భారత పోటీ ప్రోత్సాహక సంఘం
రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ (RSBVL) కు సన్మిన ఎస్ సి ఐ (Sanmina-SCI) ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SCIPL) కంపెనీలో 50.1% వాటాలను కొనుగోలు చేసుకోవడానికి సి సి ఐ (CCI) ఆమోదం తెలిపింది.
నాడు పోస్టు చేయడమైనది:
02 AUG 2022 5:12PM by PIB Hyderabad
రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ (RSBVL) కు సన్మిన ఎస్ సి ఐ (Sanmina-SCI) ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SCIPL) కంపెనీలో 50.1% వాటాల కొనుగోలుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆమోదించింది.
ఈ ప్రతిపాదిత కలయిక ఎస్ సి ఇ పి ఎల్ ( SCIPL) తో మూలధనం పెట్టుబడి లో 50.1%
వాటాలను ఆర్‌ఎస్‌బివిఎల్ కొనుగోలు చేసుకోవాలని భావిస్తుంది
ఆర్ ఎస్ బి వి ఎల్ (RSBVL) రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. ఆర్ ఎస్ బి వి ఎల్ (RSBVL) వస్తువుల వాణిజ్య వ్యాపారం, వ్యాపారాలలో వ్యూహాత్మక పెట్టుబడి ప్రయోజనాలు, వ్యాపార సహకార సేవలు ప్రధాన కార్యకలాపాలు గా నిర్వహిస్తుంది.
ఎస్ సి ఐ పి ఎల్ (SCIPL) సన్మిన (Sanmina) కార్పొరేషన్ కి చెందిన పరోక్ష అనుబంధ సంస్థ, కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఫార్చ్యూన్ 500 అమెరికన్ కంపెనీ. సన్మిన (Sanmina) సమగ్ర ఉత్పత్తి సేవలు, విడిభాగాలు, ఉత్పత్తులు మరియు మరమ్మత్తు, రవాణా మరియు సేవలను అందించే అంతర్జాతీయ సంస్థ. కంపెనీ ప్రాథమికంగా కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్‌లు, కంప్యూటింగ్ మరియు స్టోరేజ్, మెడికల్, డిఫెన్స్ మరియు ఏరోస్పేస్, ఇండస్ట్రియల్ మరియు సెమీకండక్టర్, మల్టీ-మీడియా, ఆటోమోటివ్ మరియు క్లీన్ టెక్నాలజీ రంగాల్లోని మౌలిక యంత్రపరికరాల ఉత్పత్తి దారులకు తన సేవలను అందిస్తుంది.
సవివరమైన సి సి ఐ ఆర్డర్ తర్వాత వస్తుంది
***
(రిలీజ్ ఐడి: 1847676)
సందర్శకుల సూచీ సంఖ్య : : 124