ఆయుష్
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఆయుష్ బిల్డింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్


యోగా అనే పదానికి 'యూనియన్' అని అర్థం; అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ప్రధాన మంత్రి ఏకం చేశారు- ఆయుష్ మంత్రి

Posted On: 30 JUL 2022 5:56PM by PIB Hyderabad

నవీ ముంబైలోని ఖర్ఘర్‌లో ఆయుష్ బిల్డింగ్ కాంప్లెక్స్‌ను కేంద్ర ఆయుష్, ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ నేడు ప్రారంభించారు. ఈ నూతన కాంప్లెక్స్‌లో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (CCRH), సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునాని మెడిసిన్ (CCRUM) కింద రీజినల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి (RRIH) మరియు రీజినల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ (RRIUM) ఉన్నాయి.


 

 

 

1999.82 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మూడు అంతస్తుల భవన సముదాయంలో వైద్యంతో పాటు పరిశోధనా సౌకర్యాలు ఉన్నాయి. హోమియోపతి, యునాని ప్రత్యేక ఇన్‌చార్జుల నేతృత్వంలోని పీడియాట్రిక్, జెరియాట్రిక్ మరియు సాధారణ ప్రజల కోసం ఓపీడీ కన్సల్టేషన్‌లు, మందులు, సాధారణ హెమటోలాజికల్ మరియు బయోకెమిస్ట్రీ కోసం ప్రయోగశాల సౌకర్యం వంటి సౌకర్యాలను ఈ సంస్థలు అందిస్తాయి.

ఈ సందర్భంగా శ్రీ సోనోవాల్ మాట్లాడుతూ, భారతీయ సంప్రదాయ వైద్య విధానాలు అనేక శతాబ్దాలుగా మానవ జీవితాలను సుసంపన్నం చేయడంపై తమ ప్రభావాన్ని రుజువు చేస్తున్నాయని అన్నారు. ఆధునిక వైద్యంతో సంప్రదాయ, సంప్రదాయేతర వ్యవస్థల ప్రయోజనాలను చేర్చాలనే ఆలోచనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సహించారని ఆయన అన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ, హోమియోపతి కోసం ప్రాంతీయ పరిశోధనా సంస్థను అలెర్జీ రుగ్మతల కోసం హోమియోపతి ఇన్‌స్టిట్యూట్‌గా అభివృద్ధి చేయడానికి రెజిమెంటల్ థెరపీకి అత్యుత్తమ కేంద్రంగా యునాని ఔషధం యొక్క ప్రాంతీయ పరిశోధనా సంస్థను అభివృద్ధి చేయాలని యోచిస్తోందని ఆయన తెలిపారు.

 

 

శ్రీ సోనోవాల్ మాట్లాడుతూ, 'నూతన కాంప్లెక్స్ ప్రారంభోత్సవంతో, ఆయుష్ మంత్రిత్వ శాఖ భారతీయ సాంప్రదాయ ఔషధ పద్ధతులను ప్రోత్సహించడం, వాటిని అమలు చేయడాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఒక అడుగు ముందుకు వేసిందని మంత్రి తెలిపారు. ముంబై, మహారాష్ట్ర ప్రజలు ఈ సంస్థల నుండి ఎక్కువగా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు.

ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతదేశంలో 22 కోట్ల మందికి పైగా ప్రజలు యోగా సాధన చేశారని మంత్రి తెలిపారు. 'యోగ పదానికి అర్థం 'యూనియన్' అని మంత్రి అన్నారు; అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ప్రధాన మంత్రి ఏకం చేశారన్నారు.

 

ఆయుష్ మంత్రిత్వ శాఖ హోమియోపతి సలహాదారు డాక్టర్ సంగీతా ఎ దుగ్గల్, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి ఛైర్మన్ డాక్టర్ అనిల్ ఖురానా, ప్రభుత్వ ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ రాజ్ కె మంచాందా, ఢిల్లీకి చెందిన పలువురు ప్రముఖులు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

రీజనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హోమియోపతి (RRIH), నవీ ముంబై, రీజినల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ (RRIUM), నవీ ముంబై అనేవి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (CCRH) మరియు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్థానిక సంస్థలు. వీటిని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. హోమియోపతి ప్రాంతీయ పరిశోధనా సంస్థ (RRIH) ప్రారంభంలో 1979 సంవత్సరంలో క్లినికల్ రీసెర్చ్ యూనిట్‌గా స్థాపించబడింది. 1987లో ముంబైలో హోమియోపతి కోసం ప్రాంతీయ పరిశోధనా సంస్థగా ఆధునీకరించబడింది. ఈ సంస్థ 2010 నుండి నావీ ముంబై ప్రాంతంలో అద్దె వసతిలో పనిచేస్తోంది.

రీజినల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ ప్రారంభంలో 1981లో స్థాపించబడిన క్లినికల్ రీసెర్చ్ యూనిట్ (యునాని)గా పనిచేసింది, ఆ తర్వాత 1986లో ఆర్ఆర్ఐయూఎంగా ఆధునీకరించబడింది. అప్పటి నుండి ఇది బైకుల్లాలోని సర్ జేజే హాస్పిటల్ లో పని చేస్తోంది.

***

 


(Release ID: 1846799) Visitor Counter : 147


Read this release in: English , Urdu , Hindi