ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో అవయవదానాన్ని ప్రోత్సహించడానికి తీసుకున్న చర్యలు


నేషనల్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ ప్రోగ్రామ్ కింద బయో మెటీరియల్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్రాలకు ఆర్థిక సాయం

వగాహన కల్పించడం , వైద్యులు ,ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్ లకు శిక్షణ అందించడానికి వివిధ ఐ ఇ సి కార్యకలాపాల నిర్వహణ

Posted On: 29 JUL 2022 4:39PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా అవయవ దానం , ట్రాన్స్ ప్లాంటేషన్ ను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం నేషనల్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ ప్రోగ్రామ్ (ఎన్ ఓ టి పి) ని కలిగి ఉంది. ఈ ప్రోగ్రామ్ కింద ఉన్న నిబంధనల్లో కింది వాటికి ఆర్థిక మద్దతు ఉంటుంది:

 

*ప్రతి రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ లు (ఎస్ వోటిటిఓలు) ఏర్పాటు చేయడం.

 

*జాతీయ/ప్రాంతీయ/రాష్ట్ర బయో మెటీరియల్ సెంటర్ల ఏర్పాటు;

 

*కొత్త అవయవ మార్పిడి/తిరిగి పొందే సౌకర్యాలను ఏర్పాటు చేయడం , ఇప్పటికే ఉన్న అవయవ మార్పిడి/తిరిగి పొందే సౌకర్యాలను బలోపేతం చేయడం.

 

*మెడికల్ కాలేజీలు , ట్రామా సెంటర్ లకు ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్ ల ఏర్పాటు.

 

*మరణించిన దాత కు సంబంధించి మెయింటేనెన్స్

 

*మరణించిన దాత కు గౌరవప్రదమైన అంత్యక్రియలు

 

*బిపిఎల్ రోగులకు ట్రాన్స్ ప్లాంట్ అనంతర ఇమ్యూన్-సప్రెసెంట్ ఔషధాలు.

 

ఈ కార్యక్రమం లో భాగంగా న్యూఢిల్లీ లో ఒక అపెక్స్ లెవల్ నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ (నాటో), ఐదు రీజనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్స్ ఆర్ఓ టి టి ఓ లు) ,పదహారు స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ లు (ఎస్ ఓ టి టి ఓ లు) ఏర్పాటు అయ్యాయి.

 

గుండె, మూత్రపిండాలు, కాలేయం మొదలైన అవయవాలను పొందిన వెంటనే తిరిగి మార్పిడి చేయాల్సి ఉంటుంది. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎన్ ఓ టి టి ఓ) కు కణజాలాలను నిల్వ చేయడం కోసం నేషనల్ లెవల్ టిష్యూ బ్యాంక్ (బయోమెటీరియల్ సెంటర్) సదుపాయం ఉంది. నేషనల్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ ప్రోగ్రామ్ (ఎన్ ఓ టి పి) కింద, బయో మెటీరియల్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించడానికి ఒక నిబంధన ఉంది. తమిళనాడులోని చెన్నైలో రీజనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఆర్ ఓ టి టి ఓ) లో ఒక రీజనల్ బయో మెటీరియల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇంకా, ఎన్ ఓ టి పి కింద బయో మెటీరియల్ సెంటర్ ఏర్పాటుకు బీహార్ మహారాష్ట్ర రాష్ట్రాలకు నిధులు విడుదల చేశారు.

 

ఎన్ ఓ టి టి ఓ, ఆర్ ఓ టి టి ఓ, ఎస్ ఓ టి టి ఓ లు అవయవ దానం గురించి సంబంధిత సమాచారాన్ని ప్రజల్లో వ్యాప్తి చేస్తాయి. www.notto.gov.in వెబ్ సైట్, , టోల్ ఫ్రీ హెల్ప్ లైన్  నంబర్ (1800114770) తో 24×7 కాల్ సెంటర్ ను  ప్రారంభించారు. భారతీయ అవయవదాన దినోత్సవం, సెమినార్లు, వర్క్ షాప్ లు, డిబేట్ లు, స్పోర్ట్స్ ఈవెంట్ లు, వాక్ థాన్ లు, మారథాన్ లు, నుక్కడ్ నాటక్, మొదలైన అనేక కార్యకలాపాలు, వైద్యులు, ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్ లతో సహా ట్రాన్స్ ప్లాంట్ తో సంబంధం ఉన్న వారందరికీ ట్రైనింగ్ అందించడం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

 

ప్రింట్ మీడియాలో ప్రకటనల ద్వారా అవగాహన కార్యక్రమాలు, ఆడియో-విజువల్ సందేశాలు , దూరదర్శన్ ,ఇతర టెలివిజన్ ఛానెళ్లలో నిపుణుల ప్రసంగాలు మొదలైనవి చేపట్టారు. దేశ స్వాతంత్ర 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమృత్ మహోత్సవ్ లో భాగంగా అవయవ దానంపై అవగాహన కల్పించడం, సామాజిక మాధ్యమాల రూపంలో ప్రతిజ్ఞ చేయడం కోసం జన్ ఆందోళన్ నిర్వహించారు.

 

నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎన్ ఓ టి టి ఓ) కు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అందించే డేటా ప్రకారం, దేశంలో మూత్రపిండాల మార్పిడి కోసం క రోగుల సంఖ్యతో పాటుగా అటువంటి ట్రాన్స్ ప్లాంట్ ల కొరకు లభ్యం అవుతున్న మూత్రపిండాల సంఖ్య దిగువ పేర్కొన్న విధంగా ఉంది:

 

 

సంవత్సరం

మరణించిన దాతల నుంచి ట్రాన్స్ ప్లాంట్ చేయబడ్డ మూత్రపిండాల సంఖ్య

లివింగ్ డోనర్ ల నుంచి ట్రాన్స్ ప్లాంట్ చేయబడ్డ మూత్రపిండాల సంఖ్య

ట్రాన్స్ ప్లాంట్ చేయబడ్డ మొత్తం మూత్రపిండాల సంఖ్య

2019

1153

8613

9766

2020

532

4970

5502

2021

818

8254

9072

 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ ఈ రోజు లోక్ సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు.

 

****


(Release ID: 1846621)
Read this release in: English , Urdu , Marathi