ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో రెండు ఎన్ఐఎఫ్‌టీఈఎంలు పనిచేస్తున్నాయి

నాడు పోస్టు చేయడమైనది: 29 JUL 2022 1:04PM by PIB Hyderabad

 

ప్రస్తుతం  దేశంలో రెండు 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్' (ఎన్ఐఎఫ్‌టీఈఎం) సంస్థ‌లు పని చేస్తున్నాయి. ఇందులో ఒకటి హర్యానాలోని కుండ్లిలో ఉండ‌గా మరొకటి తమిళనాడులోని తంజావూరులో ప‌ని చేస్తోంది. ఈ రెండు ఇన్‌స్టిట్యూట్‌లు వివిధ ర‌కాల కోర్సుల‌ను అందిస్తున్నారు. ఫుడ్ టెక్నాజ‌లీ మ‌రియు అనుబంధ రంగాల‌లో
ఈ సంస్థ‌లు బీటెక్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల‌ను అందిస్తున్నాయి. ఎన్ఐఎఫ్‌టీఈఎం కుండ్లీ ఎంబీఏ కోర్సుల‌ను అందిస్తోంది. ఈ రంగంలో పెరుగుతున్న మానవశక్తి డిమాండ్‌ను తీర్చేందుకు వీలుగా  విద్యార్థుల ప్రవేశాన్ని పెంచారు. ఇతర కేంద్ర నిధులతో నడిచే సంస్థలు/విశ్వవిద్యాలయాలు, రాష్ట్రంలో నడిచే సంస్థలు/విశ్వవిద్యాలయాలు మరియు ప్రైవేట్ సంస్థలు/విశ్వవిద్యాలయాలు కూడా ఫుడ్  టెక్నాలజీలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మరియు డాక్టరేట్ డిగ్రీని అందిస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలలో పెరుగుతున్న మానవ శక్తి డిమాండ్‌ను తీర్చడానికి అనుబంధ స్పెషలైజేషన్‌తో ఈ కోర్సుల‌ను అందిస్తున్నారు. రెండు ఎన్ఐఎఫ్‌టీఈఎంల కార్యకలాపాలను సమీక్షించడానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఓఎఫ్‌పీఐ) సమీక్షా కమిటీని ఏర్పాటు చేసింది. నిర్దేశిత లక్ష్యాలకు సంబంధించి రెండు సంస్థ‌లు  ప్రారంభించిన‌ప్ప‌టి నుండి ఈ సంస్థ‌లు చాలా బాగా పనిచేస్తున్నాయని స‌మీక్షా కమిటీలు నివేదించాయి. ఆహార శాస్త్రం మరియు సాంకేతికత యొక్క సమకాలీన విభాగాల‌లో ఇన్‌స్టిట్యూట్ అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న ఇతర సారూప్య ఇన్‌స్టిట్యూట్‌లను చేరుకోవడానికి వీలుగా కొత్త విధానాల‌ను కూడా ఈ సంస్థ‌ల‌లో ప్రారంభించ‌డం జ‌ర‌గింది.  ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన (పీఎంకేఎస్‌వై),  మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) యొక్క ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ మరియు ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎంఎఫ్ఎంఈ) ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌లో ఉపాధి కల్పనను ఎంఓఎఫ్‌పీఐ సులభతరం చేస్తోంది. వచ్చే ఐదేళ్ల కాలానికి సంబంధించి  నిర్దిష్ట లక్ష్యాలు నిర్దేశించ‌బ‌డ‌లేదు. ఈ సమాచారాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక  లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

***


(రిలీజ్ ఐడి: 1846624) సందర్శకుల సూచీ సంఖ్య : : 111
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu