ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ప్రాసెస్ చేసిన ఆహార పదర్ధాల ఎగుమతులకు డిజిటల్ వేదిక 'సంపద'
Posted On:
29 JUL 2022 1:03PM by PIB Hyderabad
వ్యవసాయ క్షేత్రం నుండి రిటైల్ దుకాణాల వరకు సమర్థమంతమైన సరఫరా గొలుసు నిర్వహణతో.. మేటి ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్యాకేజీగా ముందుకు తీసుకుతెచ్చిన ‘ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన (పీఎంకేఎస్‌వై)’ పథకాన్ని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. ఇది దేశంలోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగ వృద్ధికి ఊతం అందించడమే కాకుండా రైతులకు మెరుగైన రాబడిని అందించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, వ్యవసాయ ఉత్పత్తుల వృథా తగ్గించడం, ప్రాసెసింగ్ స్థాయిని పెంచడం, ప్రాసెస్ చేసిన ఆహారాల ఎగుమతిని మెరుగుపరచడంలో కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది. సంపద అనేది ఒక డిజిటల్ ప్లాట్‌ఫారమ్, దీని ద్వారా పీఎంకేఎస్‌వై యొక్క వివిధ ఉప-పథకాల కింద మంజూరు చేయబడిన వివిధ ప్రాజెక్ట్‌లు పర్యవేక్షించబడతాయి.
853 ప్రాజెక్ట్‌లకు అనుమతులు..
పీఎంకేఎస్‌వై యొక్క వివిధ ఉప-పథకాల మొత్తం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం మొత్తం 853 ప్రాజెక్ట్‌లకు అనుమతులు జారీ చేయడమైంది. వీటి మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.21058.29 కోట్లు. ఆయా ప్రాజెక్టులు రూ.6673.74 కోట్ల గ్రాంట్-ఇన్-ఎయిడ్‌తో అనుమతులు జారీ చేయబడినవి. ఇందులో సుమారు రూ.4444.25 కోట్ల నిధులు విడుదల చేయడమైంది. ఈ ప్రాజెక్టుల ప్రాసెసింగ్ మరియు సంరక్షణ సామర్థ్యం వరుసగా సంవత్సరానికి 216.81 లక్షల మెట్రిక్ టన్నులు. మరియు సంవత్సరానికి 70.014 లక్షల మెట్రిక్ టన్నులు. తద్వారా 41,42,917 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు 10,61,361 మందికి ఉపాధిని కల్పించబడుతోంది. ఈ సమాచారాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1846286)
Visitor Counter : 176