వ్యవసాయ మంత్రిత్వ శాఖ

వ్యవసాయాన్ని సుసంపన్నం చేయడానికి రాష్ట్రాలకు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి మంచి అవకాశం: శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు.


వ్యవసాయ రంగాన్ని అప్ గ్రేడ్ చేయడానికి ప్రధాని మోదీ నాయకత్వంలో గత ఎనిమిదేళ్లుగా నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి: శ్రీ తోమర్

అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అవార్డులను ప్రదానం చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి

Posted On: 30 JUL 2022 6:18PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం లో భాగంగా ప్రారంభించిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఎఐఎఫ్ ) కొత్త మైలురాళ్ల ను అధిగ మిస్తోందని కేంద్ర వ్యవసాయ,  రైతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. వ్యవసాయం , గ్రామాలకు సాధికారత కల్పించడం ,ప్రైవేట్ పెట్టుబడులను పెంచడం ద్వారా అగ్రి ఇన్ ఫ్రా అంతరాన్ని పూడ్చడంలో ఎఐఎఫ్ పాత్రను వివరిస్తూ, వ్యవసాయ ఉత్పాదకత ను

పెంచడానికి, వ్యవసాయ ఎగుమతులను పెంచేందుకు, వ్యవసాయ రంగాన్ని ఉపాధి కల్పనా రంగంగా మార్చడానికి,  కొత్త తరాన్ని

ఆకర్షించడానికి అగ్రి ఇన్ ఫ్రా ఫండ్ ను తీసుకువచ్చామని శ్రీ తోమర్ తెలిపారు.  ఈ రోజు న్యూఢిల్లీ లో జరిగిన అగ్రి ఇన్ ఫ్రా ఫండ్ అవార్డుల ప్రదానోత్సవంలో శ్రీ తోమర్

ప్రసంగించారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0013FFP.jpg

 

ఆత్మనిర్భర్ భారత్ ప్రచారంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రూ.1.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నాము.  దీనిని రాష్ట్ర ప్రభుత్వాలు , బ్యాంకులు కలిసి వ్యవసాయ రంగం అభివృద్ధిలో ఉపయోగించుకోవాలి. వ్యవసాయ మౌలిక

సదుపాయాలకు నిధులను అందించడంలో లోటుపాట్లను పూరించడానికి రాష్ట్రాలకు ఇది ఒక గొప్ప అవకాశం. వ్యవసాయాన్ని బలంగా, సుసంపన్నంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని ఉపయోగించుకోవాలి., ఇది దేశాన్ని వేగంగా అభివృద్ధి చేస్తుంది‘‘  అని ఆయన అన్నారు.

 

వ్యవసాయ మౌలిక స దుపాయాల కు నిధుల ను అందించ డంలో లోటుపాట్లను పూరించ డానికి రాష్ట్రాల కు ఇది ఒక గొప్ప అవ కాశం. వ్యవసాయాన్ని బలంగా, సుసంపన్నంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని ఉపయోగించుకోవాలి.  ఇది దేశాన్ని వేగంగా అభివృద్ధి చేస్తుంది‘‘ అని  ఆయన అన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002V2WO.jpg

 

భారత దేశానికి వ్యవసాయ రంగం ఎంతో ముఖ్యమని శ్రీ తోమర్ అన్నారు. "వ్యవసాయం ప్రాధాన్యత ఎప్పటికప్పుడు తనను తాను నిరూపించుకుంది. కోవిడ్ సంక్షోభం నుండి భారతదేశం బయటపడటానికి వ్యవసాయం సహాయపడింది .ఇతర రంగాలు తీవ్రంగా ప్రభావితమైన సమయంలో ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన తోడ్పాటును అందించింది.

ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో ప్రపంచంలోనే ప్రముఖ దేశాలలో భార త దేశం ఒకటిగా ఉంది" అని శ్రీ తోమర్ అన్నారు.

