ఆర్థిక మంత్రిత్వ శాఖ
సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ హర్యానాలోని కర్నాల్‌లో అక్రమ డ్రగ్స్ తయారీ కిచెన్ ల్యాబ్‌ను కార్యకలాపాల్ని చేధించింది.
Posted On:
03 AUG 2022 3:03PM by PIB Hyderabad
నిర్ధిష్ట సమాచారం మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ న్యూఢిల్లీ విబాగం అధికారులు 05/07/2022న హర్యానా రాష్ట్రంలోని
కర్నాల్‌లో దాడి చేసి డిఫెనాక్సిలేట్‌తో కూడిన మాదకద్రవ్యాలను తయారు చేస్తున్న రహస్య కిచెన్ ల్యాబ్‌ను కార్యకలాపాలను
చేధించారు. ప్రివెంటివ్ అండ్ ఇంటెలిజెన్స్ సెల్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, న్యూ ఢిల్లీ వారు హర్యానాలోని కర్నాల్ సెక్టార్ - 6, ఇంటి నెంబరు. 323లో మాదకద్రవ్యా తయారు చేస్తున్న రహస్య కిచెన్ ల్యాబ్‌ను కార్యకలాపాలను అధికారులు చేధించారు.
దీనికి సంబంధించి మనోజ్ కుమార్ సన్ ఆఫ్ గుల్షన్ కుమార్‌ను అరెస్టు చేశారు. ఈ సోదాలలో మొత్తంగా 45.855 కిలోల మేర డైఫెనాక్సిలేట్ మిక్స్ మందును 7.240 కిలోల డైఫెనాక్సిలేట్ మాత్ర, 19,000 నిమెసులైడ్ మాత్రల్ని స్వాధీనం చేసుకున్నారు. నిమెసులైడ్ మాత్రలు నార్కోటిక్స్ పౌడర్‌లో పదార్ధంగా ఉపయోగించబడ్డాయి. డైఫెనాక్సిలేట్ అనేది నార్కోటిక్ డ్రగ్స్ ఎన్‌డీపీఎస్ చట్టంలో పేర్కొన్నప్రకారం 50 గ్రా. పరిణామంలో వాణిజ్యపరంగా విక్రయించేందుకు అనుమతించబడింది. ఈ కేసుకు సంబంధించి
తదుపరి చర్యలలో భాగంగా మెస్సర్స్ మోడరన్ మెడికల్ స్టోర్‌కు చెందిన మిస్టర్ మహేష్ కుమార్, సన్ ఆప్ మోహన్ లాల్, నిస్సింగ్‌లను అరెస్ట్ చేశారు. ఈ అక్రమ డ్రగ్స్ తయారీ వెనుక కీలక వ్యక్తిగా భావిస్తున్న కర్నాల్ అనే వ్యక్తిని కూడా అధికారులు 07/07/2022న అరెస్టు చేశారు. ఎన్‌డీపీఎస్ చట్టం 1985లోని సెక్షన్ 21, 25, 27ఎ, 28, 29, 30 మరియు 35తో పాటుగా సెక్షన్ 8 కింద కేసు నమోదు చేయబడింది. మత్తు కోసం ఈ నిందితులు డైఫెనాక్సిలేట్‌తో కూడిన నార్కోటిక్స్ పౌడర్‌ను వివిధ రాష్ట్రాలకు విక్రయిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోంది. నార్కోటిక్స్ కమిషనర్ శ్రీ రాజేష్ ఫత్తేసింగ్ ధాబ్రే మాట్లాడుతూ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్ త్వరలో డ్రగ్ యొక్క ప్రధాన సరఫరాదారుని గుర్తించి చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
****
(Release ID: 1848127)
Visitor Counter : 148