భారత పోటీ ప్రోత్సాహక సంఘం
బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్, క్రిస్ క్యాపిటల్ మరియు జి ఐ సి ( GIC ) లకు ఐ డి ఎఫ్ సి (IDFC) అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ మరియు ఐ డి ఎఫ్ సి ఎ ఎం సి (IDFC AMC) ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ కంపెనీలలో వాటా కొనుగోలుకు సి సి ఐ (CCI ) ఆమోదించింది.
Posted On:
02 AUG 2022 5:12PM by PIB Hyderabad
బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్, క్రిస్ క్యాపిటల్ మరియు జి ఐ సి (GIC) లకు ఐ డి ఎఫ్ సి (IDFC) అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ మరియు ఐ డి ఎఫ్ సి ఎ ఎం సి (IDFC AMC) ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ కంపెనీలలో వాటా కొనుగోలుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆమోదించింది.
ఈ వుమ్మడి ప్రతిపాదికత తో ఐ డి ఎఫ్ సి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (IDFC AMC) లో 99.96% వాటాను ఐ డి ఎఫ్ సి ఎ ఎం సి (IDFC AMC) ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (IDFC ట్రస్టీ)లో 100% వాటాను కొనుగోలు చేయాలని బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (BFHL), లతే ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ( Lathe Investment Pte Ltd, టాన్జేరిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ (Tangerine Investments Limited) (CC ఎంటిటీ 1) మరియు ఇన్ఫినిటీ పార్టనర్స్ (CC ఎంటిటీ 2) లు భావిస్తున్నాయి.
బి ఎఫ్ హెచ్ ఎల్ కంపెనీ బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ యాజమాన్యానికి చెందిన అనుబంధ సంస్థ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఇతర ఆర్థిక రంగ నియంత్రక సంస్థల నియంత్రణ లో పనిచేసే బి ఎఫ్ హెచ్ ఎల్ (BFHL) ను బంధన్ బ్యాంక్ లిమిటెడ్ కు యజమాని గా వ్యవహరించడానికి మరియు గ్రూప్‌లోని బంధన్ బ్యాంక్‌తో పాటు అన్ని ఇతర ఆర్థిక సేవలనందించే సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి యాజమాన్య నిర్వహణ కు స్థాపించారు.
లతే జి ఐ సి ( GIC) (వెంచర్స్) ప్రైవేట్ లిమిటెడ్ పూర్తి యాజమాన్యంలో ఉన్న కంపెనీ. లతే కంపెనీ జి ఐ సి (GIC) స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన పెట్టుబడుల కంపెనీల గ్రూప్ లో భాగం.
సి సి ఎంటిటీ 1 క్రిస్ కేపిటల్ (ChrysCapital IX, LLC (CC IX) యొక్క అనుబంధ సంస్థ. సి సి నైన్ (CC IX ChrysCapital) క్రిస్ కేపిటల్ గ్రూప్ స్థాపించిన ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫండ్. సి సి ఎంటిటీ 2 భాగస్వామ్య సంస్థ.
ఐ డి ఎఫ్ సి ఎ ఎం సి (IDFC AMC) ఐ డి ఎఫ్ సి ( IDFC )మ్యూచువల్ ఫండ్ (IDMF)కి చెందిన ఆస్తుల నిర్వహణ సంస్థ. ఐ డి ఎఫ్ సి ఎ ఎం సి (IDFC AMC) కేటగిరీ III ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తుంది మరియు ఐ డి ఎఫ్ సి ( IDFC ) ఇండియా ఈక్విటీ హెడ్జ్ ఫండ్‌కి పెట్టుబడి యాజమాన్య నిర్వహణ సేవలందిస్తోంది, ఐ డి ఎఫ్ సి (IDFC) ట్రస్టీ ని ఐ డి ఎం ఎఫ్ (IDMF) యొక్క ట్రస్టీ కంపెనీగా నియమించారు.
సి సి ఐ సవివరమైన ఆర్డర్ తర్వాత వస్తుంది
****
(Release ID: 1847673)
Visitor Counter : 123