ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఒకేరోజు రికార్డు స్థాయిలో 72.42 లక్షల (7.24 మిలియన్) ఐటీఆర్‌లు దాఖలు


2022 జూలై 31 వరకు దాదాపు 5.83 కోట్ల ఐటీఆర్‌లు సమర్పణ

Posted On: 01 AUG 2022 7:52PM by PIB Hyderabad

నిర్ణీత గడువు లోగా ఆదాయం పన్ను రిటర్నులు (ఐటీఆర్‌లు) సమర్పించి ప్రభుత్వానికి సహకరించిన పన్ను చెల్లింపుదారులు,పన్ను నిపుణులకు ఆదాయం పన్ను శాఖ  కృతజ్ఞతలు తెలిపింది. గడువులోగా ఐటీఆర్‌లు సమర్పించడంతో ఒకేరోజు రికార్డు స్థాయిలో ఐటీఆర్‌లు అందాయని ఆదాయం పన్ను శాఖ వెల్లడించింది. 

2022 జూలై 31  (జీతం పొందే పన్ను చెల్లింపుదారులు మరియు ఇతర నాన్-టాక్స్ ఆడిట్ కేసుల గడువు తేదీ) అత్యధిక సంఖ్యలో ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయి. 2022 జూలై 31వ తేదీ ఒక్క రోజే దాదాపు 72.42 లక్షల (7.24 మిలియన్) ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2022 జూలై 31  వరకు దాదాపు 5.83 కోట్ల ఐటీఆర్‌లు అందాయి. ఆదాయం పన్ను శాఖ ఈ-పోర్టల్ కూడా 2022 జూలై 31న నూతన రికార్డులు సృష్టించింది. పోర్టల్ ద్వారా సాగిన  ఐటీఆర్‌  ఫైలింగ్ సెకనుకు అత్యధిక రేటు 570 (సాయంత్రం 4:29:30 గంటలకు)గా నమోదయ్యింది.  ఐటీఆర్‌   ఫైలింగ్‌లో నిమిషానికి అత్యధిక రేటు 9573 (సాయంత్రం 7:44 గంటలకుసాధించింది.ఒక  గంటకు అత్యధిక రేటు సాయంకాలం 5-- 6  మధ్య అత్యధికంగా ఐటీఆర్‌  ఫైలింగ్ జరిగింది. గంట వ్యవధిలో 5,17,030 ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయి. 

  22-23 ఆర్థిక సంవత్సరానికి  సంబంధించిన  7 జూలై 2022 నాటికి 1 కోటి ఐటీఆర్‌లు మాత్రమే దాఖలు చేయడంతో ఇ-ఫైలింగ్ ప్రారంభ వేగం చాలా నెమ్మదిగా సాగింది . 22 జూలై, 2022 నాటికి దాదాపు 2.48 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు చేయడంతో స్వల్పంగా వేగం  పుంజుకుంది.  గడువు తేదీని పొడిగించడం లేదని ప్రభుత్వం ప్రకటించడంతో ఐటీఆర్‌ల దాఖలులో పెరుగుదల కనిపించింది. 2022  జూలై 25 నాటికి 3 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయి. రిటర్నులు దాఖలు చేసేందుకు ఆఖరి రోజు అయిన   జూలై 31,2022  72.42 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయిఇది మునుపటి అన్ని రికార్డులను (2019లో గరిష్టంగా 49 లక్షల ఐటీఆర్‌లు) బద్దలు కొట్టింది. ఒక్క 2022 జూలై నెలలోనే 5.13 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి.

 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి  5.83 కోట్ల  ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయి.వీటిలో 50%   ఐటీఆర్‌  -1 (2.93 కోట్లు), 11.5%  ఐటీఆర్‌  -2 (67 లక్షలు), 10.9% ఐటీఆర్‌  -3 (63.35 లక్షలు), 26%  ఐటీఆర్-4 (1.54 కోట్లు)ఐటీఆర్-నుంచి 7 (5.5 లక్షలు) ఉన్నాయి.  జూలై 7, 2022 నుంచి 31 జూలై 2022 వరకు పని గంటల్లో (ఉదయం తొమ్మిది  నుంచి సాయంకాలం ఆరు వరకు )  దాదాపు 3.31 కోట్ల  ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయి. ఇది మొత్తం  ఐటీఆర్‌లలో 58.77%జి ఉంది. దాఖలైన ఐటీఆర్‌ లలో   47%  పైగా ఐటీఆర్‌లు పోర్టల్‌లోని ఆన్‌లైన్  ఐటీఆర్‌లు   ఫారమ్‌ను ఉపయోగించి దాఖలు చేయబడ్డాయి . ఆఫ్‌లైన్ సాఫ్ట్‌వేర్ సౌకర్యం నుంచి పొందిన మిగిలిన ఐటీఆర్‌లు అప్‌లోడ్ చేయబడ్డాయి.

పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు తమ వార్షిక సమాచార ప్రకటన (ఏఐఎస్ ) మరియు పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశాన్ని (టీఐఎస్) లతో  వారి ఆదాయ వివరాలు  సరిపోల్చడం ద్వారా తమ శ్రద్ధను ప్రదర్శించారు.  5.03 కోట్ల కంటే ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులు తమ ఏఐఎస్ ని వీక్షించడం/డౌన్‌లోడ్ చేయడం ద్వారా ఏఐఎస్ / టీఐఎస్  సమాచార  వినియోగం  అధిక రేటు ను సాధించింది. 

 ఈ సంవత్సరం  ఐటీఆర్  -1 వివరాల్లో  ఎక్కువ భాగం జీతంవడ్డీ మరియు డివిడెండ్ ఆదాయంతో ముందే పూరించబడిందిఇది పన్ను చెల్లింపుదారులకు మరింత సౌకర్యం అందించింది.   ఇతర ఐటీఆర్  2, 3, 4 లలో  ఈ సమాచారం మాత్రమే  కాకుండా అద్దె ఆదాయానికి సంబంధించిన ఆస్తి వివరాలు,ముందుకు తెచ్చిన నష్టాలు ఎమ్ఏటీ రుణ సమాచార వివరాలు కూడా ముందే పూరించి అందుబాటులో ఉంచడంతో   పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ లను సులువుగా సమర్పించేందుకు అవకాశం కలిగింది. 

ఐటీఆర్ లను పరిశీలించడానికి   మరియు  రీఫండ్‌లను జారీ చేయడానికి ఆధార్ ఓటీపీ  మరియు ఇతర పద్ధతుల ద్వారా ఆదాయం పన్ను శాఖ  ఇ-ధ్రువీకరణ ప్రక్రియను ముఖ్యమైన చర్యగా చేపడుతుంది.   3.96 కోట్ల రిటర్న్‌లు ఇ-వెరిఫై చేయబడ్డాయిఅందులో 3.71 కోట్లకు పైగా రిటర్న్‌లు ఆధార్ ఆధారిత  ఓటీపీ   (94%) ద్వారా అందినవి కావడం ప్రోత్సాహకరంగా ఉంది.  ఈ-వెరిఫై చేయబడిన ఐటీఆర్   లలో,  2022-23 ఆర్థిక సంవత్సరానికి  సంబంధించి 3.01 కోట్ల  ఐటీఆర్  లు (75%)ప్రాసెస్ చేయబడ్డాయి.  అనేక సందర్భాల్లో పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌లను దాఖలు చేసిధృవీకరించిన తర్వాత కొన్ని నిమిషాలు లేదా గంటల్లోనే ప్రాసెసింగ్‌కు సంబంధించిన సమాచారాన్నిపొందారు. 

ఇంకాకోటక్ మహీంద్రా బ్యాంక్ మరియు ఫెడరల్ బ్యాంక్  బ్యాంకులతో ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో పన్ను చెల్లింపు (టిన్ 2.0) కోసం కొత్త సౌకర్యం ప్రారంభించబడింది.  ఈ బ్యాంకుల ద్వారా జూలై 31, 2022 వరకు మొత్తం   518.5 కోట్ల రూపాయల వరకు 73,910కి పైగా చలాన్‌లు అందాయి.  


 ఇ-ఫైలింగ్ హెల్ప్‌డెస్క్ బృందం ఈ సంవత్సరం 31 జూలై 2022 వరకు 1.45 లక్షల సందేహాలను నివృత్తి చేసింది. జూలై, 2022 చివరి వారంలో హెల్ప్‌డెస్క్ కు  మొత్తం  1,05,800 ఫోన్లు వచ్చాయి. అత్యధికంగా  18,341 కాల్స్  26వ తేదీ 22, 2022న అందాయి.  హెల్ప్‌డెస్క్ బృందం కూడా డిపార్ట్‌మెంట్  ట్విట్టర్ హ్యాండిల్‌లో స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికిపన్ను చెల్లింపుదారులు/సంబంధిత వర్గాలను తక్షణం   సంప్రదించడం ద్వారా సమస్యలను సకాలంలో పరిష్కరించడం ద్వారా   సహకారం అందించింది.


సకాలంలో రిటర్నులు దాఖలు చేసిన వారందరికీ ఆదాయం పన్ను శాఖ మరోసారి  కృతజ్ఞతలు తెలిపింది.  పన్ను చెల్లింపు దారులందరూ తమ  ఐటీఆర్ లను వీలైనంత త్వరగా ఈ-వెరిఫై చేసుకోవాలని కోరింది. వివిధ కారణాల వల్ల గడువులోగా ఐటీఆర్ సమర్పించని  పన్ను చెల్లింపుదారులు వెంటనే తమ ఫైలింగ్‌ను పూర్తి చేయాలనిఆదాయం పన్ను శాఖ  కోరింది.

 

***(Release ID: 1847203) Visitor Counter : 274


Read this release in: English , Urdu , Hindi , Marathi