ని అభినందిస్తూ కేంద్ర క్రీడామంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్‌, కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో భార‌త్‌కు ఇది చ‌రిత్రాత్మ‌క స్వ‌ర్ణ‌ప‌త‌క‌మ‌ని అభివ‌ర్ణించారు.
భార‌త‌దేశానికిచెందిన లాన్ బౌల్స్ ఉమెన్స్ ఫోర్స్ బృందం 2022 కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో స్వ‌ర్ణ‌ప‌త‌కాన్నిగెలిచి చ‌రిత్ర సృష్టించారు.  లాన్ బౌల్స్ ఈవెంట్‌లో దేశం సాధించిన తొలి  మెడ‌ల్ ఇది. ఈ బృందంలో స్కిప్ప‌ర్ రూపారాని టిర్కి, ల‌వ్లీ చౌబే, పింకి, నాయ‌న్‌బొని సైకాలు   ఉమెన్స్ ఫోర్స్ ఈవెంట్ ఫైన‌ల్స్ లోద‌క్షిణాఫ్రికాను 17-10  తేడాతో ఓడించారు.

దీనితో ఇండియా సాధించిన ప‌త‌కాల సంఖ్య 10 కి  చ‌రింది. ఇందులో 4 స్వ‌ర్ణ‌ప‌త‌కాలు, 3 ర‌జ‌త ప‌త‌కాలు, 3 కాంస్య‌ప‌త‌కాలు ఉన్నాయి. రాష్ట్ర‌ప‌తి శ్రీ‌మ‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, కేంద్ర‌క్రీడ‌ల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్‌, దేశం న‌లుమూల‌ల నుంచి భార‌తీయులు బృందం సాధించిన విజ‌యానికి అభినంద‌న‌లు తెలిపారు.

కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో భార‌త‌జ‌ట్టు స్వ‌ర్ణ‌ప‌త‌కం గెలుపొందినందుకు లాన్ బౌల్స్ బృంద స‌భ్యుల‌కు   రాష్ట్ర‌ప‌తిశ్రీ‌మ‌తి ద్రౌప‌ది ముర్ము అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి ట్విట్ట‌ర్ ద్వారా ఒక సందేశ‌మిస్తూ, ల‌వ్లీ చౌబే, రూపారాణి టిర్కి, పింకీ, నాయ‌న్‌మొని సైకా బృందానికి అభినంద‌న‌లు. లాన్ బౌల్స్ కామ‌న్ వెల్త క్రీడ‌ల‌లో మీరు అద్భుత విజయం సాధ‌ఙంచారు. ఫైన‌ల్స్‌లో ఉత్కంఠ‌త‌తో సాగిన పోరులో విజ‌యం సాధించేందుకు మీ సంక‌ల్పం, దేశాన్ని గ‌ర్వ‌ప‌డేట్టు చేయ‌డ‌మే కాక‌, ప్ర‌తి భార‌తీయుడికి ప్రేర‌ణ‌గా నిలిచింది అని రాష్ట్ర‌ప‌తి త‌మ సందేశంలో పేర్కొన్నారు.

 ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ల‌వ్లీ చౌబే, పింకీ సింగ్‌, న‌య‌న్‌మొని సైకియా, రూపారాణి టిర్కిల‌కు వారు సాధించిన విజయానికి అభినంద‌న‌లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయ‌న ఒక ట్వీట్ చేస్తూ, బ‌ర్మింగ్‌హామ్‌లో చ‌రిత్రాత్మ‌క విజయం సాధించారు. ల‌వ్లీచౌబే, పింకీసింగ్‌, నయ‌న్‌మొని సైకియా, రూపారాణి టిర్కిలు లాన్ బౌల్స్ లో స్వ‌ర్ణ‌ప‌త‌కం సాధించి దేశానికి గ‌ర్వ‌కార‌ణంగా నిలిచారు, అని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు. ఈ బృందం అద్భుతమైన‌ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చి సాధించిన విజ‌య ఎంతోమందిని లాన్‌బౌల్స్ వైపుకు ప్రేర‌ణ‌నిస్తుంద‌ని పేర్కొన్నారు.

క్రీడ‌ల శాఖ‌మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ కూడా లాన్ బౌల్స్ బృందం  మ‌న దేశానికి స్వ‌ర్ణ‌ప‌త‌కం సాధించిపెట్టినందుకు అభినంద‌న‌లు తెలిపారు. ఈ విష‌య‌మై ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా ఒక సందేశ‌మిస్తూ, కామ‌న్ వెల్త్ క్రీడ‌ల‌లో లాన్స్ బౌల్స్‌లో భార‌త్ చ‌రిత్రాత్మ‌క స్వ‌ర్ణ‌ప‌త‌కం  సాధించింది. మ‌న ఉమెన్స్ ఫోర్స్ టీమ్స్ - ల‌వ్లీ చౌబే, పింకీ, నయ‌న్‌మొని సైకా, రూపారాణి టిర్కి బృందం లాన్స్ బౌల్ లో  ద‌క్షిణాఫ్రికాను 17-10 తేడాతో  సాధించిన విజ‌యం దేశాన్ని గ‌ర్వ‌ప‌డేట్టుచేసింది.

***




(Release ID: 1848133) Visitor Counter : 107


Read this release in: English , Urdu , Hindi