 

"మీరు ఈ రంగంలో ముందుకు సాగాలంటే, మీరు సవాళ్లను గుర్తించి వాటిని అధిగమించాలి. దేశంలో 86 శాతం మంది చిన్న రైతులు ఉన్నారు, వారు రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమిని కలిగి ఉన్నారు, దేశ జనాభాలో 55 నుండి 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు.ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాన మంత్రి శ్రీ న రేంద్ర మోదీ నాయకత్వంలో

వ్యవసాయ రంగాన్ని అప్ గ్రేడ్ చేయడానికి

గత ఎనిమిదేళ్ళుగా నిర్విరామ ప్రయత్నాలు

జరుగుతున్నాయి.కేసీసీని రూ.7 లక్షల కోట్ల నుంచి రూ.16.5 లక్షల కోట్లకు పెంచారు. బ్యాంకులు సరళమైన రుణ సదుపాయాన్ని అందిస్తున్నాయి. దీనితో పాటు, 10,000 ఎఫ్ పి ఓ లను ఏర్పాటు చేయడానికి పనులు జరుగుతున్నాయి, తద్వారా సాగు విస్తీర్ణం పెరుగుతుంది, ఉత్పత్తి నాణ్యత మెరుగుపడుతుంది .రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధరను పొందవచ్చు" అని ఆయన అన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003N1MR.jpg

 

ఈ సందర్భంగా వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి మాట్లాడుతూ, రైతులకు  సాధికారత

కల్పించడం లోను, దేశానికి స్వావలంబన సాధించడంలోను బ్యాంకులు,

ప్రభుత్వ సంస్థల పాత్ర గురించి

వివరించారు.భారత ప్రభుత్వం గ్యారెంటీగా నిలబడి పూచీకత్తు అవసరాన్ని రద్దు చేసి  వ్యవసాయ రుణాలను సులభతరం చేయడం ద్వారా ప్రధాని మోదీ సాహసోపేతమైన చర్య తీసుకున్నారని ఆయన అన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004HR77.jpg

 

పోర్టల్ ఆధారిత రుణ ఆమోద యంత్రాంగానికి అనుగుణంగా రుణ ప్రక్రియను వేగవంతం చేయడానికి మెరుగైన పర్యవేక్షణను మెరుగుపరచాలని డిఎ అండ్ ఎఫ్ డబ్ల్యు కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా తన ప్రసంగంలో పిలుపునిచ్చారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005VSRA.jpg

 

డిఎ అండ్ ఎఫ్ డబ్ల్యు సంయుక్త కార్య ద ర్శి శ్రీ శామ్యూల్ ప్రవీణ్ కుమార్ ఎఐఎఫ్ రెండు సంవత్సరాల ప్రయాణం గురించి సవివరమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. బ్యాంకర్లు ,రాష్ట్ర

ప్రభుత్వాల తోడ్పాటుకు గాను వారిని ప్రశంసించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్ ఓ బి ఓ ఎల్ (నేషన్ వైడ్ వన్ బ్రాంచ్ వన్ లోన్) క్యాంపెయిన్ ను గొప్ప విజయవంతం చేయడం కోసం తమ బృందాలను

పునరుత్తేజం చేయాలని ఆయన వారిని కోరారు.

 

ఈ సందర్భంగా శ్రీ తోమర్ వివిధ కేటగరీల కింద కేంద్ర రంగ  'వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి' పథకం కింద ఫైనాన్సింగ్ లో బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అమూల్య మైన తోడ్పాటును గౌరవించడానికి గాను వివిధ కేటగిరీల కింద అవార్డులను

 ప్రదానం చేశారు.

 

आज नई दिल्ली में आयोजित कृषि अवसंरचना कोष पुरस्कार वितरण समारोह में सर्वश्रेष्ठ प्रदर्शन करने वाले बैंकों के प्रतिनिधियों को पुरस्कार प्रदान किये।

आप सभी को हार्दिक बधाई एवं शुभकामनाएं।#AIF #Aatmanirbharkrishi pic.twitter.com/5a6W0XC3gy

 

— Narendra Singh Tomar (@nstomar) July 30, 2022

 

ఉత్తమ పనితీరు కనబరిచిన బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రథమ స్థానం లభించగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రెండో కేటగిరీలో బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ లను  సత్కరించారు. టార్గెట్ అచీవర్స్ కేటగిరీలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్ ఉన్నాయి. ఉత్తమ పనితీరు కనబరిచిన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మధ్యప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, మధ్యప్రదేశ్ గ్రామీణ్ బ్యాంక్, మహారాష్ట్ర గ్రామీణ బ్యాంక్, బరోడా రాజస్థాన్ క్షేత్రీయ గ్రామీణ బ్యాంకు ఈ అవార్డులను దక్కించుకున్నాయి.

