అంతరిక్ష విభాగం

భూప్రాదేశిక స‌మాచారం, చోద‌నం, రోబోటిక్స్‌/ ఏఆర్ / విఆర్ రంగాల‌లో ఆరు స్టార‌ప్‌ల‌ను ఎంపిక చేసి గ‌రిష్టంగా రూ. 50 ల‌క్ష‌ల స‌హాయాన్ని ఇస్రో అంద‌చేస్తోంద‌ని వెల్ల‌డించిన కేంద్ర మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్‌

Posted On: 03 AUG 2022 1:10PM by PIB Hyderabad

భూ ప్రాదేశిక స‌మాచారం, చోద‌నం, రోబోటిక్స్‌/ ఎఆర్‌/  విఆర్ రంగాల‌లో ఆరు స్టార్ట‌ప్‌ల‌ను ఎంపిక చేసి, గ‌రిష్టంగా రూ. 50 ల‌క్ష‌ల ఆర్ధిక స‌హాయాన్ని అందించి ఇస్రో మ‌ద్ద‌తు క‌ల్పిస్తోంద‌ని కేంద్ర శాస్త్ర& సాంకేతిక ( స్వ‌తంత్ర ఛార్జి) స‌హాయ‌మంత్రి, ఎర్త్ సైన్సెస్ స‌హాయ‌మంత్రి  ( స్వ‌తంత్ర ఛార్జి) , పిఎంఒ, సిబ్బంది, ప్ర‌జా ఫిర్యాదులు, ఫించ‌న్లు, అణుశ‌క్తి, అంత‌రిక్ష శాఖల స‌హాయ‌మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ బుధ‌వారం వెల్ల‌డించారు. 
లోక్‌స‌భ‌లో అడిగిన ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ, అట‌ల్ ఇన్నొవేష‌న్ మిష‌న్ (ఎఐఎం), నీతి ఆయోగ్‌తో క‌లిసి ఇస్రో  జాతీయ ప్రాముఖ్య‌త‌ను క‌లిగిన రంగాలు ఎదుర్కొనే స‌వాళ్ళ‌ను ప‌రిష్క‌రించేందుకు సాంకేతిక ఆధారిత ఆవిష్క‌ర‌ణ‌ల అన్వేష‌ణ‌, ఎంపిక‌, మ‌ద్ద‌తు ఇవ్వ‌డం, పెంపొందించ‌డం ల‌క్ష్యంగా ఎఎన్ఐసి- ఎఆర్ఐఎస్ఇ- 1,0 కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింద‌ని డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఇర‌వై నాలుగు స్టార్ట‌ప్‌లు త‌మ ప్ర‌తిపాద‌న‌ల‌ను స‌మ‌ర్పించాయ‌ని, అందులో నుంచి ఆరు స్టార్ట‌ప్‌ల‌ను ఎంపిక చేసి, ఒక్కొక్క‌రికి రూ. 50 ల‌క్ష‌ల చొప్పున ఆర్ధిక స‌హాయం అందించ‌డం ద్వారా మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌ని మంత్రి చెప్పారు.
(i) భూ ప్రాదేశిక స‌మాచారం, (ii) చోద‌నం, (iii) రోబోటిక్స్‌/ ఆగ్మెంటెడ్ రియాలిటీ/  వ‌ర్చువ‌ల్ రియాలిటీ రంగాల‌కు సంబంధించిన మూడు రంగాల స‌వాళ్ళ‌ను ప‌రిష్క‌రించేందుకు స్టార్ట‌ప్‌ల నుంచి ఎఎన్ఐసి- ఎఆర్ఐఎస్ఇ- 1,0 ప్రాజెక్టు ప్ర‌తిపాద‌న‌ల‌ను అందుకుంది. 
ఎఎన్ఐసి- ఎఆర్ఐఎస్ఇ- 2,0 నాలుగు అంత‌రిక్ష రంగ స‌వాళ్ళ‌తో 1. జిఐఎస్ ప‌రిష్కారాలు 2. చోద‌నం 3. నావిగేష‌న్ 4. అంత‌రిక్ష అప్లికేష‌న్ల కోసం  ఎఐ/ ఎంఎల్ న‌మూనాల‌తో ప్రారంభ‌మై, ఈ రంగాల‌లో స్టార్ట‌ప్‌ల నుంచి ప్రాజెక్టు ప్ర‌తిపాద‌న‌ల‌ను కోరుతోంది. ఎంపిక చేసిన స్టార్ట‌ప్‌ల‌కు గ‌రిష్టంగా రూ. 50 ల‌క్ష‌ల ఆర్ధిక స‌హాయం అందిస్తారు. 

***



(Release ID: 1848121) Visitor Counter : 137