గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

పి ఎం ఎ వై పథకం లో భాగంగా సి ఎల్ ఎస్ ఎస్ విభాగం ద్వారా, ఇప్పటివరకు, 20.76 లక్షల మంది సొంత గృహ నిర్మాణ లబ్ధిదారులకు ₹48,095 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ అందించబడింది.

Posted On: 01 AUG 2022 4:34PM by PIB Hyderabad

గృహనిర్మాణం మరియు పట్టణాబివృద్ది శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన యొక్క క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (సి ఎల్ ఎస్ ఎస్) కింద ప్రభుత్వం గృహ రుణాలపై వడ్డీ రాయితీని అందిస్తుందని తెలిపారు.  వడ్డీ రాయితీని రుణ వితరణ సంస్థల ద్వారా నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాకు ముందస్తుగా జమ చేయబడుతుంది, దీని ఫలితంగా స్థూల గృహ రుణం మరియు నెలసరి వాయిదా (EMI) తగ్గుతుంది.

 

సి ఎల్ ఎస్ ఎస్ పధకం మౌలిక అంశాలు వివరాలు  క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:

 

 

స.నెం.

 

అంశాలు 

 

 

ఈ డబ్లు ఎస్ 

ఎల్ ఐ జి 

ఎం ఐ జి - I

ఎం ఐ జి - II

1.

పథకం కాల వ్యవధి

17.06.2015 నుండి 31.03.2022 వరకు

01.01.2017 నుండి 31.03.2021 వరకు

 

2.

వార్షిక గృహ ఆదాయం (₹)

3,00,000/- వరకు

3,00,001/- నుండి 6,00,000/-

6,00,001/- నుండి 12,00,000/-

12,00,001/- నుండి 18,00,000/-

3.

చ.మీలో నివాస స్థల విస్తీర్ణం యూనిట్ కార్పెట్ ఏరియా ( వరకు)

 

 

30#

60#

160

200

4.

వార్షిక వడ్డీ రాయితీ (% p.a.)

6.5%

4.0%

3.0%

5.

గరిష్ట రుణ కాలవ్యవధి

20 సంవత్సరాలు 

6.

వడ్డీ రాయితీ కోసం అర్హమైన గృహ రుణం మొత్తం (₹)*

6,00,000/-

9,00,000/-

12,00,000/-

 

ఈ డబ్లు ఎస్ /ఎల్ ఐ జి  గృహాల విషయంలో, లబ్ధిదారుడు, అతని/ఆమె ఇష్టానుసారం గరిష్ట విస్తీర్ణంలో కూడా ఇంటిని నిర్మించుకోవచ్చు, కానీ వడ్డీ రాయితీ మొదటి ₹6 లక్షలకు మాత్రమే పరిమితం చేయబడుతుంది.

 

* ఈ పరిమితికి మించిన రుణాలపై వడ్డీ రేటు  నాన్-సబ్సిడీ రేటు మాదిరిగానే ఉంటాయి.

 

పి ఎం ఎ  వై - యు మిషన్ యొక్క క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (సి ఎల్ ఎస్ ఎస్)  పధకం అమలు కోసం, మంత్రిత్వ శాఖ మూడు సెంట్రల్ నోడల్ ఏజెన్సీలను (CNAలు) గుర్తించింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) మరియు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HUDCO) మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రాథమిక రుణ వితరణ సంస్థలకు (పిఎల్‌ఐ) సబ్సిడీ ఇవ్వబడుతుంది. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (సి ఎల్ ఎస్ ఎస్) అమలు కోసం పిఎల్‌ఐలు [బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ - మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ (NBFC-MFI) మొదలైన వాటితో సెంట్రల్ నోడల్ ఏజెన్సీలు అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేశాయి.

