రక్షణ మంత్రిత్వ శాఖ
ఆల్ నజా -IV సంయుక్త విన్యాసాల కోసం భారత్ చేరుకున్న రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ దళం
Posted On:
31 JUL 2022 11:16AM by PIB Hyderabad
భారత్, రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ ల సంయుక్త సైనిక విన్యాసాలు, ‘అల్ నాజా-IV’ మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ (రాజస్థాన్)లోని విదేశీ శిక్షణా నోడ్‌లో 01 ఆగస్టు నుంచి 13 ఆగస్టు 2022 వరకు జరుగనున్నాయి. రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ కి చెందిన సుల్తాన్ ఆఫ్ ఒమన్ పారాచూట్ దళానికి నుంచి 60 మంది సైనికులతో కూడిన పటాలం విన్యాసాల ప్రాంతాన్ని చేరుకుంది. భారతీయ సైన్యానికి చెందిన 18 మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ కి చెందిన సైనికులు ప్రాతినిధ్యం వహిస్తారు. గత అల్ నజా IV విన్యాసాలను 12 నుంచి 25 మార్చి 2019వరకు మస్కట్‌లో నిర్వహించారు.
వృత్తిపరమైన చర్చలు, కసరత్తులు & విధానాలకు సంబంధించి పరస్పర అవగాహన, సంయుక్త కమాండ్ & నియంత్రణ వ్యవస్థల ఏర్పాటు, తీవ్రవాదుల బెదరింపుల నిర్మూలన వంటివన్నీ ఈ విన్యాసాల పరిధిలో ఉన్నాయి. ఈ సంయుక్త విన్యాసాలు కౌంటర్ టెర్రరిజం కార్యకలాపాలు, ప్రాంతీయ భద్రతా ఆపరేషన్లు, ఐక్యరాజ్య సమితి చార్టర్ కింద పీస్ కీపింగ్ ఆపరేషన్లపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడం కాక సంయుక్త భౌతిక శిక్షణా షెడ్యూళ్ళను, వ్యూహాత్మక కసరత్తులు, పద్ధతులు, విధానాలపై దృష్టిని కేంద్రీకరిస్తుంది.
నిర్మిత ప్రాంతంలో జాయింట్ రూం ఇంటర్వెన్షన్ కసరత్తులతో పాటు సంయుక్త సంచార వాహనాల చెక్‌పోస్టులు, సంయుక్త కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ల ఏర్పాటుతో కూడిన 48 గంటల సుదీర్ఘ ధ్రువీకరణ విన్యాసంతో, ముగిసేలా సమగ్ర శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించారు.
భారతీయ సైన్యం, రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ ల మధ్య రక్షణ సహకారాన్ని పెంచడం ఈ సంయుక్త సైనిక విన్యాసాల లక్ష్యం. ఇది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెరగడంతో వ్యక్తం కానుంది.
***
(Release ID: 1846753)
Visitor Counter : 226