నౌకారవాణా మంత్రిత్వ శాఖ

మధ్య ఆసియా దేశాల మార్కెట్లను అనుసంధానం చేస్తూ నిర్మించిన అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ ( INSTC) ను ప్రోత్సహించే లక్ష్యంతో 'చాబహర్ డే' నిర్వహణ

Posted On: 31 JUL 2022 1:45PM by PIB Hyderabad

మధ్య ఆసియా దేశాల మార్కెట్లను అనుసంధానం చేస్తూ నిర్మించిన అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ ( INSTC) వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఇండియా పోర్ట్స్ గ్లోబల్‌తో కలిసి ముంబైలో ఈ రోజు కేంద్ర రేవులునౌకజలమార్గాల మంత్రిత్వ శాఖ  'చబహార్ డేని నిర్వహించింది.    రష్యాయూరప్‌లకు చేరుకోవడానికి మరియు మధ్య ఆసియా మార్కెట్‌లలోకి ప్రవేశించడానికి ఎక్సిమ్ నౌకలకు పడుతున్న సమయాన్ని తగ్గించడానికి భారతదేశం  అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ ( INSTC) నిర్మాణానికి చొరవ చూపింది.   ఈ మార్గంలో ఇరాన్‌లో ఉన్న  చాబహర్ రేవు   ఈ ప్రాంతానికిముఖ్యంగా మధ్య ఆసియా దేశాల  వాణిజ్య రవాణా కార్యకలాపాలను అనుసంధానం చేస్తుంది. 

కార్యక్రమంలో కేంద్ర రేవులునౌకజలమార్గాల మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద ఎస్సో నాయక్కజకస్తాన్ రాయబారి నూర్లన్ జగస్బయేవ్,  కిర్గిజ్స్తాన్ రాయబారి అసేన్ ఇసావ్తజికిస్తాన్ రాయబారి లుక్మోన్ బోబోకలోంజోడాతుర్క్మెనిస్తాన్ రాయబారి షాలర్ గెల్డినాజరోవ్ఉజ్బెకిస్తాన్ రాయబారి దిల్షోద్ అఖతోవ్పీఎంఓలో రేవులు ఆర్థిక వ్యవహారాల డిప్యూటీ జలీల్ ఇస్లామీ,ఆఫ్ఘనిస్తాన్ కాన్సల్ జనరల్ జాకియా వార్దక్ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కాన్సుల్ జనరల్ అలీఖానీఇరాన్ దేశ అంతర్జాతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహాదారు మసూద్ ఒస్తాద్ హోస్సేన్ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ రాజీవ్ జలోటాఐపీజీఎల్ ఎండీ శ్రీ సునీల్ ముకుందన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన  శ్రీ సర్బానంద సోనోవాల్ చాబహార్‌లోని షాహిద్ బెహెష్టి రేవును అనుసంధాన రవాణా కేంద్రంగా అభివృద్ధి చేసి మధ్య ఆసియా దేశాలకు చేరుకోవడానికి అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ ను  భారతదేశం ఉపయోగిస్తుందని  అన్నారు. షాహిద్ బెహెష్టి పోర్ట్ మరియు చబహార్ ఫ్రీ ట్రేడ్ జోన్ అందిస్తున్న  ఉపయోగించుకోవాలని ఆయన వ్యాపారరవాణా సంస్థలకు  ఆయన సూచించారు . భారతదేశం నుండి ఇరాన్ మరియు మధ్య ఆసియా దేశాలకు  చౌకైనతక్కువవేగవంతమైన మరియు మరింత నమ్మకమైన మార్గాన్ని రూపొందించడానికి రవాణా సమయాన్ని మరియు ఖర్చు మరింత తగ్గించడానికి తగిన సూచనలతో ముందుకు రావాలని ఆయన ప్రతినిధులుసంబంధిత వర్గాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. 

  వాణిజ్యాన్ని పెంచడంలో  అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్  ను   చాబహార్ అనుసంధానం చేయడం వల్ల  తమ ప్రాంతాల్లో ఎక్సిమ్ వ్యాపారం ఏవిధంగా 

 

పెరుగుతుందన్న అంశాన్ని  మధ్య ఆసియా దేశాల ప్రతినిధులు  వివరించారు. దీనివల్ల  కారిడార్ చుట్టుపక్కల ఉన్న దేశాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.   రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలోఅనేక ప్రదర్శనలు మరియు ప్రభుత్వం నుండి వ్యాపార సెషన్‌లు జరిగాయి. ఐపీఏ చైర్మన్ఐపీజీఎల్  ఎండీ,  విదేశాంగ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ప్రసంగించారు.  ఐపీజీఎల్  డైరెక్టర్ ఆపరేషన్స్,  శ్రీ ఉన్మేష్ శరద్ వాఘ్ వందన సమర్పణ చేశారు.

 
 ***


(Release ID: 1846754) Visitor Counter : 207