వడ్డీ రాయితీని పొందాలనుకునే దరఖాస్తుదారు మూడు సెంట్రల్ నోడల్ ఏజెన్సీలలో దేనితోనైనా అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకున్న ప్రాథమిక రుణ సంస్థలను (పిఎల్‌ఐలు) [బ్యాంకులు, గృహ రుణ కంపెనీలు (HFC)  మొదలైనవి] సంప్రదించాలి. దరఖాస్తుదారుడు పి ఎం ఎ  వై - యు మిషన్ యొక్క పధకం మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత పొందినట్లయితే, సంబంధిత బ్యాంక్/గృహ రుణ కంపెనీ (HFC) కి సంబంధించిన  ఆర్థిక క్రమశక్షణ సంరక్షణ విధాన ప్రకారం సూచించిన పత్రాల సమర్పణ మరియు ఇతర నిబంధనలకు లోబడి ఉండాలి. ఒక దరఖాస్తుదారు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (సి ఎల్ ఎస్ ఎస్) కింద వడ్డీ రాయితీకి అర్హులుగా పరిగణించబడిన తర్వాత, సంబంధిత ప్రాథమిక రుణ సంస్థ (PLI) వడ్డీ రాయితీ విడుదల కోసం అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేసిన సెంట్రల్ నోడల్ ఏజెన్సీ (CNA)కి అతని దరఖాస్తును సమర్పించబడుతుంది. సెంట్రల్ నోడల్ ఏజెన్సీ (CNA), పరిశీలన తర్వాత ప్రాథమిక రుణ సంస్థ పిఎల్‌ఐ ద్వారా దరఖాస్తుదారు యొక్క గృహ రుణ ఖాతాకు వడ్డీ రాయితీని విడుదల చేస్తుంది.

 

పి ఎం ఎ  వై - యు యొక్క క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (సి ఎల్ ఎస్ ఎస్) కింద, ఇప్పటివరకు 20.76 లక్షల మంది లబ్ధిదారులకు వడ్డీ రాయితీగా ₹48,095 కోట్ల వడ్డీ రాయితీ విడుదల చేయబడింది.

 

పథకం అమలు సమయంలో అవగాహనను కల్పించడానికి, సి ఎల్ ఎస్ ఎస్ తో సహా పి ఎం ఎ  వై - యు మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యాలను ప్రయోజనాలను వివరించడానికి నగర, రాష్ట్ర మరియు ప్రాంతీయ స్థాయిలలో సమావేశాలు మరియు వర్క్‌షాప్‌లు క్రమం తప్పకుండా నిర్వహించబడతాయి. సి ఎల్ ఎస్ ఎస్ గురించి ప్రచారం చేయడానికి, హిందీతో సహా పన్నెండు భాషల్లో రేడియో సమాచార సంచికలు ప్రసారం చేయబడ్డాయి. అలాగే, సామాజిక మాధ్యమాలు మరియు వీధి నాటకాల ద్వారా లబ్దిదారులతో అనుసంధానాన్ని సమర్థవంతంగా వినియోగించారు. ఇంకా, సి ఎల్ ఎస్ ఎస్ పై అవగాహనకోసం బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (HFCలు) మరియు ఇతర ప్రాథమిక రుణ సంస్థలకు (పిఎల్‌ఐలు) గుర్తించబడిన సెంట్రల్ నోడల్ ఏజెన్సీలు (CNAలు) క్రమం తప్పకుండా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశాల్లో పథకం పురోగతిని సమీక్షించారు.

 

లబ్ధిదారులకు వడ్డీ రాయితీని సజావుగా పంపిణీ చేయడం కోసం అభ్యర్ధనల సత్వర పరిష్కారం మరియు మరింత సమర్థవంతమైన పారదర్శక విధానం కోసం ప్రభుత్వం సి ఎల్ ఎస్ ఎస్ ఆవాస్ పోర్టల్ (CLAP)ని ప్రారంభించింది.సి ఎల్ ఎస్ ఎస్ ట్రాకర్‌ని కలిగిన ఈ పోర్టల్‌ను లబ్ధిదారులు ఉపయోగించడం సులభం. ఈ విశిష్ట అంశం తో  లబ్ధిదారులు వారి అప్లికేషన్‌ల తాజా పరిస్థితిని ఎప్పటికప్పడు తెలుసుకోవచ్చు. లబ్ధిదారులకు సి ఎల్ ఎస్ ఎస్ వడ్డీ రాయితీని, దరఖాస్తు తాజా పరిస్థితి కోసం ఎస్ ఎం ఎస్ గమనికలను సమాచారాన్ని పంపడానికి కూడా ఈ ఆవాస్ పోర్టల్ CLAP క్లాప్ లో సదుపాయం  ఉంది.

 

***



(Release ID: 1847179) Visitor Counter : 129


Read this release in: Gujarati , English , Urdu