మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
రుతు పరిశుభ్రతను (మెనస్ట్రువల్ హైజీన్) ప్రోత్సహించేందుకు పథకం
Posted On:
29 JUL 2022 2:37PM by PIB Hyderabad
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉన్న 10-19 సంవత్సరాల వయసులో ఉన్న కౌమార బాలికలకు రుతుస్రావ పరిశుభ్రత (మెనస్ట్రువల్ హైజీన్) పథకాన్ని 2011 నుంచి అమలు చేస్తోంది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అందుకున్న ప్రతిపాదనల ఆధారంగా రాష్ట్ర కార్యక్రమ అమలు ప్రణాళిక (పిఐపి) ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ ఈ పథకానికి మద్దతునందిస్తోంది. రుతుస్రావ పరిశుభ్రత కోసం కౌమార బాలికలలో చైతన్యాన్ని పెంచడం, (ii) కౌమార బాలికలు మంచి నాణ్యత కలిగిన శానిటరీ నాప్‌కిన్ల అందుబాటును పెంచడం, (iii) పర్యావరణానికి అనుకూలంగా శానిటరీ నాప్‌కిన్లను సురక్షితంగా పారవేసేలా చూడటం. ఈ పథకం కింద, ఒక ప్యాకెట్‌ను రూ.6 చొప్పున రాయితీ ధరలో కౌమార బాలికలకు శానిటరీ నాప్‌కిన్లను గుర్తింపు పొందిన సోషల్ హెల్త్ యాక్టివిస్టు (ఆషా) ద్వారా అందిస్తారు.
ఇందుకు అదనంగా, స్వచ్ఛ అభియాన్ కింద మంచినీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ పారిశుద్ధ్యం, ఆరోగ్యం కోణంలో ప్రవర్తన మార్పుకు సంబంధించిన సమగ్ర చొరవలలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో రుతుస్రావ పారిశుభ్రత నిర్వహణ గురించి చైతన్యం తీసుకువచ్చేందుకు రుతుస్రావ పారిశుద్ధ్య నిర్వహణ జాతీయ మార్గదర్శనాలను రూపొందించింది.
వీటితో పాటుగా, సరసమైన ధరలో శానిటరీ నాప్కిన్లు, నాణ్యత కలిగిన మందులును అందుబాటులో ఉంచేందుకు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ కింద ఫార్మస్యూటికల్స్ విభాగం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన (పిఎంబిజెపి)ని అమలు చేస్తోంది. ఇది మహిళల ఆరోగ్య భద్రతను కల్పించడంలో ముఖ్యమైన అడుగు. ఈ ప్రాజెక్టు కింద, దాదాపు 8700 జనౌషధి కేంద్రాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు సువిధ పేరుతో ఆక్సో- బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్లు ఒకటి రూ.1 చొప్పున అందచేస్తున్నారు.
ఈ సమాచారాన్ని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ లోక్‌సభలో నేడు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
***
(Release ID: 1846610)
Visitor Counter : 184