 

రాష్ట్ర కేటగిరీలో మధ్యప్రదేశ్ ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా ఎంపిక కాగా, పిఎసిఎస్ దరఖాస్తుల మంజూరులో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. పిఎసిఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించడంలో ఉత్తమ పనితీరు కనబరిచిన కర్ణాటకకు అవార్డు లభించింది మరియు ఎఐఎఫ్ కింద రాజస్థాన్ ను రైజింగ్ స్టేట్ గా ప్రకటించారు. నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్, పథకం నాలెడ్జ్ పార్ట్ నర్ గా ఉన్న వారిని ఈ పథకాన్ని ముందుకు తీసుకు

వెళ్లడంలో ప్రశంసనీయమైన తోడ్పాటును అందించినందుకు గాను సత్కరించారు.

 

శ్రీ తోమర్ ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ తో కలసి డ్రోన్ ప్రాజెక్ట్ లబ్ధిదారుల్లో ఒకరికి మంజూరు లేఖను అందజేశారు. తరువాత, అవార్డు గెలుచుకున్న బ్యాంకర్లు రాష్ట్రాల ప్రతినిధులు విజయవంతమైన లబ్ధిదారులు తమ అనుభవాలను ఆహుతులతో పంచుకున్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007PSDN.jpg

 

ఈ కార్యక్రమంలో అడిషనల్ సెక్రటరీ శ్రీ అభిలాక్ష్ లిఖీ, మంత్రిత్వ శాఖ కు చెందిన సీనియర్ అధికారులు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ అధికారులు, బ్యాంకులు, నాబార్డు, నాబ్కాన్స్ కు చెందిన సీనియర్ అధికారులు, ఎఐఎఫ్ పథకం లబ్దిదారులు

తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0081AG4.jpg

 

వ్యవసాయ ఇన్ఫ్రా ఫండ్, ప్రతిష్టాత్మక ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద, పంట కోత అనంతర నిర్వహణ  మౌలిక సదుపాయాలు, కమ్యూనిటీ ఫార్మింగ్ ఆస్తులను సృష్టించడానికి మధ్య-దీర్ఘకాలిక రుణ సదుపాయాన్ని అందించే ఒక ప్రత్యేక కేంద్ర పథకం కింద, వచ్చే నెలలో తన 2 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ సదుపాయం ప్రభుత్వం నుండి మూడు శాతం వడ్డీ రాయితీ, సిజిటిఎమ్ఎస్ఈ ద్వారా రూ .2 కోట్ల వరకు క్రెడిట్ గ్యారెంటీ ద్వారా ఆర్థిక మద్దతుతో వస్తుంది. ఈ పథకం వివిధ

పథకాల ప్రయోజనాల కలయిక పరంగా

ఇప్పటి వరకు ఉన్న చాలా కేంద్ర పథకాలతో

కలిసి కల్పించవచ్చు. ఇది వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలోని వాటాదారులకు - రైతులు, అగ్రి-ఎంటర్ప్రెన్యూర్, ఎఫ్పిఓ, ఎస్ హెచ్ జి  , జె ఎల్ జి , పి ఎ సి ఎస్ , ఏ పి ఎం సి, స్టార్టప్ లు, సెంట్రల్ మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీలు ,స్టేట్ ఏజెన్సీలకు ఎంతో ప్రయోజనం చేకూర్చింది.

 

ఇప్ప టి వర lకు 13,700 ప్రాజెక్టులకు అనుమ తి ఇవ్వడం జరిగింది, దీనికి సుమారు రూ.17,500 కోట్ల పెట్టుబడులకు గాను రూ.10,131 కోట్ల రుణాలను మంజూరు చేయడం జరిగింది.గోదాములు, అస్సేయింగ్ యూనిట్లు, ప్రాథమిక ప్రాసెసింగ్ యూనిట్లు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, సార్టింగ్ అండ్ గ్రేడింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోర్ , కోల్డ్ చైన్ ప్రాజెక్టులు, బయో-స్టిమ్యులెంట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీస్, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మొదలైన వాటి రూపంలో దేశవ్యాప్తంగా రోజుకు సగటున 30 వ్యవసాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మంజూరు అవుతున్నాయి.

 

आज नई दिल्ली में आयोजित कृषि अवसंरचना कोष पुरस्कार वितरण समारोह का दीप प्रज्वल्लित कर शुभारम्भ किया... pic.twitter.com/ZwnFeHGnnl

 

— Narendra Singh Tomar (@nstomar) July 30, 2022

 

****



(Release ID: 1846695) Visitor Counter : 153


Read this release in: English , Urdu , Marathi , Hindi