ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 28 JUL 2022 10:01AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 203.21 కోట్ల డోసులు ( 93.13 కోట్ల రెండో డోసులు + 8.16 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 42,20,625 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,46,323

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.33%

ప్రస్తుత రికవరీ రేటు 98.47%

గత 24 గంటల్లో 19,216 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,32,86,787 కు పెరిగింది.

గత 24 గంటల్లో 20,557 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 5.18%

వారపు పాజిటివిటీ రేటు 4.71%

గత 24 గంటల్లో చేసిన 3,96,783 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 87.40 కోట్ల పరీక్షలు చేశారు.  
 

****



(Release ID: 1845726) Visitor Counter : 106