రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణ బలగాల్లోని సైనికుల/అధికారుల సామర్థ్య ఉన్నతీకరణ
Posted On:
29 JUL 2022 2:26PM by PIB Hyderabad
సైనిక, నావిక, వైమానిక… దళాల్లోని సైనికులు, ఉన్నతాధికారులపై ఒత్తిడి తగ్గించడంతోపాటు సామర్థ్యం పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు త్రివిధ దళాల సిబ్బంది, అధికారులపై పని ఒత్తిడి తగ్గించడానికి, వారిలో సామర్థ్య వికాసానికి చేపట్టిన చర్యల వివరాలు కిందివిధంగా ఉన్నాయి:-
- ఒత్తిడి తగ్గింపు దిశగా చేపట్టిన చర్యలు… సైనికులు, అధికారులలో ఒత్తిడి తగ్గింపు నిమిత్తం అమలు చేస్తున్న నిబంధనలు:
- సైనికులకు నియామక శిక్షణతోపాటు అధికారులకు ముందస్తు కమిషన్ సహా సైనికులు, అధికారుల శిక్షణను నిర్దేశిత ప్రణాళికబద్ధ కార్యక్రమం మేరకు నిర్వహించడం. ఈ మేరకు వారు తమకు అప్పగించిన విధుల నిర్వహణలో శారీరకంగా, మానసికంగా ఒత్తిడి స్థాయుల సమర్థంగా అధిగమించగలరు.
- సిబ్బందికి అప్పగించిన బాధ్యతల నిర్వహణలో స్థిరత్వం, సంభావ్యతల దిశగా కీలక శిక్షణ, పరిపాలన కార్యక్రమాల వార్షిక ప్రణాళిక రూపకల్పన.
- సైనికులు, అధికారులలో ఒత్తిడి తగ్గించడం కోసం వారి రోజువారీ/వారంవారీ క్రమబద్ధ-శిక్షణ కార్కక్రమాన్ని తగినంత వ్యవధితో, వారి శారీరక-మానసిక సామర్థ్యాల మెరుగుకు అనువుగా రూపొందించడం.
- ఆమోదం ప్రకారం వార్షిక, సాధారణ సెలవులు మంజూరు.
- యూనిట్లు, ఫార్మేషన్, స్టేషన్ స్థాయులలో సాధారణ కార్యకలాపాలు, ఇంటర్వ్యూలు, సైనిక సమ్మేళనాల సమయంలో అధికార-అనధికార పరస్పర చర్యలద్వారా సిబ్బంది మధ్య క్రమం తప్పకుండా సమావేశాలు, పర్యవేక్షణ, తనిఖీ.
- యూనిట్లు, ఫార్మేషన్, స్టేషన్ స్థాయులలో సమస్యల పరిష్కారం కోసం యంత్రాంగం ఏర్పాటు.
- అవసరం ఉన్న సిబ్బందికి మానసిక సలహాదారులు, వైద్య సదుపాయాల కల్పన.
- ‘బడ్డీ పెయిర్స్’, ‘చార్ యార్’ భావనతో సిబ్బంది సాధారణ దినచర్యలో గడిపేలా చూడటం; నైతిక, మానసిక మద్దతుకు భరోసా ఇవ్వడంతోపాటు ఒత్తిడి సంబంధిత సమస్యలతో బాధపడే వ్యక్తులను సకాలంలో గుర్తించేలా క్రమం తప్పని పరస్పర సంభాషణకు చొరవ.
- కుటుంబ బాధ్యతల నిర్వహణలో స్థిరత్వం దిశగా వివాహితులకు వసతి, వినోద సౌకర్యాలు, పిల్లలకు పాఠశాల/ఉన్నత విద్య సౌలభ్యం వంటి సంక్షేమ కార్యకలాపాలు.
- మెరుగైన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఊతమిస్తూ యూనిట్, స్టేషన్ స్థాయులలో క్రీడలు, ఇతర సౌకర్యాలతో కూడిన మౌలిక సదుపాయాల కల్పన.
యి:-
- సామర్థ్యం పెంపు దిశగా చేపట్టిన చర్యలు… సైనికులు, అధికారులలో మానసిక శ్రేయస్సు, సామర్థ్యం పెంచేందుకు అమలు చేస్తున్న నిబంధనలు:
- సిబ్బంది మొత్తానికీ ఆయుధాలు, పరికరాలు, పరిపాలన సహా కర్తవ్య నిర్వహణ సంబంధిత అంశాలపై చక్కని శిక్షణ ఇవ్వడం. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, అప్పగించిన బాధ్యతలు-విధుల్లో వాంఛిత సామర్థ్యం పెంపొందేలా చూడటం.
- ప్రత్యేక విధుల ప్రాధాన్యం తగ్గించి, కార్యకలాపాల ప్రాతిపదికన శిక్షణ గరపడం.
- త్రివిధ దళాల్లో విధులు నిర్వర్తించినంత కాలం తమకు అప్పగించిన పాత్ర, బాధ్యతలకు అనుగుణంగా విధులు నిర్వర్తించేలా సైనికులు, అధికారుల తీర్చిదిద్ది, వారి పురోగమనానికి వీలు కల్పించే విధంగా శిక్షణ పాఠ్యప్రణాళిక రూపొందించాలి.
- తగినంత వ్యవధితో శిక్షణ కార్యక్రమంతోపాటు దైనందిన/వారంవారీ కార్యకలాపాల ప్రణాళిక.
- సైనికులు, అధికారులుసహా దేశరక్షణ సేవలోగల, ఉద్యోగ విరమణ పొందిన సిబ్బందికి జీతభత్యాలు, అలవెన్సులు, అర్హతలు, సంక్షేమ పథకాలు, నిబంధనలకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో ప్రకటించి అందరికీ చేరవేయడం ద్వారా వ్యవస్థపై విశ్వాసం, నమ్మకం తిరిగి నింపడం, ప్రేరేపించడానికి తగిన చర్యలు చేపట్టడం.
- ప్రభావవంతమైన శిక్షణ దిశగా అవసరమైన మేరకు అనుకరణ యంత్రపరికరాల వాడకం.
- కొన్ని పరికరాలు/కర్తవ్యాలపై శిక్షణకు సంబంధించి ప్రధాన సర్వీసును గుర్తించడానికి త్రివిధ దళాల్లో అధ్యయనం పూర్తయింది. అలాగే సేవలందిస్తున్న అధికారులు, సిబ్బందికి మెరుగైన శిక్షణనిచ్చేలా మూడు రకాల సర్వీసులలో ప్రధానంగా అనుసరించే ఉత్తమ పద్ధతులను పాటించాలని అధ్యయన బృందం సిఫారసు చేసింది.
- ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా శిక్షణ విధానాలపై నిరంతర సమీక్ష ఉంటుంది. ఐటీ, అలాగే ఐటీ, సైబర్, అంతరిక్షం వగైరా కొత్త విభాగాలు ప్రవేశపెట్టబడ్డాయి. అంతేకాకుండా ఇప్పటికే అందుబాటులోగల సిబ్బందిలోని ప్రతిభను వినియోగించుకునేలా శిక్షణనిచ్చే విధానాలు కూడా సమీక్షించబడ్డాయి.
లోక్‌సభలో శ్రీ గుమన్ సింగ్ దామర్ ప్రశ్నకు సమాధానంగా రక్షణశాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ ఇవాళ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం వెల్లడించారు.
***
(Release ID: 1846609)
|