ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

అరుదైన వ్యాధుల చికిత్స కోసం ప్రభుత్వం చొరవలు


నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ 2021 కింద రోగనిర్ధారణ, నివారణ ,చికిత్స కోసం ఎనిమిది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఈ) గుర్తింపు

అరుదైన వ్యాధులలో ఏ ఒక్క దానితో అయినా బాధపడుతున్న రోగులకు రూ. 50 లక్షల వరకు ఆర్థిక సహాయం: ఎన్ పి ఆర్ డి -2021లో పేర్కొన్న ఏదైనా సి ఓ ఇ లో చికిత్స

Posted On: 29 JUL 2022 4:38PM by PIB Hyderabad

అరుదైన వ్యాధుల రోగుల చికిత్స కోసం ప్రభుత్వం 2021 మార్చిలో నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ (ఎన్ పి ఆర్ డి- 2021) ను ప్రారంభించింది. ఎన్ పి ఆర్ డి- 2021

ముఖ్య లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

 

అరుదైన వ్యాధులను గుర్తించి గ్రూప్ 1, గ్రూప్ 2 , గ్రూప్ 3 అనే 3 తరగతులుగా వర్గీకరించారు.

 

గ్రూప్ 1: ఒక్కసారి చికిత్స తో నయం చేయగల

రుగ్మతలు.

 

గ్రూపు-2: దీర్ఘకాలిక/జీవితకాల చికిత్స అవసరమైన వ్యాధులు అంటే తక్కువ వ్యయం తో ప్రయోజనం కలిగిన చికిత్స . ఏడాదికోసారి లేదా మరింత తరచుగా పర్యవేక్షణ అవసరమయ్యే కేసులు

 

గ్రూపు 3:- ఖచ్చితమైన చికిత్స అవసరమయ్యే వ్యాధులు. అయితే ప్రయోజనం, ఖర్చు ,జీవితకాల చికిత్స కోసం సరైన రోగిని ఎంపిక చేయడం సవాళ్లు.

 

అరుదైన వ్యాధులకు సంబంధించి ఏ కేటగిరీ వ్యాధి తో నయినా  బాధపడుతున్న రోగులకు రూ.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇంకా,రాష్ట్రీయ ఆరోగ్య నిధి పథకానికి వెలుపల, ఎన్ పి ఆర్ డి- 2021

లో పేర్కొన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఈ) లో చికిత్స కోసం ఏర్పాటు చేస్తారు. అరుదైన వ్యాధికి చికిత్స చేయడానికి ఆర్థిక సాయం పొందడం కోసం, రోగి తన దగ్గర లోని  దగ్గరల్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని సంప్రదించవచ్చు. అక్కడ అతని పరిస్తితి మదింపు చేసి చికిత్స,, ప్రయోజనాలు అందిస్తారు.

 

అరుదైన వ్యాధుల నిర్ధారణ, నివారణ చికిత్స కోసం కొరకు ఎనిమిది (08) సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఒఇలు) లను గుర్తించారు. జన్యు పరీక్ష ,కౌన్సిలింగ్ సేవల కోసం ఐదు నిడాన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

 

అరుదైన వ్యాధుల నిర్ధారణ ,చికిత్స కోసం పరిశోధన - అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఎన్ పి ఆర్ డి- 2021లో నిబంధనలు ఉన్నాయి; స్థానిక అభివృద్ధి ,ఔషధాల తయారీని ప్రోత్సహించడం ,సరసమైన ధరల వద్ద అరుదైన వ్యాధుల కొరకు ఔషధాలను దేశీయంగా తయారు చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం.

 

ఫార్మాస్యూటికల్స్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం అమలును ఫార్మాస్యూటికల్స్ డిపార్ట్ మెంట్ ప్రారంభించింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన తయారీదారులకు, ఆర్ఫన్ ఔషధాలతో సహా వివిధ ప్రొడక్ట్ కేటగిరీల దేశీయ తయారీ కోసం ఆర్థిక ప్రోత్సాహకాలను ఈ పథకం అందిస్తుంది.

 

డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నోటిఫికేషన్ నెంబరు 46/2021-కస్టమ్స్ తేదీ 30.09.2021 ద్వారా స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (ఎస్ఎంఎ) అనే అరుదైన వ్యాధి చికిత్స కోసం దిగుమతి చేసుకున్న (వ్యక్తిగత ఉపయోగం మాత్రమే) మందులకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బిసిడి) ,ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (ఐజిఎస్టి) పూర్తి మినహాయింపు ఇచ్చారు.  తద్వారా అరుదైన ఎస్ఎంఎ వ్యాధికి మందులను  మరింత చౌకగా  అందిస్తున్నారు.

 

అదనంగా, రెవెన్యూ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ నెం. 02/2022-కస్టమ్స్ 01.02.2022 ద్వారా ఎన్ పి ఆర్ డి -2021లో జాబితా చేయబడిన ఏదైనా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి లేదా ఏదైనా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సిఫారసుపై ఏదైనా వ్యక్తి లేదా సంస్థ దిగుమతి చేసుకున్న అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందులకు ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ నుండి మినహాయింపు ఇచ్చారు. మందులు లేదా ఔషధాలు దిగుమతి చేసుకున్న వ్యక్తి (పేరు ద్వారా) అరుదైన వ్యాధితో (పేరు ద్వారా పేర్కొనాలి) బాధపడుతున్నాడని , ఆ వ్యాధి చికిత్స కోసం ఔషధాలు లేదా మందులు అవసరం అవుతాయని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ధృవీకరించడం తప్పనిసరి.

 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ ఈ రోజు లోక్ సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు.

 

****



(Release ID: 1846622) Visitor Counter : 375


Read this release in: English , Urdu