వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రభుత్వ చర్యలతో పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు


2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇదివరకెన్నడూ లేని విధంగా 6,31,050 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పొందిన దేశం

ఉత్పత్తి రంగాల్లో 89,766 (2020-21 ఆర్థిక సంవత్సరం) కోట్ల రూపాయల నుంచి 1,58,332 (2021-22 ఆర్థిక సంవత్సరం) కోట్ల రూపాయలకు చేరిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

Posted On: 29 JUL 2022 12:43PM by PIB Hyderabad

కొన్ని వ్యూహాత్మకంగా ముఖ్యమైన రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాల్లో ఆటోమేటిక్ రూట్ లో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం సరళీకృత పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నది.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం నిబంధనలకు లోబడి ఉత్పత్తిరంగంలో ఆటోమేటిక్ రూట్ లో పెదేశీ పెట్టుబడులను అనుమతించడం జరుగుతుంది. ఉత్పత్తి కార్యక్రమాలను పెట్టుబడి పెట్టే సంస్థ  స్వయంగా లేదా చట్టబద్ధంగా కుదుర్చుకున్న కాంట్రాక్టు సంస్థ ప్రిన్సిపల్ నుంచి ప్రిన్సిపల్ లేదా ప్రిన్సిపల్ నుంచి  ఏజెంట్ విధానంలో సాగించవచ్చు. ఇంతే కాకుండాప్రభుత్వ అనుమతి లేకుండా  భారతదేశంలో ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను ఈ-కామర్స్,హోల్ సేల్  మరియు/లేదా రిటైల్  విధానాల్లో విక్రయించవచ్చు. 

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలో విదేశీ పెట్టుబడులు భారీగా పెరిగాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి 6,31,050 కోట్ల రూపాయల విలువ చేసే విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఉత్పత్తి రంగాల్లో కూడా పెట్టుబడులు పెరిగాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి రంగాల్లో 89,766 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి  76%  వృద్ధి సాధించి పెట్టుబడులు 1,58,332 కోట్ల రూపాయలకు చేరాయి. 

   ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి మరియు కరెంట్ అకౌంట్ లోటు (CAD)ని నిర్వహించడానికి అనుగుణంగా ద్రవ్య మరియు ఆర్థిక విధానాలను భారతదేశం అమలు చేస్తోంది. నూతనంగా ఎదురవుతున్న ఆర్ధిక అంశాలను దృష్టిలో ఉంచుకుని  ద్రవ్య మరియు ఆర్థిక సర్దుబాట్లు చేయబడతాయి.

విదేశీ ద్రవ్య నిధులు ( ఫారెక్స్) ఎక్కువగా వచ్చేలా చూసేందుకు ఆర్బీఐ అనేక చర్యలు తీసుకుంది. ఆర్బీఐ తీసుకున్న చర్యలు:-

i. పెరుగుతున్న విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంక్) [FCNR(B)] మరియు నాన్-రెసిడెంట్ (బాహ్య) రూపాయి (NRE) డిపాజిట్లను నగదు నిల్వల నిష్పత్తి (CRR) మరియు చట్టబద్ధమైన ద్రవ్య నిష్పత్తి (SLR) నుంచి మినహాయింపు,
ii. 2022 
అక్టోబర్ చివరి వరకు వడ్డీ రేట్లపై ఉన్న నిబంధనలతో సంబంధం లేకుండా  కొత్తగా  FCNR(B) మరియు NRE డిపాజిట్లను సమీకరించడానికి  బ్యాంకులకు అనుమతి,
iii. 
ఫుల్లీ యాక్సిసబుల్  రూట్ (FAR) కింద  7-సంవత్సరాలు మరియు 14-సంవత్సరాల కాలపరిమితితో   జి-సెక్షన్ల కింద యొక్క అన్ని    విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడి  జారీ చేయడానికి అనుమతి
iv. స్వల్పకాలిక పరిమితి నుండి  G-Secs మరియు అక్టోబర్ 31, 2022 వరకు  కార్పొరేట్ రుణాలు,విదేశీ పోర్ట్‌ఫోలియో  పెట్టుబడులకు  మినహాయింపు,

v. ఒక సంవత్సరం వరకు అసలు మెచ్యూరిటీతో కమర్షియల్ పేపర్ మరియు నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు   అనుమతించడం,
vi. 
స్వయంచాలక మార్గంలో బాహ్య వాణిజ్య రుణ  పరిమితిని 750 అమెరికా  మిలియన్ డాలర్ల   నుంచి లేదా ఆర్థిక సంవత్సరానికి  దాని సమానమైన 1.5 అమెరికా బిలియన్ డాలర్లకు  తాత్కాలిక ప్రాతిపదికన పెంపు  

vii. రుణగ్రహీత పెట్టుబడి గ్రేడ్ రేటింగ్‌కు లోబడి, ECB ఫ్రేమ్‌వర్క్ కింద ఆల్ ఇన్ కాస్ట్ సీలింగ్‌ను 100 బేసిస్ పాయింట్లు పెంచడంమరియు
 viii.  విదేశీ కరెన్సీ రుణాలను విదేశీ కరెన్సీ ఎగుమతులతో పాటు విస్తృతమైన తుది వినియోగ ప్రయోజనాల కోసం సంస్థలకు  రుణాలు ఇవ్వడానికి ఉపయోగించుకోవడానికి ఏడీ తరగతి -I బ్యాంకులకు అనుమతి.
వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్ ప్రకాష్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(Release ID: 1846202) Visitor Counter : 452


Read this release in: English , Urdu , Marathi